వికీపీడియా:వివాదాస్పద వ్యాసాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వివాదాస్పద వ్యాసాలు, సహజంగా వివాదాలకు కేంద్రంగా మారుతాయి. కాబట్టి ఇటువంటి వ్యాసాలు తయారు చేసేటప్పుడు వాటిని తటస్థ దృక్కోణంలో ఉంచడానికి కొంచెం ఎక్కువగా కృషిచేయాల్సి ఉంటుంది.

వివాదాన్ని వివరించండి

[మార్చు]

ఆ వ్యాసం ఒక వ్యక్తి లేదా ఒక సామాజిక వర్గానికి సంభందించిన వివాదం అయితే, మొదటగా ఈ వివాదంపై వారికి ఉన్న అభిప్రాయం ఏమిటో, అది నిజం అని మీకు అనిపించకపోయినా, వ్రాయండి. మీకు మీరే, "ఈ వివాదాన్ని ఎలా వివరిస్తే బాగుంటుందో" అనే ప్రశ్న వేసుకోండి. మీ అభిప్రాయాలను పంచుకునేందుకు వికీపీడియా వేదిక కాదు, అలా మీ అభిప్రాయాలను తెలిపి, ఆ తరువాత వాటిని సమర్ధించుకోవాలని చూడటం మీ పని కాదు; సమస్యను అన్ని వైపుల నుండి చూపించాల్సిన బాధ్యత మీపై ఉంటుందని మరువరాదు.

వికీపీడియా తటస్థ దృక్కోణంలోని మార్గదర్శకాల ప్రకారం, అల్పసంఖ్యాక అభిప్రాయాలకు, ఇతర వర్గాల అభిప్రాయాలతో సమతూకం ఇవ్వనవసరం లేదని కూడా గుర్తుంచుకోవాలి.

వికీపీడియా:తటస్థ దృక్కోణంను కూడా చూడండి.

నిందాస్తుతులను చేస్తున్నప్పుడు జాగ్రత్త వహించండి

[మార్చు]

వికీపీడియాలో రాస్తున్న చాలా వ్యాసాలలో మూలాలను పేర్కొనకుండా వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు. చాలా సార్లు ఆ వ్యాఖ్యానాలకు మూలాలను పేర్కొనమనడం అసమంజసంగా అనిపిస్తూ ఉంటుంది.

కానీ వివాదాస్పద వ్యాసాలు లేదా వ్యాసాలలోనే వివాదాస్పద వ్యాఖ్యానాలు చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తలు వహించాలి. వర్తమాన ఘటనలు, మతం లేదా కులాలు లాంటివాటికి సంభందించిన వ్యాసాలకు మెరుగులు దిద్దుతున్నప్పుడు మరింత జాగ్రత్తవహించాలి. వివాదాస్పద అంశాలకు జనబాహుల్యంలో బాగా ప్రచారంలో ఉన్న అభిప్రాయాలకు, మీరు రాస్తున్న వ్యాఖ్యానాలు వేరుగా ఉంటేగనక అటువంటి వ్యాఖ్యానాలకు విస్తృతమైన అధారాలను చూపించాల్సి ఉంటుంది. ఈ క్రింది విషయాలను కూడా పరిగణనకు తీసుకోండి:

పదాలను జాగ్రత్తగా ఎంచుకోండి

[మార్చు]

అభియోగించబడింది, కొంతమంది అనుకుంటూ ఉంటారు, లభించిన ఆధారాలను పరిశీలిస్తే, అని చెబుతూ ఉంటారు; లాంటి పదప్రయోగాలను వాడకుండా ఉండటం మంచిది. ఇలాంటి పదప్రయోగాల వలన మీరు చెప్పదల్చుకున్న విషయాలకు తటస్థ దృక్కోణంలో చూపిస్తున్న భ్రమ కల్పిస్తూ, పక్షపాతవైఖరిని కప్పిపుచ్చటానికి ప్రయత్నిస్తున్నారేమో అని ఒకసారి ప్రశ్నించుకోండి. మీ వాఖ్యాలలో "అని చెబుతూ ఉంటారు" అనే పదప్రయోగాన్ని వాడుతున్నప్పుడు, ఆ వాఖ్యాన్ని చెప్పిన వాళ్లు అలా చెబుతున్నారు, కానీ జరిగినది అది కాదుగావచ్చు అని వ్యాసాన్ని చదివేవాళ్లు అనుకునే ప్రమాదం ఉంది. కొన్ని ఉదాహరణలు:

  • ... చాలామంది అనుకునేదాన్ని బట్టి ఈ పనిచేసినది ... (ఇది ఒక మంచి ప్రయోగం)
  • ... వాళ్లను ఇండ్లలో నుండి తరిమేసారని చెబుతూ ఉంటారు ... (తరిమారని చెబుతున్న వాళ్లను నిజంగానే తెరిమేసుంటారు, కాబట్టి ఇక్కడ విషయాన్ని సూటిగా చెప్పాలి.)

