వికీపీడియా:2016 రాజమండ్రి పుస్తక ప్రదర్శన - తెవికీ స్టాల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నవ్యాంధ్ర పుస్తక సంబరాల్లో భాగంగా రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల మైదానంలో తెలుగు వికీపీడియా స్టాల్ నిర్వహిస్తున్నాం. ఈ నేపథ్యంలో తెలుగు వికీపీడియా స్టాల్ కు సంబంధించిన పలు వివరాలను ఈ పేజీలో చూడవచ్చు.

నిర్వహణ

[మార్చు]

20 నవంబర్ 2016 నుంచి పుస్తక ప్రదర్శనలో స్టాల్ నిర్వహిస్తున్నాం. స్టాల్ లో పాల్గొనే స్వచ్ఛంద కార్యకర్తలు తమకు అనువైన తేదీలు ఈ కింద నమోదు చేసుకోవచ్చు.

స్టాల్ నిర్వహణ
  • 20 నవంబర్ 2016 - విశ్వనాథ్, ప్రణయ్ రాజ్, విజయ విశ్వనాథ్
  • 21 నవంబర్ 2016 - గుళ్ళపల్లి నాగేశ్వరరావు, ప్రణయ్ రాజ్, పవన్ సంతోష్ (బ్యానర్, ఏర్పాట్లు వగైరా)
  • 22 నవంబర్ 2016 - గుళ్ళపల్లి నాగేశ్వరరావు, ప్రణయ్ రాజ్
  • 23 నవంబర్ 2016 - గుళ్ళపల్లి నాగేశ్వరరావు, ప్రణయ్ రాజ్
నిర్వహణ సహకారం
  • సీఐఎస్-ఎ2కె
  • ఎన్టీఆర్ ట్రస్ట్

కార్యకలాపాలు

[మార్చు]
  • తెలుగు వికీపీడియా, వికీమీడియా ప్రాజెక్టుల పట్ల అవగాహన పెంపు
  • తెలుగు వికీమీడియా ప్రాజెక్టుల గురించిన కరపత్రం పంపిణీ
  • ఆసక్తి కలవారు తెవికీలో ఖాతా తెరిచేందుకు సహాయం
    • పరిమిత సంఖ్య సర్వే
    • సర్వే ప్రధానంగా తెలుగు పాఠకులకు తెవికీ గురించి పరిచయం ఉందా, వారు కోరుకుంటున్న సమాచారం లేక వ్యాసాలు ఎలాంటివి వంటి అంశాలపై.
  • ఆసక్తి కనబరిచిన పాఠకులకు సర్వే నిర్వహించడం
  • వికీపీడియాలో సమాచారం వినియోగించుకోవడం గురించి, కొత్తగా సమాచారం చేర్చడం గురించి నేర్పడం
  • ఇంటర్నెట్ అందుబాటులో లేనప్పుడూ తెలుగు టైపింగ్ ఎలా చేయవచ్చన్న విషయాన్ని చూపడం
  • ...ఇతర అనుబంధ కార్యకలాపాలు

అభినందనలు - సూచనలు

[మార్చు]

ఖాతా సృష్టించినవారిలో కొందరు

[మార్చు]

--S dhana babu (చర్చ) 13:53, 21 నవంబర్ 2016 (UTC)

నివేదిక

[మార్చు]

వివరాలు

[మార్చు]
  • వికీపీడియా స్టాల్ ను రెండవ రోజు (ఆదివారం) నుంచి ప్రారంభించాము, ఆదివారం నాడు విశ్వనాధ్.బి.కె., విజయ విశ్వనాథ్ గార్లు నిర్వహణ చేపట్టగా, మూడవ రోజు (సోమవారం) నుంచి ఐదవ రోజు (బుధవారం) వరకూ గుళ్ళపల్లి నాగేశ్వరరావు గారు స్టాల్ నిర్వహించారు.
  • ప్రణయ్ రాజ్ గారు పుస్తక ప్రదర్వన జరిగినన్ని రోజులు స్టాల్ నిర్వహణకు ప్రధాన సహకారం అందించగా, పవన్ సంతోష్ సోమవారం నాడు నిర్వహణకు సహకరించారు. ఎన్టీట్రస్టు వారు స్టాల్ కు సౌజన్యం అందించగా, ట్రస్టు బృందం స్టాల్ నిర్వహణలో సహకరించారు.
  • దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ ప్రవేశపెట్టిన 500, 1000 నోట్ల రద్దు కార్యక్రమం రాజమండ్రి పుస్తక ప్రదర్శనను తీవ్రంగా ప్రభావితం చేసింది. పుస్తక ప్రదర్శనలో అమ్మకాలు, హాజరు వంటివి మందకొడిగా ఉండడంతో అది స్టాల్ సందర్శకుల సంఖ్యను, ప్రభావాన్ని కూడా ప్రతిబింబించింది.
  • వచ్చినవారిలో ఆసక్తి కలిగిన వారితో ఖాతాలు సృష్టించడం, వారికి వికీపీడియా గురించి వివరించడం, పాఠకుల ఆసక్తులపై తయారుచేసిన సర్వే నిర్వహించడం వంటి కార్యక్రమాలు జరిగాయి.

చిత్రమాలిక

[మార్చు]

స్పందన

[మార్చు]