వికీపీడియా:విధానాలు, మార్గదర్శకాలకు ఓటు పద్ధతి
Jump to navigation
Jump to search
తెలుగు వికీపీడియాలో విధానాలు మార్గదర్శకాలను నిర్ణయించడానికి ఏకాభిప్రాయం ప్రాతిపదిక ముఖ్యమైనది. ఏకాభిప్రాయం అంటే పూర్తి సమ్మతి కాదు. విధానాల నిర్ణయంలో ఏకాభిప్రాయానికి ప్రయత్నించటం, భిన్నాభిప్రాయాలు వున్నప్పుడు వోటు ప్రక్రియద్వారా వ్యతిరేకత ను అంచనావేసి అది తక్కువగా ఉన్నప్పుడు ప్రతిపాదన విజయవంతమైందని భావించి నిర్ణయం తీసుకోవటానికి ఈ విధానం కీలకం.
వోటింగు ప్రక్రియ పద్ధతి
[మార్చు]- చిత్తు ప్రతిపాదనపై చర్చలు జరిపి, వీలైనంత ఎక్కువ మందికి సమ్మతమైన రూపంలో మాత్రమే ప్రతిపాదనను వోటు ప్రక్రియలో పెట్టాలి. దీనికి కనీస కాలపరిమితి వారం రోజులు.
- ఓటింగ్ ప్రక్రియకు కాలం రెండు వారాలు (వోటు ప్రారంభించిన రోజు కాక, మరుసటి రోజు నుండి 14 రోజులు (UTC 23:59 కాలంతో అంతమవుట)
- ఓటు హక్కు గలవారు: తెవికీలో ఓటింగు ప్రారంభం తేదీ యొక్క నెలకి ముందలి రెండు నెలలు కాక అంతకు ముందు నెలచివరి తేదీవరకు గల గణాంకాల ప్రకారం తెవికీలో ఏవైనా 100 మార్పులు చేసినవారు ఓటింగుకు అర్హులు. (దీనికొరకు గణాంకాల జాబితా మరియు మార్పుల లెక్కింపు ఉపకరణం వాడుకోవచ్చు.)
- ప్రక్రియ నిర్వహించేవారు: నిర్వాహకులు, అధికారులు మరియు ఓటుహక్కు గలవారు. ప్రక్రియ నిర్వాహకులు కూడా ఓటు చేసేందుకు అర్హులే.
- కనీసం పాల్గొనవలసిన వోటర్లు: 5 గురు. వారిలో కనీసం పాల్గొనవలసిన నిర్వాహకులు లేక అధికారులు: 2
- నిర్ణయానికి కావలసిన మద్దతు: పాల్గొన్న వారిలో 80 శాతం మంది మద్ధతు. (మద్దతు, తటస్థం, వ్యతిరేకం ఎంపికలున్నప్పుడు, తటస్థంగా ఓటు చేసిన వారిని కనీసం ఓటర్ల లెక్కింపులో మాత్రమే వాడుకోవాలి, ఆధిక్యత శాతం లెక్కలో పరిగణించకూడదు)
- నిర్ణయం ప్రకటించేవారు: ప్రక్రియ నిర్వహించేవారు.
- వోటింగు ఫలితంపై అభ్యంతరాలకు కాలం: నిర్ణయం ప్రకటన తేదీ నుండి మూడు రోజులు
- నిర్ణయం అమలు ప్రారంభ తేది: వోటింగుపై అభ్యంతరాలు పరిష్కరించబడిన రోజు (సాధారణంగా నిర్ణయం ప్రకటించిన సమయం నుండి వారం రోజులు). దీనిపై తుది నిర్ణయం, ప్రక్రియను నిర్వహిస్తున్న లేక వోటింగులో పాల్గొన్న తొలి నిర్వాహకుడిది.
- ఒకసారి ప్రక్రియ పూర్తయిన తరువాత, పూర్తయిన తేదీనుండి ఆదే విషయంపై మార్పులతో ఇంకొక వోటు ప్రక్రియ ప్రారంభించడానికి 60 రోజుల అంతరం వుండాలి.
పద్ధతి వాడినవి
[మార్చు]- 2013-04-01, వికీపీడియా:మొలకపేజీల నియంత్రణ విధానం
- 2020-09-29, వికీపీడియా:యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ విధానం-2