వాస్తవాలకు ఆధారాలను చూపించండి

[మార్చు]

జరిగిపోయిన సంఘటనలను పేర్కొంటున్నప్పుడు, మీ వ్యాఖ్యానాలకు నమ్మదగిన సమాచార మూలాలను తెలుపండి. ఇటువంటి మూలాలు, ఒక స్వతంత్ర్య సంస్థ నివేదిక ఆధారంగా ఉండేటట్లు చూసుకోవడం ఆదర్శప్రాయం, కానీ చాలా సందర్భాలలో మనకు అటువంటి సమాచారం లభ్యమవ్వదు. అటువంటి వాటికి ఇంటర్నెట్టు ఆధారిత వార్తా నివేదికలను, మీరు పేర్కొంటున్న వాస్తవాలకు ఆసరాగా చూపించవచ్చు. ఇవి CNN, BBC లాంటి నాణ్యమైన వార్తాసంస్థలు లేదా UN లాంటి స్వతంత్ర్య సంస్థల నివేదికలను పేర్కొనాలి. అంతేకాదు, ఈ స్వతంత్ర్య సంస్థలకు కూడా ఉండే పక్షపాత వైఖరిని కూడా పరిగణనలోనికి తీసుకోవాలి.

వ్యాఖ్యానాలకు ఆధారాలను చూపించండి

[మార్చు]

వ్యక్తులు, సంఘటనలు లేదా చర్యలపై వ్యాఖ్యానిస్తున్నప్పుడు, అంగీకారాత్మక మూలాలను పేర్కొనాలి. ప్రముఖ వార్తా పత్రికలలో వచ్చే వార్తలను పేర్కొనడం ఉత్తమం, కానీ పాత్రికేయులు నిష్పక్షపాతంగా వార్తలను ప్రచురిస్తారని మాత్రం భావించకండి. ప్రత్యామ్నాయంగా, పక్షపాతవైఖరిని ప్రదర్శించే వార్తా మూలాల నుండి వాక్యాలను సేకరించినప్పుడు, ఆ పత్రికలు ఎలాంటి పక్షపాతాన్ని ప్రదర్శిస్తాయో ఖచ్చితమైన పదాలతో నిర్వచించండి, ఉదాహరణకు:

  • భారతీయ మహిళల పత్రిక ...
  • వెనుకబడిన కులాల ఐక్య సంఘ ...
  • వేర్పాటువాద సంఘ ...

ఎప్పటికప్పుడు మీరు ఆధారాలుగా పేర్కొంటున్న మూలాలలో ఏమన్నా పక్షపాతధోరని ఉందేమో పసిగట్టడానికి ప్రయత్నించండి (ఈ పక్షపాత ధోరణి ఆర్ధికానికి, వ్యవస్థకు లేదా వ్యక్తిగతం ఏదయినా కావచ్చు). ఒకవేళ మీ వ్యాఖ్యానాలకు, మీరు పేర్కొన్న మూలమే వివాదాస్పదంగా ఉంటే, అప్పుడు అటువంటి వ్యాఖ్యానాలను చేయకపోవడమే మంచిది; దానికి బదులుగా మీ ఉద్దేశాలను చర్చించిన ఒక బయటి వ్యాసానికి లింకు ఇవ్వాలి. ఉదాహరణకు, తీవ్రవాదికీ, స్వాతంత్ర్య సమరయోధుడికీ, ఉన్న తేడా గుర్తించడంలోనే చాలా సందర్భాలలో వివాదాన్ని సృష్టిస్తుంది. అందరూ అంగీకరించే కోణం నుండి కాకుండా సమస్యను కొత్త కోణం నుండి చూపిస్తున్నప్పుడు, ఆధారాలను ఒకట్టి కంటే ఎక్కువ మూలాల నుండి సేకరించి, వాటికి భిన్న దృక్పదాలు ఉండేటట్లు చూడటం మంచిది.

మార్పులు చేసే పద్దతులు

[మార్చు]

మీరు ఒక వివాదాస్పద వ్యాసానికి మార్పులు చేస్తునట్లయితే, అందులోని వివాదాస్పదం కాని విషయాలను, వివాదాస్పదమైన వాటి నుండి వేరు చేయండి. మొదటగా వివాదాస్పదం కాని మార్పులను చేయండి, ఆ తరువాత వివాదాస్పదం అని మీకు అనిపిస్తూ ఉండే మార్పులను చేయండి. వేరే సభ్యుడు మీరు చేసిన వివాదాస్పదమైన మార్పులను రద్దుచేసినా వివాదాస్పదం కాని మార్పులు అలాగే మిగిలుంటాయి.