వికీపీడియా:సీఐఎస్-ఎ2కె తెవికీ ప్రణాళిక/జూలై 2016 - జూన్ 2017

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పరిచయం

[మార్చు]

గత 3 సంవత్సరాల నుంచి తెలుగు సీఐఎస్-ఎ2కె ఫోకస్ లాంగ్వేజ్ ఏరియాగా ఉంటోంది. ప్రణాళిక సీఐఎస్-ఎ2కె కృషికి ఫలితాలతో ప్రారంభమై, జూలై 2016 నుంచి జూన్ 2017 వరకూ వార్షిక కార్యకలాపాల ప్రణాళికను వివరిస్తుంది.

ప్రణాళికాయుత కృషికి ఫలితాలు

[మార్చు]

ప్రభావం

[మార్చు]

2015-16ల్లో సీఐఎస్-ఎ2కె సముదాయంలో నాయకత్వం సహజంగా అభివృద్ధి చెందేలా కృషిచేసింది. రచ్చబండలోని చర్చలు, సంప్రదింపులను అనుసరించి అవసరాల పునర్విశ్లేషణ చేసి, సముదాయంతో పనిచేశాం. సీఐఎస్-ఎ2కె అవుట్ రీచ్ కార్యక్రమాల నిర్వహణలో అవసరాన్ని బట్టి నిర్వహణ, సహ-నిర్వహణ, నిర్వహణ సహకారం వంటి రకరకాల బాధ్యతల్లో సముదాయంతో సన్నిహితంగా పనిచేశాం.

ప్రత్యక్ష ప్రభావం

[మార్చు]

సీఐఎస్-ఎ2కె ప్రణాళికాబద్ధ కృషికి లభించిన ఫలితాలకు పరిమితమై ఈ కింది పట్టికలు తయారుచేస్తున్నాం.

పాల్గొన్న యాక్టివ్ వాడుకరులు కొత్త వాడుకరులు చేరుకున్నవారు కామన్స్ లో చేర్చిన ఫోటోలు చేరిన వ్యాసాలు బైట్ల విలువ
30 186 200 301 554 4.65 MB
  • పై పట్టిక జనవరి 2016 నాటి ఫలితాలకే పరిమితం.
పారామితులు ఫలితాలు
(ఫిబ్రవరి 2016 మాసాంతం నాటికి)
వ్యాఖ్య
స్వేచ్ఛా నకలు హక్కుల్లోకి తీసుకువచ్చిన పుస్తకాలు 380
డిజిటైజ్ అయిన పుటలు 780కి పైగా

పరోక్ష ప్రభావం

[మార్చు]
  • ఆంధ్ర లొయోలా కళాశాల వారి భాగస్వామ్యంతో ఏర్పరిచిన డిజిటల్ రీసోర్సు సెంటర్లో హైదరాబాద్, బెంగళూరు నగరాల ఆవల దాదాపుగా మొదటిసారి అనదగ్గ సముదాయ సమావేశాలు విజయవాడలో ప్రారంభమయ్యాయి.
  • పత్రికల్లో కవరేజి ద్వారా మీడియాలో వికీపీడియా గురించిన అవగాహన అభివృద్ధి. ఉదాహరణకు వికీపీడియన్లతో సహ నిర్వహణ చేసిన ఫోటోవాక్ కార్యక్రమానికి పత్రికా మాధ్యమాల్లోనూ, ఒక న్యూస్ ఛానెల్లోనూ ప్రసారాలు లభించాయి.

తెలుగు వికీపీడియా అవసరాల పునర్విశ్లేషణ

[మార్చు]

తెలుగు వికీపీడియా అవసరాలను పునర్విశ్లేషించుకునేందుకు తెలుగు వికీపీడియన్లతో రకరకాల మాధ్యమాల్లో జరిపిన సంప్రదింపులు, వికీపీడియన్ల నడుమ సాగిన ప్రధానమైన చర్చలు వంటివి ఆకరాలుగా స్వీకరించాము. వీటిల్లో భాగంగా స్వీకరించిన పలు అవసరాలు, ప్రాధాన్యతలు ఇవి:

  • కొత్త వికీపీడియన్ల కోసం కృషి
    • తెలుగు వికీపీడియా విద్యా కార్యక్రమాల పెంపు: విద్యాసంస్థలతో కార్యక్రమాలను నిర్వహించడం తెవికీ అభివృద్ధికి చాల ఉపయుక్తమని, కాకుంటే చేరే సమాచార నాణ్యత గురించి ప్రత్యేకించి చర్యలు తీసుకోవాలని చాలామంది వికీపీడియన్లు ఆంధ్ర లొయోలా కళాశాల భాగస్వామ్యాన్ని గురించి చేపట్టిన సంప్రదింపుల్లో తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయా కార్యక్రమాల ఫలితాలు పరిశీలిస్తున్న తెవికీపీడియన్ల సూచనలు పరిగణిస్తూ, ఇతర భాషల్లోనూ సాగుతున్న వికీపీడియా విద్యా కార్యక్రమాల నుంచి అనుభవాలు స్వీకరించి ఆంధ్ర లొయోలా కళాశాల కార్యకలాపాలు అభివృద్ధి చేస్తున్నాం. విద్యాసంస్థల్లో కార్యక్రమాలు రాన్నున్న విద్యాసంవత్సరంలో చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నాం.
    • కార్యకలాపాల విస్తరణ: సీఐఎస్-ఎ2కె కార్యకలాపాలను సంస్థాగత భాగస్వామ్యాల సహకారంతో ఇప్పటికే విజయవాడ, గుంటూరు నగరాల్లో కూడా ఆతిథ్య సంస్థలను ఏర్పరుచుకుని విస్తరించింది. దీన్ని జిల్లా ముఖ్యకేంద్రాలు, పట్టణాలకు, చిన్న నగరాలకు విస్తరించాలని ప్రస్తుత ప్రయత్నం. అవనిగడ్డలో అవుట్ రీచ్ కార్యకలాపాలు ప్రణాళిక వేసినా, వాతావరణ ప్రకోపం కారణంగా రద్దయ్యింది. 2015-16ల్లో హైదరాబాద్, విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో ఇప్పటికే ఏర్పడ్డ భాగస్వామ్యాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలన్న ప్రయత్నంతోనూ, మిగతా ప్రాంతాల్లో భాగస్వామ్యాలను ప్రాథమికంగా అన్వేషించే ఉద్దేశంతోనూ అంతటితో పరిమితమయ్యాం. జూలై 2016 - జూన్ 2017 ప్రణాళికలో ఈ అవసరాన్ని ప్రాధాన్యతగా స్వీకరించాం. ఈ అంశం చాలామంది వికీపీడియన్లు సూచించారు. తెలుగు రాష్ట్రాలకు ఆవల పలు ప్రదేశాల్లో తెలుగు వారు నివసిస్తూండడం, వారికి తెలుగు పట్ల ఆసక్తి అధికంగా ఉండడం, తెలుగు భాషాభివృద్ధి సంస్థలు కూడా విశేషంగా నిర్వహించడం వంటి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు తెలుగు రాష్ట్రాలి ఆవలి నగరాల్లో కూడా అవుట్ రీచ్ విస్తరించే ప్రయత్నం చేస్తాం. ఇందుకు తెవికీపీడియన్ అయిన వీర శశిధర్ జంగం వ్యక్తిగత అనుభవం (తెలుగు రాష్ట్రాల ఆవల నివసించినాకే తెలుగు గురించి ఆసక్తి పెరిగి వికీపీడియన్ అయ్యారు), గుళ్ళపల్లి నాగేశ్వరరావు వంటివారి సూచనలు ఇందుకు ఉపకరించాయి.
    • గత మూడు ప్రణాళికా సంవత్సరాల్లో సముదాయంతో కలసి తెలుగు వికీపీడియాలో మహిళా వికీపీడియన్ల పెంపుకు, మహిళలకు సంబంధించిన కార్యక్రమాల నిర్వహణకు అంతర్జాతీయ మహిళా మాసంలో ప్రయత్నాలు సాగించి, కొంతమేరకు విజయాన్ని సాధించగలిగాం. మహిళా వాడుకరుల సంఖ్య మరింతగా పెంపొందించడాన్ని ముఖ్య ప్రాధాన్యతల్లో ఒకటిగా ఈ ప్రణాళికలో స్వీకరించాం. మీనా గాయత్రి వంటి తెలుగు వికీపీడియన్ల సూచనలతో పాటుగా అంతర్జాతీయంగా వికీమీడియా ప్రాజెక్టుల్లో మహిళల భాగస్వామ్యం పెంపొందించడం ప్రధాన స్ట్రాటజీగా స్వీకరించడాన్ని దీనికి పరిగణించాం.
  • నాణ్యతతో కూడిన సమాచారం అభివృద్ధి
    • తెవికీ వ్యాసాల్లోకి ఛాయాచిత్రాల చేర్పు: ఛాయాచిత్రాల, బొమ్మల అవసరాన్ని గుర్తిస్తూ తెలుగు వికీపీడియన్లు 2015 ప్రారంభంలో మదింపుకు సంబంధించిన కృషి చేశారు. 2015 డిసెంబరు నెలలో సముదాయం సీఐఎస్-ఎ2కె భాగస్వామ్యంతో చేసిన మన తెవికీ-మన చరిత్ర ఫోటో వాక్ కూడా తెవికీ వ్యాసాల్లో ఫోటోలు చేర్చడాన్ని లక్ష్యం చేసుకుంది. ఫిబ్రవరి నెలలో జరిగిన నెలవారీ సమావేశంలోనూ గ్రామ వ్యాసాల్లో ఛాయాచిత్రాలు రావడంపై చర్చించారు. ఈ నేపథ్యంలో తెవికీ వ్యాసాల్లోకి ఛాయాచిత్రాలను చేర్చి నాణ్యత అభివృద్ధి చేయడం, అందులోనూ తెలుగు గ్రామాలు, సినిమాలు వంటి మొలకల శాతం అధికంగా ఉన్న వర్గాలపై కృషిచేయడం ఒకానొక ప్రధాన్యతగా పరిగణించాం.
    • వ్యాసాలు అభివృద్ధి, సృష్టి చేయదగ్గ మూలాల అందజేత: ప్రస్తుతం ఉన్న వ్యాసాల్లో మూలాల పరంగా అభివృద్ధి చేయడమే కాక కొత్త వ్యాసాలను సృష్టించడానికి ఉపకరించే మూలాలను అందజేయడం అన్న అంశం ఇప్పటికే సంప్రదింపుల్లో కొందరు వికీపీడియన్లు గుర్తించిన అవసరం. ఈ నేపథ్యంలో వ్యాసాల అభివృద్ధికి, సృష్టికి ఉపకరించే మూలాలను అందజేయడానికి పలు మార్గాలను అనుసరించి నాణ్యత కల సమాచారం అభివృద్ధికి యత్నిస్తున్నాం.
    • మొలకల అభివృద్ధి: తెవికీలో మొలకలను అభివృద్ధి చేయడం కూడా ఒకానొక ప్రధానమైన అంశం. నెలవారీ మొలకల జాబితా ప్రచురణ విషయమై సముదాయాన్ని సంప్రదించగా పలువురు ఈ అంశాన్ని వ్యక్తపరిచారు. నెలవారీ మొలకల జాబితా ప్రచురించడం, గ్రామవ్యాసాల అభివృద్ధి ఈ అవసరాన్ని అనుసరించి కొనసాగించనున్న కృషి.
    • తెవికీలో నాణ్యత అభివృద్ధికి ప్రయత్నిస్తున్న ప్రాజెక్టులు - గూగుల్ అనువాద ప్రాజెక్టు వంటివాటిలో - సహ నిర్వహణ కొనసాగించాలన్నది ప్రాజెక్టు సభ్యులైన వికీపీడియన్ల ఆసక్తి.
  • సముదాయాన్ని బలోపేతం చేయం
    • నెలవారీ సమావేశాలను ఉత్సాహభరితంగా, పూర్తిస్థాయిలో ప్రయోజనయుతం చేయాలన్నది గుళ్ళపల్లి, భాస్కర నాయుడు గార్లు ఆశిస్తున్నారు. నెలవారీ సమావేశాలను వేదికగా వినియోగించుకుని తెలుగు వికీపీడియన్ల కృషికి ఉపకరించే అవగాహన, శిక్షణ కార్యకలాపాలు చేపట్టడం వంటి కార్యక్రమాల ద్వారా సముదాయాన్ని బలోపేతం చేయాలి.
    • ఉపకరించే వనరుల అభివృద్ధి: కొత్త వాడుకరులు, నేర్చుకోదలిచిన ఇతరులకూ, అవుట్ రీచ్ నిర్వహించదలిచిన వికీపీడియన్లకు ఉపకరించేలా వనరుల అభివృద్ధి మరో ప్రాధాన్యమైన అంశం. దీనికి ప్రధానమైన ప్రాతిపదిక ఓ అవగాహన సదస్సు నిర్వహించేందుకు వీరా, ఒక కళాశాలతో చర్చించే అంశంలో సుల్తాన్ ఖాదర్ వంటివారికి ప్రస్తుతం రివ్యూ దశలో ఉన్న వనరులు అందిస్తేనే ఎంతగానో ఉపకరించింది. అలాగే మీనాగాయత్రి, రాజశేఖర్ గార్లు ఈ అంశాన్ని చర్చల్లోనూ ముందుకుతెచ్చారు.

తెలుగు వికీపీడియా ప్రణాళిక

[మార్చు]

విద్యాసంస్థలతో భాగస్వామ్యాలు

[మార్చు]

వికీప్రాజెక్టుల్లో సమాచారాన్ని అభివృద్ధి చేస్తూనే స్థానిక వికీపీడియన్లకు చక్కని వేదికగా వినియోగం, పలువురు విద్యార్థి వికీపీడియన్ల చేరిక, సంస్థకు సంబంధించిన సాహిత్యం సీసీ-బై-ఎస్ఎ లైసెన్సుల్లో విడుదల చేయడం వంటి అనుబంధ ఫలితాలు కూడా విద్యాసంస్థల భాగస్వామ్యాలు అభివృద్ధి చేస్తున్నాయన్నది గతానుభవాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో మరిన్ని విద్యాసంస్థలతో భాగస్వామ్యం ఏర్పరుచుకుని థీమాటిక్ ప్రాజెక్టులపై కృషి కొనసాగించడంపై సీఐఎస్-ఎ2కె దృష్టి సారిస్తుంది.

