Jump to content

వికీపీడియా:వికీ చిట్కాలు/సెప్టెంబరు 16

వికీపీడియా నుండి
మంచి వ్యాసం లక్షణాలు-2

మంచి వ్యాసానికి ఉండే కొన్ని లక్షణాలు. [1]

ప్రతి వ్యాసంలోను పరిచయం, ప్రధాన విషయం, ఇతర వ్యాసాలకు లింకులు బ్యాలన్స్ చేయాలి. ఒక పెద్ద విషయాన్ని విభజించి వేరు వేరు వ్యాసాలుగా చేశామనుకోండి. ప్రతి వ్యాసానికి పరిచయం అందుకు సరిపడా స్థాయిలో ఉండాలి. ఉదాహరణకు ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర, విజయనగర సామ్రాజ్యం, కృష్ణదేవరాయలు, రాయచూరు యుద్ధం - ఇవన్నీ ఒక ప్రధాన విషయంలో లోతుగా వెళ్ళినకొద్దీ ఏర్పడే వ్యాసాలు. "కృష్ణదేవరాయలు" వ్యాసంలో విజయనగర సామ్రాజ్యం గురించి పరిచయం ఉండాలి. "రాయచూరు యుద్ధం"లో కృష్ణదేవరాయలు గురించి పరిచయం ఉండాలి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా