Jump to content

వికీపీడియా:సాధారణ పదదోషాలు - తప్పొప్పుల పట్టిక

వికీపీడియా నుండి

తెలుగులో సర్వ సాధారణంగా కనిపించే పదదోషాలను గుర్తించి, వాటికి సరైన పదాలను సూచించడం ఈ వ్యాస లక్ష్యం. వ్యాకరణ రూపాలలోని దోషాలు దీని పరిధిలోకి రావు. కేవలం పద స్వరూపంలో సాధారణంగా కనిపించే తప్పులకి మాత్రమే ఇది పరిమితం. ఇందులో పదాలని చేర్చే ముందు నిఘంటువులో[1] సరిచూడ్డం మంచిది.

ఈ దిగువన ఉన్న జాబితాలోని అచ్చుతప్పులను బాటు ద్వారా యాంత్రికంగా వికీపీడియా మొత్తం దిద్దించబడుతుంది. కాబట్టి ఈ దిగువ పట్టికలో ఉన్న విధంగానే మీరు చేర్చాలనుకున్న అచ్చుతప్పులు చేర్చండి. కొత్త అచ్చుతప్పులను చేర్చటానికి అనుసరించవలసిన పద్ధతి ఈ దిగువన గమనించండి.

# తప్పు - ఒప్పు

తప్పొప్పుల పట్టిక

[మార్చు]
సవరణల పట్టిక
తప్పు/శైలికి విరుద్ధం ఒప్పు/శైలికి అనుగుణం
ఆశక్తి, ఆశక్తులు ఆసక్తి, ఆసక్తులు
భాద్యత బాధ్యత
చేధించు ఛేదించు
కధ కథ
శాఖాహారము శాకాహారము
భాష్పము బాష్పము
ఆస్థి ఆస్తి
భాందవ్యము బాంధవ్యము
అస్థిత్వము అస్తిత్వము
అర్జనుడు అర్జునుడు
ధనుంజయుడు ధనంజయుడు
మహత్యము మాహాత్మ్యము
రాయభారము రాయబారము
భాద బాధ
ధృఢము దృఢము
అబద్దం అబద్ధం
భాద్యత బాధ్యత
బేధం భేదం
రుషి ఋషి
వశిష్టుడు వశిష్ఠుడు
విబాగము విభాగము
దశరధుడు దశరథుడు
భందము, భంధము, బందము బంధం
అనుభందము, అనుభంధము, అనుబందము అనుబంధం
శాఖాహారం శాకాహారం
సమైఖ్య సమైక్య
స్మశానము, స్మశానం శ్మశానం
"కారణములను" (శైలి) కారణాలను
డబుల్ స్పేసు సింగిల్ స్పేసు
వ్యాకరణ చిహ్నాల ముందు ఖాళీ పెట్టడం, చిహ్నం తరువాత పెట్టకపోవడం (శైలి) చిహ్నానికి ముందు ఖాళీ ఉండకూడదు, తరువాత ఉండాలి