వికీపీడియా:వీడియోవికీ/మలేరియా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వీడియోవికీ/మలేరియా (ట్యుటోరియల్)
దస్త్రం:వికీపీడియా-వీడియోవికీ-మలేరియా.webm
వికీమీడియా కామన్స్ లింకు
వీడియో రూపొందించడానికి సోపానాలు
1వాయిస్ ఓవర్ చేర్చండి
2వికీమీడియా కామన్స్ కు అప్లోడ్ చేయండి

పరిచయము[మార్చు]

మలేరియా (Malaria), దోమల ద్వారా వ్యాపించే ఒక రోగం. మనిషి రక్తంలో పరాన్నజీవులు చేరినప్పుడు మలేరియా సోకుతుంది.[1]

రోగ లక్షణాలు[మార్చు]

ఇది సాధారణంగా జ్వరం, అలసట, వాంతులు, తలనొప్పి వంటి లక్షణాలను కలిగిస్తుంది. [2]

తీవ్రమైన రోగ లక్షణాలు[మార్చు]

తీవ్రమైన సందర్భాల్లో మలేరియా పచ్చకామెర్లు, మూర్ఛలు, కోమా లేదా మరణానికి కారణమవుతుంది.[2]

లక్షణాలు కనిపించే సమయం[మార్చు]

వ్యాధి సోకిన దోమ కాటుకు గురైన పది నుంచి పదిహేను రోజుల తరువాత లక్షణాలు కనిపించటం మొదలవుతాయి.[1]


సరియైన చికిత్స లేకపోవడం వల్ల ప్రమాదం[మార్చు]

సరియైన చికిత్స అందించకపోతే, కొన్ని నెలలు గడిచిన తరువాత, వ్యాధి పునరావృతమవుంటుంది.[1]

పాక్షిక రోగనిరోధక శక్తి[మార్చు]

కొద్ది కాలం కిందే వ్యాధి నుండి బయటపడినవారికి, వ్యాధి మళ్ళీ సంక్రమిస్తే తేలికపాటి లక్షణాలే కనిపిస్తాయి. రోగనిరోధక శక్తి వల్ల ఇలా అవుతుంది. కొన్ని నెలలు, సంవత్సరాలు గడిచిన తరువాత మలేరియాకు సంబంధించి నిరోధక శక్తి ఏమీ ఉండదు.[2]

కారణాలు[మార్చు]

ప్లాస్మోడియం క్రిమి ప్రజాతికి చెందిన ఒంటె-కణ సూక్ష్మజీవులు మలేరియాకు మూలకారణం.[1]

ప్రాథమిక సంక్రమణ[మార్చు]

ఈ వ్యాధి సాధారణంగా వ్యాధి సోకిన ఆడ అనోఫిలస్ దోమలు ద్వారా వ్యాపిస్తుంది. దోమ కాటు వేసేటప్పుడు దోమ లాలాజలం నుండి పరాన్నజీవులను మనిషి రక్తంలోకి ప్రవేశిస్తాయి.[1]

కాలేయానికి సంక్రమణ[మార్చు]

పరాన్నజీవులు రక్తం ద్వారా కాలేయానికి ప్రయాణిస్తాయి. అక్కడ అవి పరిపక్వమై, పునరుత్పత్తి చెందుతాయి.[2]

మలేరియాలోని రకాలు[మార్చు]

ప్లాస్మోడియం అనే పరాన్నజీవి ఐదు జాతులు మానవులకు సోకుతాయి, వ్యాప్తి చెందుతాయి. చాలావరకు మరణాలు పి-ఫాల్సిపరం వల్ల సంభవిస్తాయి.[1]

రోగ నిర్ధారణ[మార్చు]

మలేరియా సాధారణంగా రక్తాన్ని సూక్ష్మ పరీక్ష చేయడం ద్వారా నిర్ధారిస్తారు. పరిస్థితిని బట్టి కొన్ని సందర్భాలలో యాంటిజెన్-ఆధారిత పరీక్షలు లేదా పాలీమెరేస్ చైన్ రియాక్షన్ పరీక్షలు కూడా నిర్వహిస్తారు.[2]

నివారణ[మార్చు]

దోమల వలల ద్వారా దోమ కాటును నివారించడం ద్వారా వ్యాధి ప్రమాదాన్ని తగ్గించవచ్చు. అలాగే పొలాలలో పురుగుమందులను చల్లడం, నిలిచి ఉన్న నీటిని తీసివేయటం వంటి దోమల నియంత్రణ చర్యలతో కూడా వ్యాధి వ్యాప్తిని తగ్గించవచ్చు.[2]

శిశువులు, గర్భిణీలకు రోగనిరోధకాలు[మార్చు]

సల్ఫాడాక్సిన్, పిరిమెథమైన్ కలసిన మందులు వాడి శిశువులలోను, మొదటి మూడునెలల గర్భంతో ఉన్న గర్భిణిలకూ మలేరియా అధిక రేటు ఉన్న ప్రాంతాలలో వ్యాధి సంక్రమణ ఆపవచ్చు.[1]