వనరులు
  • ఆంధ్ర లొయోలా కళాశాలతో ఒప్పందం ఇప్పటికే కుదిరివుంది. కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
  • పొట్టిశ్రీరాములు విశ్వవిద్యాలయం, ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నడిచే కళాశాలలో ప్రాథమిక స్థాయి చర్చలు జరిగాయి. ప్రతిపాదనలు సముదాయంతో చర్చిస్తున్నాము. ఆపై భాగస్వామ్యం ముందుకువెళ్తుంది.
  • కడప నగరంలోని కళాశాలతో సముదాయ సభ్యుడు చర్చించారు, కళాశాలతో భాగస్వామ్యం ఏర్పరచమని కార్యకలాపాల్లో ముఖ్యబాధ్యత స్వీకరించాలని సీఐఎస్-ఎ2కెను సభ్యుడు కోరారు. డి.ఆర్.గోయెంకా మహిళా కళాశాల, తాడేపల్లిగూడెంతో ప్రాథమిక స్థాయి చర్చలు సాగుతున్నాయి.
ప్రణాళిక

పైన సూచించిన వాటిలో ఓ 2-3 సంస్థలతో భాగస్వామ్యం ఏర్పరుచుకుని వారి విద్యాభ్యసన విధానాల్లో తెవికీని ప్రవేశపెట్టేలా, తద్వారా అధ్యాపకులు, విద్యార్థుల నైపుణ్యాలను తెవికీ నాణ్యతాభివృద్ధికి వినియోగించడం. మరో 4 విద్యాసంస్థల్లో తెలుగు వికీపీడియా కార్యశాల నిర్వహించడం.

కార్యాచరణ
  • మౌలిక చర్చల అనంతరం వికీపీడియా సముదాయంలో ప్రతిపాదనలు చర్చించి, సాధ్యమైన సంస్థలతో తెలుగు వికీపీడియన్లు signatoriesగా MoUలు చేసుకోవడం.
  • సముదాయం సూచనలు, సహకారంతో కార్యశాలలు శిక్షణా కార్యక్రమాలు రూపొందించి నిర్వహించడం.
  • గతానుభవాలు, తెవికీపీడియన్లు ఇప్పటికే చేసిన సూచనలు, ఇతర వికీపీడియా విద్యాకార్యక్రమాల నుంచి నేర్చుకోదగ్గ అంశాలు పరిగణనలోకి తీసుకుని విద్యార్థి వికీపీడియన్ల కృషి మెరుగ్గా, నాణ్యతపరంగా ప్రయోజనాత్మకంగా చేయడం.
  • సిబ్బంది, అధ్యాపకుల సహకారంతో విద్యా సంవత్సర కార్యకలాపాల్లో ఇమిడేలా కార్యక్రమాలు రూపొందించి అమలుచేయడం.
ఆశించే ఫలితాలు
  • 200కి పైగా మంచి నాణ్యతతో ఉన్న వ్యాసాల సృష్టి, మొలక స్థాయిలో ఉన్న 500కు పైగా వ్యాసాలు విస్తరణ, నాణ్యతాభివృద్ధి.
  • 150 నుంచి 250 వరకు కొత్త వాడుకరులు తెలుగు వికీపీడియాలో చేరిక, వారిలో కనీసం 10-20మంది యాక్టివ్ యూజర్లు కావడం.

పట్టణాలు, నగరాలకు విస్తరణ

[మార్చు]

హైదరాబాద్ నగరం వెలుపల తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రాంతాలకు తెవికీ అవుట్ రీచ్, అవగాహన విస్తరించాలన్నది చాలా పొటెన్షియల్ ఉన్న ప్రయత్నం. ఈ క్రమంలో ప్రస్తుతానికి గుంటూరు, విజయవాడ నగరాల్లో అవుట్ రీచ్ కార్యక్రమాలు తరచు నిర్వహించడాన్ని సంస్థాగత భాగస్వామ్యాలు, తెవికీ సముదాయం సహకారంతో సాధించగలిగాం. గత సంవత్సరంలో అవనిగడ్డ వంటి ప్రాంతాల్లో కార్యకలాపాలు ప్రారంభించే ప్రణాళిక వేసుకున్నా హఠాత్తుగా ఏర్పడ్డ ప్రాకృతిక సమస్య కార్యక్రమాన్ని అడ్డుకుంది. ఈ మూడు నగరాలతో పాటు మరిన్ని పట్టణాలు, నగరాలకు తెలుగు వికీ ప్రాజెక్టుల అవుట్ రీచ్ కార్యక్రమాలు, అవగాహన విస్తరించాలని ప్రయత్నిస్తున్నాం.

అందుబాటులోని వనరులు
  • తిరుపతి, కడప, ఖమ్మం, రాజమండ్రి, తాడేపల్లిగూడెం వంటి పట్టణాలు, నగరాల్లో సాంస్కృతిక సంఘాలు, గ్రంథాలయాలు, రచయితలు, భాషాభిమానులు వంటివారితో ఉన్న పరిచయాలు. పలు ఇతర వివరాలు సేకరించేందుకు స్థానికంగా పలువురు పత్రికా విలేకరులతో ఉన్న సత్సంబంధాలు.
ప్రణాళిక

తెలుగు వికీపీడియా కార్యకలాపాలను తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని ఇతర ప్రాంతాలకు విస్తరించాలి. ఈ క్రమంలో వచ్చే సంవత్సరం కనీసం మరో మూడు పట్టణాలు లేదా నగరాలకు తెలుగు వికీపీడియా అవుట్ రీచ్ ను విస్తరింపజేసి తద్వారా ఆయా ప్రాంతాల్లో సముదాయాన్ని బలోపేతం చేయడం దీని లక్ష్యం. ఇందుకు గాను ఎంపిక చేసుకున్న మూడు పట్టణాలు, నగరాల్లో కనీసం ఒక్కోదాంట్లోనూ 2 అవుట్ రీచ్ కార్యక్రమాలు చేపట్టాలి.

