వికీపీడియా:2021 వికీమీడియా ఫౌండేషన్ బోర్డు ఎన్నికలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ అనేది వికీమీడియా ఫౌండేషన్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. కమ్యూనిటీ ట్రస్టీలు, నియమించబడిన ట్రస్టీలు కలిసి బోర్డ్ ఆఫ్ ట్రస్టీని ఏర్పాటుచేస్తారు. ప్రతి ట్రస్టీ మూడేళ్ల కాలపరిమితితో పనిచేస్తారు. వికీమీడియా కమ్యూనిటీకి కమ్యూనిటీ ట్రస్టీలకు ఓటు వేసే అవకాశం ఉంది. వికీమీడియా కంట్రీబ్యూటర్లు బోర్డులో ప్రస్తుతం నాలుగు సీట్లను భర్తీ చేయడానికి ఓటు వేయవలసివుంటుంది. వికీమీడియా కార్యకలాపాల్లో వికీ సముదాయాల ప్రాతినిధ్యం, వైవిధ్యం, నైపుణ్యాన్ని మెరుగుపరచడానికి ఇది ఒక మంచి అవకాశం.

వికీమీడియా ఫౌండేషన్ గురించి

వికీమీడియా ఫౌండేషన్ లాభాపేక్షలేని సంస్థ, ఇది వివిధ వికీమీడియా ప్రాజెక్టులకు మద్దతు ఇస్తోంది. సాంకేతిక సహకారాన్ని, వాలింటీర్లను, అనుబంధ సంస్థలకు వనరులు అందించడం ద్వారా వికీమీడియా ప్రాజెక్టుల వృద్ధికి వికీమీడియా ఫౌండేషన్ వారు మద్దతును ఇస్తారు.

వికీమీడియా ఫౌండేషన్ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ ఉంటుంది. ఫౌండేషన్ యొక్క వార్షిక ప్రణాళికను కూడా బోర్డు పర్యవేక్షిస్తుంది, ఇది ఒక సంవత్సరంలో వివిధ ప్రాజెక్టులు, ప్రాంతాలు, సముదాయాలకు ఫౌండేషన్ మద్దతును నిర్ణయించటంలో ఈ ట్రస్టీ చాలా కీలకంగా ఉంటుంది.

2021 కమ్యూనిటీ సీట్ల కోసం బోర్డు ఎన్నికలు

బోర్డ్ ఆఫ్ ట్రస్టీలోని 16మంది ట్రస్టీలలో ఒకరు వికీపీడియా వ్యవస్థాపకుడు కాగా, ఏడుగురిని అవసరమైన నైపుణ్యం కోసం ట్రస్టీలు నియమిస్తారు, సముదాయ ఎన్నికల ప్రక్రియ ద్వారా ఎనిమిది స్థానాలను ఎన్నుకుంటారు. ఈ ఎనిమిది సీట్లలో ప్రస్తుతం నాలుగు సీట్లు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాయి.

వికీమీడియా ఫౌండేషన్ చరిత్రలో గత 15 సంవత్సరాలలో, దక్షిణ ఆసియా ప్రాంతం నుండి ఎవరికీ బోర్డులో పనిచేసే అవకాశం రాలేదు. ఇది వికీమీడియా ఉద్యమం యొక్క ఉన్నత-స్థాయి పాలన నిర్మాణాలలో సముదాయం, ప్రాంతం నుండి ప్రాతినిధ్యం లేకపోవడాన్ని ప్రభావితం చేస్తుంది.

ఈసారి, దాన్ని మార్చడానికి మనకు అవకాశం ఉంది. మీరు ఈ ఎన్నికల్లో భాగస్వామ్యవడానికి దయచేసి దిగువ ఎన్నికల వివరాలను చూడండి.

కాలక్రమం

  • జూన్ 6-29: అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానం
  • జూలై 2: ధృవీకరించబడిన అభ్యర్థుల ప్రకటన
  • జూలై 7 - ఆగస్టు 3: అభ్యర్థుల ప్రచారం
  • ఆగస్టు 18-31: కమ్యూనిటీ ఓటింగ్ కాలం
  • సెప్టెంబరు 7: ఓటు ఫలితాల ప్రకటన

ఓటింగ్ సమాచారం

వికీమీడియా వికీలో మీరు కలిగి ఉన్న ఏదైనా ఒక రిజిస్టర్డ్ ఖాతా నుండి ఓటు వేయవచ్చు. మీరు ఎన్ని ఖాతాలను కలిగి ఉన్నప్పటికీ, మీరు ఒక్కసారి మాత్రమే ఓటు వేయవచ్చు. ఓటింగ్ అర్హత పొందడానికి, ఒక ఖాతా తప్పనిసరి:

  • ఒకటి కంటే ఎక్కువ ప్రాజెక్టులలో నిరోధించబడి ఉండకూడదు;
  • బాట్ కారాదు;
  • వికీమీడియా వికీలలో 5 జూలై 2021 కి ముందు కనీసం 300 సవరణలు చేసివుండాలి;
  • 5 జనవరి 2021 నుండి 5 జూలై 2021 మధ్య కనీసం 20 సవరణలు చేసివుండాలి.

ప్రాథమిక ఎడిటర్ ఓటింగ్ అర్హతను త్వరగా ధృవీకరించడానికి అకౌంట్ ఎలిజిబిలిటీ సాధనం ఉపయోగపడుతుంది.

గమనిక: మీకు అర్హత లేకపోతే, ఇంకా 5 జూలై 2021 అవకాశం ఉంది. దయచేసి వికీమీడియా ప్రాజెక్టులకు సహకరించడాన్ని పరిశీలించండి.

అభ్యర్థులు

ప్రస్తుత అభ్యర్థుల పేర్లు ఇక్కడ ఉన్నాయి.

ప్రశ్నలు?

మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, దయచేసి ఎన్నికల వాలంటీర్‌ను లేదా ఫెసిలిటేటర్ ని సంప్రదించండి లేదా చర్చా పేజీలో సందేశాన్ని పోస్ట్ చేయండి.