వికీపీడియా:శిక్షణ శిబిరం/ప్రభుత్వ తెలుగు అధ్యాపకులకు తెవికీ శిక్షణ
డిగ్రీ స్థాయి తెలుగు పాఠ్యాంశాల్లో తెలుగు వికీపీడియా గురించి ఉండడం గమనించిన సీఐఎస్-ఎ2కె, తెలుగు భాష అధ్యాపకుల కోసం వికీపీడియా శిక్షణ మాడ్యూల్‌ని అభివృద్ధి చేయడం ప్రారంభించింది. ఇది క్రమేపీ ఇలా పాఠ్యాంశాల్లో వికీపీడియా గురించి ఉన్న ఇతర భాషలకు కూడా విస్తరించాలన్న ఆలోచన ఏ2కెకి ఉంది. అధ్యాపకులకు భాషపై ఉండే పట్టు వల్ల వీరికి వికీపీడియా గురించి, వికీపీడియాలో చేయదగ్గ కృషి గురించి నేర్పిస్తే వారు స్వేచ్ఛా విజ్ఞానానికి తమవంతు సాయం చేయడమే కాకుండా వారు పాఠాల్లో వికీపీడియా గురించి, ఇతర డిజిటల్ మాధ్యమాల గురించి నేర్పించేందుకు మెరుగైన నైపుణ్యాలు సంతరించుకోగలుగుతారన్నది ఆలోచన. ఈ ప్రయత్నాన్ని మొట్టమొదట తెలుగు వికీపీడియాతో సీఐఎస్-ఎ2కె ప్రారంభిస్తోంది. అందులో భాగంగానే "వికీపీడియా:శిక్షణ శిబిరం/ప్రభుత్వ తెలుగు అధ్యాపకులకు తెవికీ శిక్షణ" అన్నది రూపుదిద్దుకుంది
నేపథ్యం
[మార్చు]2024 నాటికి వివిధ భారతీయ భాషల పాఠ్యాంశాల్లో ఒక పాఠం కానీ, ఒక విభాగం కానీ ఆయా భాషల వికీపీడియాల గురించి ఉంది. ఉదాహరణకు, ఆంధ్రప్రదేశ్‌లోని రెండవ సెమిస్టర్ డిగ్రీ విద్యార్థుల తెలుగు పాఠ్యపుస్తకంలో "తెలుగు - సాంకేతిక" అన్న పాఠ్యాంశంలో తెలుగు వికీపీడియా గురించి ముఖ్యమైన భాగంగా ఉంది. 2021 తర్వాత వివిధ భారతీయ భాషల పాఠ్య పుస్తకాల్లో ఇలా ఆయా భాషల వికీపీడియాల గురించి చోటుచేసుకుందని తేలుతోంది. గత పదేళ్ళుగా పాఠ్యాంశాల్లోనూ, బోధనాంశాల్లోనూ భాగంగా ఆయా భాషల వికీపీడియాలను ఉపయోగించాలని ఏ2కె రకరకాల వికీపీడియా విద్యా కార్యక్రమాల ద్వారా చేసిన కృషి నేపథ్యంలోంచి చూస్తే ఈ పరిణామం చాలా మంచి అవకాశంగా నిలుస్తోంది.
యాక్సెస్ టు నాలెడ్జ్ భారతీయ భాషలను బోధించే అధ్యాపకులకు తమ భాషల్లో వికీపీడియా గురించి నేర్పించే శిక్షణ ప్రణాళిక రూపొందించి ప్రవేశపెట్టాలని ఆశిస్తోంది. ఈ శిక్షణ ద్వారా అధ్యాపకులకు వికీపీడియా గురించి, దాని పనితీరు గురించి, దానిలో ఎలా కృషిచేయవచ్చన్నదాని గురించి లోతైన అవగాహన కలుగుతుంది.
కార్యప్రణాళిక
[మార్చు]ఈ ప్రయత్నం కింద ఈ కింది కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము:
- ఉభయ గోదావరి జిల్లాల ప్రభుత్వ తెలుగు అధ్యాపకులకు తెవికీ శిక్షణ - 19, 20 ఏప్రిల్ 2024 - తాడేపల్లిగూడెం