కార్యాచరణ
  • రెండు, రాష్ట్రాల్లోనూ ప్రాథమిక పరిశీలన ద్వారా విజ్ఞానం ప్రధానమైన ఆసక్తిగా ఉన్న సాంస్కృతిక సంఘాలు, విద్యాసంస్థలు, గ్రంథాలయాలు, అంతర్జాలంలో ఆసక్తులు పంచుకుంటూ భౌతికంగానూ కార్యకలాపాలు చేసే గ్రూపులు, జర్నలిస్టులు, చిన్న పత్రికల వ్యవస్థాపకులు వంటివాటిలో కొన్నైనా ఉండి సాంస్కృతికంగా చైతన్యవంతంగా ఉన్న పట్టణాలూ, నగరాలు ఎంచుకోవాలి.
  • తెలుగు వికీపీడియాలో పలువురు సభ్యులు ఈ కార్యకలాపంపై ఆసక్తిగా ఉన్నందున, వారు ప్రతిపాదిస్తున్న పట్టణాల్లో, వారి పరిచయమున్న గుంపుల్లో ఉండటం కార్యాచరణకు మరింత ఉపకరిస్తుంది.
  • అలా ఎంపిక చేసిన నగరాలు, పట్టణాల్లో స్థానిక ఆతిథ్య సంస్థలతో కలిసి సంస్థ సభ్యులు, ఇతర ఔత్సాహికులకు తెవికీ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి.
  • స్థానికంగా పలు ఆసక్తికరమైన థీమ్స్ గుర్తించి, వాటిపై ప్రత్యేకంగా ఎడిటథాన్లు నిర్వహించడం ద్వారా కొత్త సముదాయాన్ని తెవికీలో నిలిపే ప్రయత్నం చేయాలి.
  • స్థానిక సముదాయం కొత్త సభ్యులను చేర్చుకునేలా, వారికి శిక్షణ ఇవ్వగలిగేలా సశక్తియుతం చేయడం ద్వారా స్వయంగా విస్తరించే వీలు కల్పించాలి.
ఆశించే ఫలితాలు
  • దాదాపు 60 నుంచి 120 మంది వరకూ కొత్త వికీపీడియన్ల చేరిక, వారిలో కనీసం 15 మంది చురుకైన వాడుకరులుగా మారడం.
  • కనీసం 3 స్థానిక సంస్థలు/సంఘాలు తెలుగు వికీపీడియాకు ఆతిథ్య సంస్థలుగా మారడం, తద్వారా 3 పట్టణాలు/నగరాల్లో తెలుగు వికీపీడియా క్రమాభివృద్ధి సాధించే అవకాశం.
  • స్థానికంగా తెలుగు వికీపీడియా గురించి అవగాహన పెంపు, తద్వారా మరిన్ని అవకాశాలు విస్తరణ.
  • ఆయా ప్రాంతంలోని గ్రామ వ్యాసాలు, వ్యక్తుల వ్యాసాలు, తదితరాలు దాదాపు 80 తెవికీలో సృష్టి, కనీసం 120 వ్యాసాలు నాణ్యతాపరంగా అభివృద్ధి.

తెవికీలోకి బొమ్మలు, ఛాయాచిత్రాలు

[మార్చు]

2015లో తెలుగు వికీపీడియన్లు బొమ్మ అభ్యర్థన వెల్లడించే మూసను సంబంధిత వ్యాసాల చర్చ పేజీల్లో చేర్చడం ద్వారా ఈ అంశంపై తమ ప్రాధాన్యతను పరోక్షంగా వెల్లడించారు. ఈ మూసలు 14,800కి పైగా వ్యాసాల్లో చేర్చారు. నాణ్యతాపరంగా వెనుకబడివున్న అనేక గ్రామాలు, సినిమాల వ్యాసాల్లో కూడా ఈ అభ్యర్థనలు ఉన్నాయి. ఆయా వ్యాసాల్లోకి బొమ్మలు చేర్చడం మాత్రమే కాక ఇప్పటికే బొమ్మలు ఉన్న వ్యాసాల్లోనూ తగిన, నాణ్యమైన బొమ్మలు చేర్చడం వ్యాస నాణ్యత పెంపొందింపజేస్తుంది.

వనరులు
  • పరిశోధనల కోసం తెలంగాణా ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించే చరిత్రకారుని ఛాయాచిత్రాలు స్వేచ్ఛా నకలు హక్కుల్లో విడుదల చేసేందుకు అంగీకారం.
  • ప్రముఖ నిర్మాణ సంస్థతో వారు నిర్మించిన ఒక్కో చిత్రానికి పోస్టరు, వర్కింగ్ స్టిల్స్ విడుదల చేసేందుకు చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయి.
ప్రణాళిక

తెలుగు వికీపీడియాలో వ్యాసాల్లో, మరీ ప్రధానంగా బొమ్మలు లేని వ్యాసాల్లో, బొమ్మలు/ఛాయాచిత్రాలు చేర్చి వ్యాసాలను నాణ్యతాపరంగా అభివృద్ధి చేయాలి. కనీసం 4 GLAM కార్యక్రమాలు, ఆసక్తికల ఛాయాచిత్రకారుల నుంచి ఫోటోలు స్వేచ్చా నకలు హక్కుల్లో విడుదల చేయించి, వాటిని తెవికీలో చేర్చేలా ఎడిటథాన్ కార్యక్రమాలు నిర్వహించడం చేపడతాం.

కార్యాచరణ
  • వైవిధ్యభరితమైన థీమ్స్ కలిగిన పలు వస్తు సంగ్రహశాలల్లో ఫోటోవాక్ లు దాదాపు 2 నిర్వహించాలి.
  • ప్రముఖ వ్యక్తుల విగ్రహాలు, ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాలు, సంస్థలు ఉన్న నగరాలు ఎంచుకుని వికీ టేక్స్ సిటీ వంటి కార్యక్రమాలను కనీసం 2 నిర్వహించాలి.
  • పరిశోధన ఆసక్తితో పలు ప్రాంతాలు సందర్శించిన వ్యక్తులు, గ్రూపులను సంప్రదించి వారి ఫోటో ఆర్కైవ్స్ నుంచి కొన్నిటిని స్వేచ్ఛా లైసెన్సుల్లో విడుదల చేయించాలి.
  • ప్రముఖ నిర్మాణ సంస్థలతో సంప్రదించి వారి చిత్రాల్లో ఒక్కోదానికి కనీసం ఒక పోస్టర్, ఒక వర్కింగ్ స్టిల్ స్వేచ్ఛా లైసెన్సుల్లో విడుదల చేయించాలి.
  • స్వేచ్ఛా నకలు హక్కుల్లో విడుదల చేసిన ఫోటోలను తెలుగు వికీపీడియాలో సంబంధిత వ్యాసాల్లో చేర్చేలా ఎడిటథాన్లు నిర్వహించాలి.
ఆశించే ఫలితాలు
  • తెలుగు వికీపీడియాకు ఉపకరించే 1500 ఫోటోలు వికీపీడియా కామన్స్ లోకి చేర్పు.
  • ఇప్పటివరకూ బొమ్మలు లేని ఫోటోలు కనీసం 500 వ్యాసాల్లోకి ఫోటోలు చేరి తద్వారా నాణ్యతాభివృద్ధి.

తెవికీ సముదాయంలో, సమాచారంలో వైవిధ్యం పెంపు

[మార్చు]

ప్రపంచవ్యాప్తంగా పలు వికీపీడియాలతో పాటుగా తెలుగు వికీపీడియాలోనూ జెండర్ గ్యాప్ సమస్య నెలకొనివుంది. ఈ సమస్యను అధిగమించేందుకు చేసిన ప్రయత్నాలు కొంతమేరకు ఫలప్రదం కావడం ఈ అంశంపై మరింత దృష్టిపెట్టాల్సిన అవసరాన్ని తెలియజెప్తోంది. సముదాయంలోనూ, సమాచారంలోనూ వైవిధ్యాన్ని పెంపొందించే ప్రయత్నంలో మహిళల భాగస్వామ్యాన్ని, మహిళలకు సంబంధించిన పలు అంశాలపై సమాచారాన్ని అభివృద్ధి చేయాలి. విభిన్న ప్రతిభావంతుల సంఖ్యను పెంపొందించడం కూడా చేపట్టవచ్చు.

ప్రణాళిక

తెలుగు వికీపీడియాలో వైవిధ్యాన్ని అభివృద్ధి చేయడం అనే లక్ష్యంలో ప్రధానంగా మహిళల భాగస్వామ్యం, వారి గురించిన సమాచారం పెంపొందించడం, కొంతవరకూ విభిన్న ప్రతిభావంతుల భాగస్వామ్యాన్ని కూడా పెంపొందించడం లక్ష్యం. అందుకోసం పూర్తిశాతం మహిళకే నిర్వహించే కార్యశాలలు దాదాపుగా 4 నిర్వహించాలి, తత్సంబంధిత సమాచారం పెంపుకై కొనసాగింపుగా 4 ఎడిటథాన్లు నిర్వహించాలి. కార్యశాలలను అవకాశంగా తీసుకుని తెలుగు వికీపీడియాలో రాయడానికి మహిళలను అడ్డుకుంటున్న అంశాలేంటన్నదానిపై చిన్నపాటి అధ్యయనం చేయాలి. ప్రత్యేక ప్రతిభావంతుల సంఖ్య పెంపొందించేలా వారికై 2 కార్యశాలలు నిర్వహించాలి.

అందుబాటులోని వనరులు
  • రెండు మహిళా కళాశాలలతో ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయి. సముదాయంతో సంప్రదింపుల అనంతరం ఒప్పందం చేసుకుని ముందుకుతీసుకువెళ్ళవచ్చు.
  • తెలుగు వికీపీడియాలోని ఇద్దరు చురుకైన మహిళా వికీపీడియన్లు ఈ అంశంపై ఆసక్తితో ఉండడం అవకాశంగా వారి సహకారంతో కార్యక్రమాలు రూపొందించవచ్చు.
  • మహిళా బ్లాగర్లతో ఉన్న పరిచయం పురస్కరించుకుని కార్యక్రమాలకై ప్రయత్నించవచ్చు.
  • వికలాంగ మహాసంఘటన్ సంస్థ అధ్యక్షుడు నండూరి రమేష్ తో జరిగిన సంప్రదింపుల్లో భాగంగా సంస్థ సభ్యులైన ప్రత్యేక ప్రతిభావంతులకు తెలుగు వికీపీడియా కార్యశాలలు రూపొందించేందుకు అంగీకరించారు.
కార్యాచరణ
  • మహిళా కళాశాలల్లో కార్యశాలలు నిర్వహించి పలువురు యువతులను తెలుగు వికీపీడియన్లను చేయడం.
  • కార్యశాల అనంతరం తెలుగు వికీపీడియాలో స్త్రీలకు సంబంధించి లోటుగా ఉన్న అంశాలను స్వీకరించి వాటిని అభివృద్ధి చేసేందుకు కొత్తగా వచ్చిన మహిళా వికీపీడియన్లతో ఎడిటథాన్లు నిర్వహించడం.
  • అంతర్జాలంలో పలు మాధ్యమాల్లో తెలుగులో రాస్తున్న మహిళలు, వారి సమూహాల (బ్లాగ్ గుంపులు, ఫేస్ బుక్ గ్రూపులు వగైరా)ను లక్ష్యం చేసుకుని ప్రచారం సాగించి, వారికి తెలుగు వికీపీడియా శిక్షణ ఏర్పాటు చేసే ప్రయత్నం చేయడం.
  • ఇందుకై తెవికీలో మహిళల కంట్రిబ్యూషన్ల అవసరాన్ని తెలియజేసేలా పత్రికలు, జాలపత్రికలు వంటివాటికి రచనలు చేసి ప్రాచుర్యం చేయాలి. తగినంత సంఖ్యలో మహిళలు స్పందించినప్పుడు రకరకాల మాధ్యమాల ద్వారా శిక్షణనిచ్చి వారిని వికీపీడియన్లను చేయాలి.
  • కార్యక్రమాలు నిర్వహించేప్పుడు ముందుగా తయారుచేసుకున్న ప్రశ్నల ద్వారా వికీపీడియాలో మహిళలు కృషిచేయడంలో వారికి నిరోధంగా, ఇబ్బందిగా ఉన్న అంశాలేమిటి అన్నది తెలుసుకునే చిరు అధ్యయనం చేయాలి.
  • ప్రత్యేక ప్రతిభావంతులకు సంబంధించిన సంఘంతో ఇప్పటికే సంప్రదించివుండడంతో వారి సభ్యులైన ప్రత్యేక ప్రతిభావంతులకు సంయుక్త ఆధ్వర్యంలో కార్యశాలలు నిర్వహించాలి.
  • తెలుగు వికీపీడియాలో తక్కువగా ఉన్న ప్రత్యేక ప్రతిభావంతులకు సంబంధించిన అంశాలపై వ్యాసాలు అభివృద్ధి చేసేలా థీమ్స్ తో ఎడిటథాన్లు నిర్వహించాలి.
ఆశించే ఫలితాలు
  • 60-80 మంది కొత్త మహిళా వికీపీడియన్లు తెలుగు వికీపీడియాలోకి చేరిక, వారిలో కనీసం 8-15 మంది చురుకైన వాడుకరులుగా మారడం.
  • మహిళలకు సంబంధించిన దాదాపు 100 వ్యాసాలు సృష్టి.
  • 30-40మంది ప్రత్యేక ప్రతిభావంతులు తెలుగు వికీపీడియాలో చేరిక, వారిలో కనీసం ఐదుగురు చురుకైన వాడుకరులుగా మారడం.
  • ప్రత్యేక ప్రతిభావంతులకు సంబంధించిన పలు అంశాలపై 50కి పైగా కొత్త వ్యాసాల సృష్టి.

వనరులైన గ్రంథ భాగాలు పంచుకోవడం

[మార్చు]
ప్రణాళిక

వికీపీడియా నాణ్యతను పెంపొందించడంలో, వ్యాసాల సృష్టిలో మూలాల ప్రాధాన్యత తెలిసిందే. తెలుగు వికీపీడియాలోని పలు వ్యాసాలకు మూలాలను అందించడం ద్వారా నాణ్యతను అభివృద్ధి చేయడమే కాక మంచి నాణ్యతతో కొత్త వ్యాసాలు కూడా సృష్టించవచ్చు. ఈ నేపథ్యంలో విజ్ఞానదాయకమైన, మూలాలుగా వినియోగించుకునేందుకు ఉపయోగపడే గ్రంథాలు, పత్రికల భాగాలను తెలుగు వికీపీడియన్లతో పంచుకోవడం.

