వికీపీడియా:సాఫ్ట్‌వేరు నోటీసులు
ఈ పేజీ, వికీపీడియా లోని ఒక విశేషం గురించీ దాన్ని అమలు చేసే విధానం గురించీ వివరించే ఎలా చెయ్యాలి అనే మార్గసూచిక లోని భాగం. |
వివిధ వికీపీడియను సమూహాలకు సందేశాలను చూపేందుకు వికీపీడియాలో వివిధ సాఫ్ట్‌వేర్ నోటీసులు ఉన్నాయి. ఈ సందేశాలు సాధారణంగా పేజీలో పైన ప్రకటనల్లాగా కనిపిస్తాయి.
కేంద్రీయ నోటీసు
[మార్చు]వికీమీడియాఅ ఫౌండేషనుకు చెందిన అన్ని ప్రాజెక్టులలోని వినియోగదారులందరికీ, లేదా ఎంచుకున్నదాన్ని బట్టి ఒక నిర్దిష్ట భాషలోని వినియోగదారులందరికీ, చూపిస్తుంది. ఈ నోటీసును మెటావికీలో, meta:Special:CentralNotice అనే పేజీలో నియంత్రిస్తారు. మెటాలో ఈ పేజీకూడా చూడండి: meta:CentralNotice.
సైట్ నోటీసు
[మార్చు]సైట్ నోటీసు వికీపీడియాలో లాగినైన వాడుకరులందరికీ కనిపిస్తుంది. ఇది పేజీ శీర్షికకు పైన కనిపిస్తుంది.జావాస్క్రిప్టు మద్దతు ఉన్న వాడుకరులకు మాత్రమే దీన్ని చూపిస్తుంది. [ఈ నోటీసును తొలగించు] నొక్కి, వాళ్ళు దాన్ని కనబడకుండా చేసుకోవచ్చు. వికీపీడియా లోని మీడియావికీ:Sitenotice, మీడియావికీ:Sitenotice id అనే రెండు పేజీల ద్వారా దీన్ని నియంత్రించవచ్చు.
యానన్ నోటీసు
[మార్చు]అజ్ఞాత వినియోగదారులకు మాత్రమే దీన్ని చూపుతుంది. ఇది ఖాళీగా ఉంటే, సైట్ నోటైసునే అజ్ఞాతలకు కూడా చూపిస్తుంది. ఇది పేజీ శీర్షిక పైన కనిపిస్తుంది. మీడియావికీ:Anonnotice అనే పేజీ నుండి దీన్ని నియంత్రించవచ్చు.
వీక్షణ జాబితా నోటీసు
[మార్చు]వీక్షణ జాబితాను వాడే వాడుకరులందరికీ దీన్ని చూపుతుంది. వీక్షణ జాబితాలో అడ్డంగా ఉండే గీతకు పైన ఇది కనిపిస్తుంది. దీన్ని మీడియావికీ:Watchlist-messages పేజీ నుండి నియంత్రిస్తారు. మీడియావికీ:Common.js/watchlist.js లో కనిపించే జావాస్క్రిప్ట్‌ను ఉపయోగించి దీన్ని కనబడకుండా చేయవచ్చు.
జియో నోటీసు
[మార్చు]ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలోని వినియోగదారులకు మాత్రమే ప్రదర్శించే నోటీసు ఇది. అయితే భౌగోళిక స్థాన నిర్థారణ ఖచ్చితంగా ఉండకపోవచ్చు. దీన్ని మీడియావికీ:Geonotice.js నియంత్రిస్తుంది. చూడండి: వికీపీడియా:జియో నోటీసు. దీన్ని జావాస్క్రిప్టు ద్వారా కనబడకుండా చేసుకోవచ్చు.
దిద్దుబాటు నోటీసులు
[మార్చు]పేజీలో దిద్దుబాటు చెయ్యగలిగే వాడుకరులందరికీ ఈ నోటీసు కనిపిస్తుంది. ఇది దిద్దుబాటు పెట్తెకు పైన కనిపిస్తుంది. మరింత సమాచారం కోసం వికీపీడియా:Editnotices చూడండి.