వికీపీడియా:WikiProject Medicine/Translation task force/RTT/Simple Childbirth
WikiProject Medicine/Translation task force/RTT/Simple Childbirth | |
---|---|
ఇతర పేర్లు | partus, parturition, birth |
మహిళ గర్భాశయం నుండి ఒకరు లేదా అంతకంటే ఎక్కువమంది శిశువులు బయటికి రావటం అనేది గర్భంముగింపుగా ఉంది, దీన్నిశిశుజననం అని అంటారు, కాన్పు మరియు ప్రసవం అని కూడా పిలుస్తారు.[1] 2015 లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 135 మిలియన్ల జననాలు సంభవించాయి.[2] 42 వారాల తరువాత]] 3 నుండి 12% మంది పుడుతుండగా గర్భావది కాలానికి 37 వారాల ముందు[[నెలలు తక్కువ కాన్పు| సుమారుగా 15 మిలియన్లు మంది జన్మించారు.[3][4] అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో సాంప్రదాయ మంత్రసాని మద్దతుతో చాలా జననాలు ఇంటిలో జరుగుతుండగా, అభివృద్ధి చెందిన ప్రపంచంలో చాలా ప్రసవాలు ఆసుపత్రులలో జరుగుతున్నాయి[5][6].[7]
యోని ద్వారా ప్రసవం అనేది అతి సాధారణ కాన్పుగా ఉంది.[8] దీనిలో మూడు దశల ప్రసవం ఉంటుంది:కుదించుకు పోవటం మరియు గర్భాశయం తెరచుకోవటం, బిడ్డ క్రిందకు జారటం మరియు జననం, మరియు మాయను బయటకు తొయ్యటం.[9] మొదటి దశకు సాధారణంగా పన్నెండు నుండి పందొమ్మిది గంటలు పడుతుంది, రెండవ దశకు ఇరవై నిమిషాల నుండి రెండు గంటలు పడుతుంది మరియు మూడవ దశకు ఐదు నుండి ముప్పై నిమిషాలు పడుతుంది.[10] మొట్టమొదటి దశ అర నిమిషం పాటు ఉండే పొత్తికడుపు బిగదీయటం ద్వారా లేదా వీపు నొప్పులతో ప్రారంభమవుతుంది ప్రతి పది నుంచి ముప్పై నిమిషాలకు ఇవి వస్తుంటాయి.[9] ఈ బిగదీసిన నొప్పులు సమయం గడిచే కొద్దీ బాగా ఎక్కువగా మరియు త్వరత్వరగా వస్తాయి.[10] రెండవ దశలో అవయవం ముడుచుకుపోవటంతో బిడ్డ బయటికి నెట్టబడటం సంభవించవచ్చు.[10] మూడవ దశలోఆలస్యంగా బొడ్డు త్రాడును కత్తిరించటం అనేది సాధారణంగా సిఫార్సు చేయబడుతుంది.[11] నొప్పికిఉపశమన పద్ధతులు వంటివి,ఒపియోడ్లు, మరియు వెన్నెముక అనస్థీషియాలైన అనేక పద్ధతులు సహయపడవచ్చు.[10]
చాలామంది పిల్లలు మొదటిగా తల వచ్చేలా జన్మిస్తారు; అయితే సుమారు 4% మంది ముందుగా పాదాలు లేదా పిరుదులు వచ్చేలా పుడతారు, దీన్నిపిరుదులు అని పిలుస్తారు.[10][12] ప్రసవ సమయంలో సాధారణంగా మహిళ తనకు నచ్చినట్లుగా తినవచ్చు మరియు అటూ ఇటూ తిరగవచ్చు, మొదటి దశలో లేదా తల ముందుగా వచ్చే కాన్పు జరుగుతున్న సమయంలో బిడ్డను ముందుకు నెట్టటం అనేది సిఫార్సు చేయబడలేదు మరియు ఎనిమాలు సిఫారసు చేయబడలేదు.[13] ఎపిసియోటమీ అని పిలవబడేయోనిని కత్తిరించి తెరిచే విధానం సాధారణంగా జరుగుతున్నప్పటికీ, దీని అవసరం సాధారణంగా రాదు.[10] 2012లో,సిజేరియన్ శస్త్రచికిత్స అని పిలవబడే శస్త్రచికిత్స పద్ధతి ద్వారా 23 మిలియన్ ప్రసవాలు జరిగాయి.[14] కవల పిల్లలు, శిశువుకు ఆపదతో కూడిన సంకేతాలు, లేదా పిరుదులు,ఎదురుకాళ్ళతో పుట్టే స్థితి కోసం సిజేరియన్ శస్త్రచికిత్స సిఫార్సు చేయబడవచ్చు.[10] ఈ ప్రసవ విధానం కారణంగా నయం కావటానికి ఎక్కువ సమయం పడుతుంది.[10]