కార్యాచరణ
  • తెలుగు వికీపీడియాలో వ్యాసాలు అభివృద్ధి చేసేందుకు ఉపకరించే విజ్ఞానదాయక సాహిత్యాన్ని సేకరించడం. వీలైనంత వరకూ వాటిని స్వేచ్ఛా నకలు హక్కుల్లో విడుదల చేయించి, తెలుగు వికీసోర్సులో డిజిటైజ్ చేయడం.
  • అలాంటి మూలాలను ఆసక్తికలిగిన వికీపీడియన్లతో ఎడిటథాన్లు నిర్వహించి వ్యాసాలు అభివృద్ధి చేయడం.
  • వికీపీడియా సముదాయంతో కాపీహక్కులకు భంగం కలుగకుండా (అవసరమైనంత మేరకు, కాపీహక్కులు అనుమతించే మేరకు) ఇతర గ్రంథాలు పంచుకోవడం.
  • తమకు ఆసక్తికలిగించే, తమ అందుబాటులో మూలాలు లేని అంశాల గురించి సీఐఎస్-ఎ2కెకు రిక్వెస్ట్ చేసుకుంటే వాటిని లభ్యత మేరకు అందజేసే ప్రయత్నం చేయడం.
అందుబాటులోని వనరులు
  • అన్నమయ్య గ్రంథాలయంతో సీఐఎస్-ఎ2కెకు ఉన్న ఒప్పందం.
  • విజ్ఞానదాయకమైన పత్రికలు, పుస్తకాలు ఇప్పటికే సీఐఎస్-ఎ2కె కృషితో స్వేచ్చా నకలు హక్కుల్లో అందుబాటులోకి వచ్చాయి.
ఆశించే ఫలితాలు
  • తెలుగు వికీపీడియాలో సరైన మూలాలు లేని 100కు పైగా వ్యాసాల నాణ్యత అభివృద్ధి.
  • మూలాలను వినియోగించి కనీసం మరో 50 వ్యాసాల సృష్టి.

నెలవారీ మొలకల జాబితా ప్రచురణ

[మార్చు]
ప్రణాళిక

తెలుగు వికీపీడియాలో తయారవుతున్న మొలకలను నెలవారీగా జాబితా చేయడం

కార్యాచరణ
  • నెలవారీగా మొలకలను క్వైరీ ఉపయోగించి జాబితా చేయడం.
  • తెలుగు వికీపీడియా సముదాయం చర్చించి నిర్ణయం తీసుకున్న శైలిలో వాటిని ప్రచురించడం.
  • మొలకలను సృష్టించిన వాడుకరులు వాటిని అభివృద్ధి చేసేలా ప్రోత్సహించడం.
  • మొలకల అభివృద్ధికి మూలాలు వాడుకరులు కోరుకుంటే, లభ్యతను అనుసరించి అందించడం.
  • వారం పాటుగా ఈ మొలకలు అబివృద్ధి చెందేలా ఎడిటథాన్ నిర్వహించడం.
ఆశించే ఫలితాలు
  • మొలకల సృష్టిని అనుసరించి దాదాపు 300-400 వ్యాసాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంది.

ఇతర రాష్ట్రాల్లో తెలుగు వికీపీడియా

[మార్చు]
ప్రణాళిక

తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కాక భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో తెలుగు వారు నివసిస్తున్నారు. మాతృభాష విస్తారంగా మాట్లాడే స్వంత ప్రాంతానికి దూరం కావడంతో వారిలో మాతృభాషపై అనురక్తి మరింతగా ఉండి పలు భాషాభివృద్ధి కార్యక్రమాలు, భాషా సాంస్కృతిక సంఘాలు ఏర్పరచడం వంటివి చురుగ్గా చేస్తూంటారు. కనుక ఇతర రాష్ట్రాల్లోని తెలుగువారికి అవుట్ రీచ్ కార్యక్రమాలు చేపట్టి అక్కడ వికీపీడియా గురించి అవగాహన, వికీపీడియా సముదాయం పెంపొందించాలి.

అందుబాటులోని వనరులు
  • తెలుగు రాష్ట్రాలకు ఆవలి తెలుగువారి గురించి కూడా పలు కార్యక్రమాలు చేస్తున్న తెలుగు జాతి ఫౌండేషన్ సంస్థతో ఒప్పందం.
  • తెలుగు భాషోద్యమకారులు సామల రమేష్ బాబు, స.వెం.రమేష్, తదితరులతో ఇప్పటికే తెవికీకి, సీఐఎస్-ఎ2కెకి పరిచయం, కలసి కొన్ని అంశాలపై పనిచేసిన అనుభవం.
కార్యాచరణ
  • తెలుగు రాష్ట్రాల సరిహద్దు రాష్ట్రాలు, దేశంలోని మిగిలిన ప్రధాన నగరాల్లో తెలుగు భాషా, సాంస్కృతిక సంఘాలతో సంప్రదించాలి.
  • తెలుగు లిపిలో రాయడం వచ్చివుండడం వంటి ఇతర పారామితులను ఆధారం చేసుకుని 2 నగరాలను స్వీకరించాలి.
  • అక్కడి సంస్థలతో కలసి కార్యశాలలు నిర్వహించి వికీపీడియన్లుగా చేసి శిక్షణను ఇవ్వాలి.
  • స్థానికంగా తెలుగు వికీపీడియా గురించి కార్యక్రమాలు చేయగలిగేలా ఆతిథ్య సంస్థను తెవికీపై బలోపేతం చేయాలి.
  • స్థానిక వికీపీడియన్లు కార్యక్రమాలు చేసుకునేందుకు వీలుగా ఆతిథ్య సంస్థతో ఒప్పందం చేసుకోవాలి.
ఆశించే ఫలితాలు
  • దాదాపుగా 40-60 మంది కొత్త వికీపీడియన్ల చేరిక, కనీసం 10-15 మంది సచేతనమైన వాడుకరులుగా అభివృద్ధి.
  • కనీసం రెండు కొత్త నగరాల్లో తెలుగు వికీపీడియా గురించి అవగాహన వృద్ధి, ఆతిథ్య సంస్థల ఏర్పాటు.
  • దాదాపుగా 60-80 కొత్త వ్యాసాల సృష్టి,

తెలుగు గ్రామాల ప్రాజెక్ట్

[మార్చు]
ప్రణాళిక

మరీ ఎక్కువగా మొలకలుగా మిగిలిపోయి, తక్కువ సమాచారం ఉన్న గ్రామవ్యాసాలు ఎక్కువగా ఉన్న జిల్లాలను ప్రత్యేకించి ఎంపిక చేసుకుని ఆయా గ్రామాలను అభివృద్ధి చేయాలి. ఈ క్రమంలో కనీసం రెండు జిల్లాలను ఎంపిక చేసుకుని ఎడిటథాన్లు నిర్వహించి ఆసక్తి కలిగిన వికీపీడియన్లతో సమాచారం పంచుకుంటూ అభివృద్ధి చేయాలి.

