Jump to content

వికీపీడియా:వికీ చిట్కాలు/సెప్టెంబరు 8

వికీపీడియా నుండి
కాల్పనిక సాహిత్యం గురించి

కాల్పనిక సాహిత్యం (నవలలు, సినిమాలు వంటివి) గురించి వ్రాసేటప్పుడు గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు [1] --

  • విజ్ఞాన సర్వస్వం ప్రధానం లక్ష్యం యదార్ధాలు. కల్పనలు కాదు. కనుక ఆ వ్యాసాలు యదార్ధాలను దృష్టిలో ఉంచుకొని వ్రాయాలి.
  • ఒక సినిమా గురించి వ్రాసేటప్పుడు - సినిమా నటులు, సాంకేతిక నిపుణులు, జయాపజయాలు, ఆ సినిమా ప్రభావం - ఇవన్నీ యదార్ధాలు. "సినిమా కధ" కల్పన. కనుక కధను క్లుప్తంగా ఇక్కడ వ్రాయవచ్చును. అతిగా వ్రాయ తగదు.
  • అభిప్రాయాలు - ప్రముఖ, ప్రచురిత సమీక్షలు ఓకే. మీ అభిప్రాయాలకు ఇది వేదిక కాదు. ముఖ్యంగా వివాదాస్పదమయ్యేవయితే.

ఉదాహరణకు ఈ వ్యాసాలు చూడండి - తెలుగులో మాయాబజార్ సినిమా గురించిన వ్యాసం. ఆంగ్లంలో en:The Lord of the Rings నవల గురించిన వ్యాసం.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా