Jump to content

వికీపీడియా:వ్యాససృష్టికి మార్గసూచీ/విషయ ప్రాముఖ్యత

వికీపీడియా నుండి

అన్నిటికంటే ముందు, వికీపీడియా ఒక విజ్ఞానసర్వస్వం. అంటే వికీపీడియాలో ఉన్న అంశాలు విజ్ఞానసర్వస్వ స్థాయికి చెందినంత ప్రాముఖ్యత కలిగి ఉండాలి.

విషయ ప్రాముఖ్యత అంటే ఏంటి?
వ్యాస విషయానికి, దానికి సంబంధం లేని విశ్వసనీయ ప్రచురణల్లో ప్రముఖంగా కవరేజి వచ్చి ఉంటే, వికీపీడియాలో దాని గురించి వ్యాసం రాసేందుకు అవసరమైన అర్హత దానికి ఉన్నట్లే అని భావిస్తారు.


ఏదైనా విషయం గురించి

ఆ విషయానికి ప్రాముఖ్యత ఉన్నట్లుగా భావిస్తారు. వికీపీడియాలో చోటుచేసుకోవాలంటే విషయాలకు కనీస స్థాయి ప్రాముఖ్యతైనా ఉండాలి. దీంతో ఆ విషయంపై ఒక విజ్ఞానసర్వస్వ వ్యాసాన్ని రాసేందుకు అవసరమైనన్ని నిర్ధారించుకోగల మూలాలు లభిస్తాయి.

ఏది వికీపీడియా కాదు: పైన చూపిన విషయ ప్రాముఖ్యత ప్రమాణానికి తోడు, విషయం విజ్ఞానసర్వస్వ యోగ్యంగా ఉండాలి. తరచూ అడిగే ప్రశ్నలు (FAQ), వీడియో గేము గైడ్లు, స్మారకాలు, మన్యువళ్ళు, డైరెక్టరీలు, లింకుల జాబితాలు, వ్యాపార ప్రకటనలు, స్వీయ ప్రచారాలు, నిఘంటు నిర్వచనాలు మొదలైనవాటికి విజ్ఞానసర్వస్వ యోగ్యత లేదు. అలాంటి వ్యాసాలను సత్వరమే తొలగించేస్తారు.


మీరు తలపెట్టిన వ్యాసానికి విషయ ప్రాముఖ్యత ఉందా?

నా వ్యాసం విషయ ప్రాముఖ్యత ఉన్నదే, అది విజ్ఞానసర్వస్వ యోగ్యత కలిగినదే

నా వ్యాస విషయానికి అంతగా ప్రాముఖ్యత లేదు (నేనేం చెయ్యాలి?)