కార్యాచరణ
  • ర్యాండమ్ పద్ధతిపై జిల్లాల్లో వ్యాసాల అభివృద్ధి విషయమై చిన్న పాటి అధ్యయనం నిర్వహించి సమాచారం అభివృద్ధి విషయంలో వెనుకబడిన జిల్లాలు రెండింటిని ఎంపిక చేసుకోవాలి.
  • గ్రామాల వ్యాసాల్లో అభివృద్ధి చేయదగ్గ గ్రామనామ వివరణ, గ్రామంలో జన్మించిన ప్రముఖులు, గ్రామ చరిత్ర, గ్రామంలో సౌకర్యాలు వంటి అంశాలను స్వీకరించి ఉన్న మూలాలను సర్వే చేయాలి.
  • వీలైతే కొన్నిటిని స్వేచ్ఛా నకలు హక్కుల్లో విడుదల చేయించే ప్రయత్నం చేయాలి.
  • ఆసక్తి కలిగిన తెలుగు వికీపీడియన్లతో మూలాలను పంచుకోవాలి. కనీసం 2 ఎడిటథాన్లు నిర్వహించి వ్యాసాలు అభివృద్ధి చేయాలి.
ఆశించే ఫలితాలు
  • కనీసం 2వేల వ్యాసాలను అభివృద్ధి చేసే అవకాశం ఉంది.

యాంత్రికానువాద వ్యాసాల శుద్ధి ప్రాజెక్ట్

[మార్చు]

ప్రాజెక్టును ప్రణాళికాబద్ధ కృషిలోకి తీసుకుని కొత్త వాడుకరులకు పరిచయం చేయమని, శిక్షణ కొనసాగించమని ప్రాజెక్టు నిర్వహిస్తున్న మీనా గాయత్రి, సుజాత గార్లు సంప్రదింపులో కోరారు.

ప్రణాళిక

యాంత్రికానువాదాల ద్వారా ఏర్పడ్డ నాణ్యతలేని సమాచారం తెలుగు వికీపీడియాలో ఉండిపోయింది. వేలాది వ్యాసాలు యాంత్రికానువాదంతో ఉన్నాయి. కొత్త వాడుకరులకు కార్యశాలలు నిర్వహించేప్పుడు దీన్ని పరిచయం చేసి అభివృధ్ది చేసేలా ప్రయత్నించాలి. ఇప్పటికే ప్రాజెక్టుపై పనిచేస్తున్న వాడుకరులకు, ఆసక్తి కల వాడుకరులకు వికీపీడియా అనువాద ఉపకరణంపై శిక్షణ వంటివీ నిర్వహిస్తాం.

కార్యాచరణ
  • ఆసక్తి కలిగిన వాడుకరులకు, పనిచేస్తున్న వారికి వికీపీడియా అనువాద ఉపకరణంపై శిక్షణ నిర్వహిస్తాం.
  • కొత్త వాడుకరులకు అనువాదాలను పరిచయం చేసి, ప్రాజెక్టులో భాగస్వామ్యం పెంపు చేయడం.
ఆశించే ఫలితాలు
  • 300-400 యాంత్రికానువాద వ్యాసాల శుద్ధి, అభివృద్ధి.

నెలవారీ సమావేశాలలో శిక్షణలు

[మార్చు]
ప్రణాళిక

నెలవారీ సమావేశాలలో చర్చలతో పాటుగా శిక్షణలకు కూడా భాగం కల్పించడానికి తెలుగు వికీపీడియన్లు పలువురు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో నెలవారీ సమావేశాల్లో తెలుగు వికీపీడియన్లకు ఉపకరించే పలు ఉపకరణాలు, అంశాలపై నిపుణులతో శిక్షణ, ప్రసంగాలు ఇప్పిస్తాము.

కార్యాచరణ
  • తెలుగు వికీపీడియన్ల అవసరాలకు అనుగుణంగా సైటేషన్లు ఇవ్వడం, పాలసీ పనులు, శైలి వంటి పలు అంశాలు గుర్తించడం.
  • ముందస్తుగా సంప్రదింపుల ద్వారా నిర్ధారించుకున్న ఆయా అంశాలపై నిపుణులను ఆహ్వానించి నెలవారీ సమావేశాల వేదికలపై శిక్షణ ఇప్పించడం.
  • ఇతర ప్రాంతాల వికీపీడియన్లకు ఈ శిక్షణలు ఉపకరించేలా హ్యాంగవుట్స్, స్కైప్ వంటి మార్గాల్లో వారిని కూడా భాగం చేయడం.
  • శిక్షణ వికీపీడియన్లకు ఏమేరకు ఉపకరించింది అన్న అంశాన్ని మదింపు పారామితుల ద్వారా (క్విజ్, ఫీడ్ బ్యాక్, తదితరాలు) సరిజూసుకోవడం.
ఆశించే ఫలితం
  • వికీపీడియా సముదాయ సభ్యుల్లో కనీసం 20మందికి తెలుగు వికీమీడియా ప్రాజెక్టుల్లో కృషికి ఉపకరించే పలు అంశాల్లో శిక్షణ లభించడం.

తెలుగు వికీసోర్సు

[మార్చు]

తెలుగు పుస్తకాలు స్వేచ్ఛా నకలు హక్కుల్లో విడుదల

[మార్చు]
ప్రణాళిక

తెలుగు రచయితలు, వారి వారసుల ద్వారా, సంస్థాగత భాగస్వామ్యాల ద్వారా తెలుగు పుస్తకాలను స్వేచ్ఛా నకలు హక్కుల్లో విడుదల చేయించడం.

అందుబాటులోని వనరులు
  • గుంటూరులోని అన్నమయ్య గ్రంథాలయంతో భాగస్వామ్యంతో పలు విజ్ఞానదాయకమైన రచనలు చేసిన స్థానిక రచయితలతో ప్రాథమిక సంప్రదింపులు పరిపూర్తి. సముదాయంతో చర్చించి, విడుదల చేయవచ్చు.
  • పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంతో భాగస్వామ్యం ఏర్పరుచుకోవడంలో భాగంగా విలువైన వారి విజ్ఞానదాయక గ్రంథాల గురించీ ప్రతిపాదనలు జరిగాయి.
  • పలువురు ఇతర రచయితలతో కూడా సంప్రదింపులు జరుగుతున్నాయి.
కార్యచరణ
  • కాపీహక్కులు కలిగిన రచయితలకు, వారి వారసులకు లేదా సంస్థలకు అవగాహన కల్పించి, వారి ద్వారా అనుమతి పొందడం
  • అనుమతి పత్ర సమర్పణ అవకాశం, ప్రాధాన్యతలను అనుసరించి చిన్నపాటి కార్యక్రమం ద్వారా స్వేచ్ఛా నకలు హక్కులపై అవగాహన విస్తరించడం
  • తెవికీసోర్స్ లో చేర్చే అంశంపై ఆయా గ్రంథాల జాబితాను తెవికీసోర్సులో ప్రచురించి ప్రాధాన్యత నిర్ధారించుకోవడం
  • పీడీఎఫ్ దస్త్రాలను కామన్స్ కు ఎక్కించడం
  • విజ్ఞానదాయకమైనవి, ప్రాధాన్యతకలిగినవి వికీసోర్సులో డిజిటైజ్ చేయడం
ఆశించే ఫలితం
  • కనీసం 250 తెలుగు పుస్తకాలు తెవికీలో చేరుతాయి
  • వికీపీడియా లో కనీసం 100 మంచి నాణ్యత గల వ్యాసాలు రూపొందుతాయి.