టీకా[మార్చు]

సమర్థవంతమైన టీకా (వ్యాక్సిన్) అవసరం ఉన్నప్పటికీ ఇప్పటి దాకా లేదు. అభివృద్ధి చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.[1]

చికిత్స[మార్చు]

మలేరియాకు సిఫార్సు చేసిన చికిత్స ఆర్టెమిసినిన్ ఉన్న యాంటీ మలేరియల్ మందులు. రెండవ దశలో మెఫ్లోక్విన్, ల్యూమ్ఫాంట్రిన్ లేదా సల్ఫాడాక్సిన్ పిరిమెథమైన్ వంటి మందులు ఇవ్వొచ్చు.[3][1]


ఇతర చికిత్సలు[మార్చు]

ఆర్టెమిసినిన్ అందుబాటులో లేకపోతే క్వినైన్, డాక్సీసైక్లిన్తో పాటు వాడవచ్చు.[3]

సాంక్రమిక రోగ విజ్ఞానం[మార్చు]

ఈ వ్యాధి ఉష్ణమండల, ఉపఉష్ణమండల ప్రాంతాలలో విస్తృతంగా ఉంది, భూమధ్యరేఖ చుట్టూ ఉన్న ప్రదేశాలలో 2016లో 21.6 కోట్ల కేసులు నమోదు అయ్యాయి.[4]

మరణం ప్రమాదం[మార్చు]

ప్రతి ఏటా, మలేరియా మూలంగా సుమారుగా 4,45,000 నుండి 7,31,000 మంది దాకా మరణిస్తున్నారు. ఈ మరణాల్లో 90% ఆఫ్రికాకు చెందినవి.[5]

వ్యాధి వ్యాపించే రీతి[మార్చు]

2000 - 2015 సంవత్సరాల మధ్య ప్రపంచవ్యాప్తంగా వ్యాధి వ్యాప్తి 37% తగ్గింది. కానీ 2014 నుండి వ్యాప్తి పెరగటం మొదలైంది, ఆ సంవత్సరంలో సుమారు 19.8 కోట్ల కేసులు నమోదు అయ్యాయి.[6]

ప్రమాదంలో ఉన్న జనాభా[మార్చు]

మలేరియా సాధారణంగా పేదరికంతో ముడిపడి ఉంటుంది. అలాగే ఆర్థిక అభివృద్ధిపై పెద్ద ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.[7]

ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం[మార్చు]

ఉదాహరణకు, ఆఫ్రికాలో, ఆరోగ్య సంరక్షణ ఖర్చులు పెరగడం, పని చేసే సామర్థ్యం కోల్పోవడం మరియు పర్యాటక రంగంపై ప్రతికూల ప్రభావాల వల్ల సంవత్సరానికి 12 బిలియన్ డాలర్లు నష్టం వాటిల్లుతుందని అంచనా.[8]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 1.8 "మలేరియా ఫాక్ట్ షీట్ N°94". ప్రపంచ ఆరోగ్య సంస్థ. మార్చి 2014. Archived from the original on 3 సెప్టెంబరు 2014. Retrieved 14 నవంబరు 2019.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 హెచ్ కార్బాల్లో (2014). "ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ మానేజ్మెంట్ అఫ్ మస్కిటో-బోర్న్ ఇల్లనెస్". ఎమెర్జెసీ మెడిసిన్ ప్రాక్టీస్. 16 (5). Archived from the original on 2016-08-01.
  3. 3.0 3.1 గైడ్లైన్స్ ఫర్ ది ట్రీట్మెంట్ అఫ్ మలేరియా (2nd ed.). జెనీవా: ప్రపంచ ఆరోగ్య సంస్థ. 2010. p. ix. ISBN 978-92-4-154792-5.
  4. ప్రపంచ మలేరియా రిపోర్ట్ 2017 (PDF). ప్రపంచ ఆరోగ్య సంస్థ. 2017. ISBN 978-92-4-156552-3.
  5. "మలేరియా ఫాక్ట్ షీట్ N°94 N°94". ప్రపంచ ఆరోగ్య సంస్థ. Archived from the original on 3 సెప్టెంబరు 2014. Retrieved 2 ఫిబ్రవరి 2016.
  6. ప్రపంచ మలేరియా రిపోర్ట్ 2014. జెనీవా: ప్రపంచ ఆరోగ్య సంస్థ. 2014. pp. 32–42. ISBN 978-92-4-156483-0.
  7. గొల్లిన్ డి; జిమ్మెర్మాన్ సి. మలేరియా: డిసీస్ ఇంపాక్ట్date=August 2007 (PDF) (Report). ఇన్స్టిట్యూట్ ఫర్ ది స్టడీ అఫ్ లేబర్. Archived (PDF) from the original on 2016-03-18.
  8. గ్రీన్వుడ్ బిఎం; బోజంగ్ కె; విట్టి సిజె; టార్గేట్ట్ జిఏ (2005). "మలేరియా". లాన్సెట్. 365 (9469): 1487–98. doi:10.1016/S0140-6736(05)66420-3. PMID 15850634.