తెలుగు వికీసోర్సర్లకు శిక్షణ కార్యక్రమం

[మార్చు]
ప్రణాళిక

తెలుగు వికీసోర్సుపై కృషిచేస్తున్న పలువురు వాడుకరులకు ఓసీఆర్ మొదలుకొని అనేక సాంకేతిక అంశాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించడం.

కార్యాచరణ
  • తెలుగు వికీసోర్సులో కృషిచేస్తున్న వాడుకరులకు సాంకేతికాంశాలపై అవసరాలు ఏమిటన్నది మదింపు చేయడం.
  • ఆ అంశాల్లో నిపుణులతో ప్రత్యేకించి వికీసోర్సు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం.
  • శిక్షణ అనంతరం వికీసోర్సర్లలో ఆయా సాంకేతికాంశాలపై జరిగిన అభివృద్ధిని పలు మదింపు పద్ధతుల్లో మదింపు చేయడం.
ఆశించే ఫలితాలు
  • తెలుగు వికీసోర్సులో ఆయా వికీసోర్సర్లు ప్రస్తుతం చేస్తున్న కృషిలో సులువు పెంపు, నాణ్యత అభివృద్ధి.

డిజిటైజేషన్ కృషిలో సహకారం

[మార్చు]
ప్రణాళిక

తెలుగు వికీసోర్సును కొత్త వాడుకరులకు పరిచయం చేయడం, డిజిటైజేషన్ స్ప్రింట్ నిర్వహించడం ద్వారా సాగుతున్న డిజిటైజేషన్ కృషిలో సహకారం అందించడం. ఈ ప్రయత్నంలో గతంలో చేర్చిన పుస్తకాల్లోని లోపాలు సరిజేయడం, వాటిని మెరుగైన పాఠ్యంతో అభివృద్ధి చేయడం.

కార్యాచరణ
  • తెలుగు వికీసోర్సులో చర్చించి ప్రాధాన్యత కలిగిన పుస్తకాలను, ఇప్పటికే వికీసోర్సులో చేర్చగా పాఠ్యీకరణలో లోపాలు కలిగిన పుస్తకాలను గుర్తించడం.
  • వాటిని డిజిటైజ్ చేసేలా విద్యార్థి వికీమీడియన్లు, ఔత్సాహికులతో తెలుగు వికీసోర్సుకు డిజిటైజేషన్ స్ప్రింట్ నిర్వహించడం.
  • డిజిటైజేషన్ స్ప్రింట్ లో భాగంగా పాల్గొన్నవారికి ఓసీఆర్ వంటి సాంకేతిక ఉపకరణాల వినియోగం, సరిజూడడం వంటివి నేర్పించడం.
అందుబాటులోని వనరులు
  • మెరుగైన ఓసీఆర్, బ్రిస్ కట్టర్ వంటి సాంకేతిక ఉపకరణాలు అందుబాటులో ఉండడం.
  • విద్యార్థి వికీపీడియన్లు ఇందుకు ఆసక్తి చూపించడం.
ఆశించే ఫలితాలు
  • వికీసోర్సులో కనీసం 1000కి పైగా పుటలు డిజిటైజ్ కావడం
  • ఇప్పటికే వికీసోర్సులో చేరిన పుస్తకాల్లో కనీసం 400-500 పుటల నాణ్యత అభివృద్ధి చేయడం
  • వికీసోర్సులోకి కనీసం 25-30 మంది వికీసోర్సర్ల చేరిక, వారిలో 4-5 మంది చురుకైన వికీసోర్సర్లు కావడం.

కార్యాచరణ పరంగా లక్ష్యాలు

[మార్చు]

కార్యాచరణ వారీగా లక్ష్యాలు

[మార్చు]
కార్యకలాపాలు కొత్త వ్యాసాల సంఖ్య అభివృద్ధి చేసే ప్రస్తుత వ్యాసాల సంఖ్య కొత్త వాడుకరుల సంఖ్య కొత్త యాక్టివ్ యూజర్ల సంఖ్య కార్యక్రమాల సంఖ్య ఏర్పరిచే భాగస్వామ్యాల సంఖ్య (సంస్థలు/గ్రూపులు)
విద్యాసంస్థలతో భాగస్వామ్యాలు 200 500 150-250 10-20 10 2-3
పట్టణాలు, నగరాలకు విస్తరణ 80 120 60-120 15 6
తెవికీలో బొమ్మలు చాయాచిత్రాలు 500 4
తెవికీ సముదాయంలో, సమాచారంలో వైవిధ్యం పెంపు 150 90-120 13-20 6
వనరులుగా పనికివచ్చే గ్రంథభాగం పంచుకోవడం 100 50
నెలవారీ మొలకల జాబితా ప్రచురణ 300-400
తెలుగు రాష్ట్రాల్లో వికీపీడియా 60-80 40-60 10-15 2
నెలవారీ సమావేశాల్లో శిక్షణ 6
తెలుగు గ్రామాల ప్రాజెక్టు 2000
యాంత్రిక వ్యాసాల శుద్ధి ప్రాజెక్ట్ 150 300-400
తెలుగు వికీసోర్సర్లకు శిక్షణ కార్యక్రమం 2
తెలుగు వికీసోర్సులో డిజిటైజేషన్ స్ప్రింట్ 700 4
మొత్తం 1090 3410 300-550 48-70 40 2-3

బడ్జెట్

[మార్చు]
వ్యయాంశం ఎఫ్.డి.సి. సపోర్ట్ (INR) ఎఫ్.డి.సి సపోర్ట్ (యు.ఎస్. డాలర్లలో) ఇన్-కైండ్ సపోర్ట్(INR) ఇన్-కైండ్ సపోర్ట్ (US డాలర్లలో)
ప్రోగ్రాం అసోసియేట్x100%
ప్రోగ్రాం ఆఫీసర్స్x20%
సశక్తియుతం చేసే కార్యక్రమాలుx20%
ఈవెంట్స్/మీటప్స్/వర్క్ షాపులు

  • విద్యాసంస్థలతో భాగస్వామ్యం(12 కార్యక్రమాలు) = రూ.60000/-
  • పట్టణాలు, నగరాలకు విస్తరణ(6 కార్యక్రమాలు) = రూ.40000/-
  • తెవికీలో బొమ్మలు, ఛాయాచిత్రాలు(4 కార్యక్రమాలు) = రూ.22000/-
  • తెవికీ సముదాయంలో వైవిధ్యం పెంపు(4 కార్యక్రమాలు) = రూ.30000/-
  • తెలుగు రాష్ట్రాల ఆవల తెవికీ (2 కార్యక్రమాలు) = రూ.12000/-
  • నెలవారీ సమావేశాల్లో శిక్షణ (6 కార్యక్రమాలు) = రూ.24000/-
  • తెలుగు వికీసోర్సర్లకు శిక్షణ కార్యక్రమం (2 కార్యక్రమాలు) = రూ.12000/-
  • వికీసోర్సు డిజిటైజేషన్ సహకారం (4 కార్యక్రమాలు) = రూ.24000/-
2,24,000/-
వాలంటీర్ సపోర్ట్ 80,000/-
పరికరాలు 50,000/-
ముద్రణ/స్టేషనరీ 50,000/-
ఇతరాలు 6,000/-
మొత్తం 4,04,000/-