ప్రతి సంవత్సరం దాదాపు 500,000 ప్రసూతి మరణాలకు గర్భం మరియు శిశు జననంతో వచ్చే సమస్యలు కారణమవుతున్నాయి, 7 మిలియన్ల మహిళలలు తీవ్రమైన దీర్ఘకాలిక సమస్యలను ఎదుర్కొంటున్నారు, మరియు ప్రసవం తరువాత 50 మిలియన్ల మంది మహిళలకు ప్రతికూల ఆరోగ్య ఫలితాలు సంభవిస్తున్నాయి.[15] వీటిలో ఎక్కువ భాగం అభివృద్ధి చెందుతున్న దేశాలలోజరుగుతాయి.[15] ప్రత్యేక సమస్యలలో కష్టంతో కూడిన ప్రసవం, ప్రసవానంతర రక్తస్రావం, ప్రసూతి వాతం, మరియు ప్రసవానంతర ఇన్ఫెక్షన్ఉంటాయి.[15] శిశువుకు గల సమస్యలలో పుట్టుకతో వచ్చే శ్వాసావరోధం ఉంటుంది.[16]
రిఫరెన్సులు
[మార్చు]- ↑ Martin, Elizabeth. Concise Colour Medical Dictionary (in ఇంగ్లీష్). Oxford University Press. p. 375. ISBN 9780199687992.
- ↑ "The World Factbook". www.cia.gov. July 11, 2016. Retrieved 30 July 2016.
- ↑ "Preterm birth Fact sheet N°363". WHO. November 2015. Retrieved 30 July 2016.
- ↑ Buck, Germaine M.; Platt, Robert W. (2011). Reproductive and perinatal epidemiology. Oxford: Oxford University Press. p. 163. ISBN 9780199857746.
- ↑ Co-Operation, Organisation for Economic; Development (2009). Doing better for children. Paris: OECD. p. 105. ISBN 9789264059344.
- ↑ Olsen, O; Clausen, JA (12 September 2012). "Planned hospital birth versus planned home birth". The Cochrane database of systematic reviews (9): CD000352. PMID 22972043.
- ↑ Fossard, Esta de; Bailey, Michael (2016). Communication for Behavior Change: Volume lll: Using Entertainment–Education for Distance Education. SAGE Publications India. ISBN 9789351507581. Retrieved 31 July 2016.
- ↑ Memon, HU; Handa, VL (May 2013). "Vaginal childbirth and pelvic floor disorders". Women's health (London, England). 9 (3): 265–77, quiz 276-7. PMID 23638782.
- ↑ 9.0 9.1 "Birth". The Columbia Electronic Encyclopedia (6 ed.). Columbia University Press. 2016. Retrieved 2016-07-30.
- ↑ 10.0 10.1 10.2 10.3 10.4 10.5 10.6 10.7 "Pregnancy Labor and Birth". Women's Health. September 27, 2010. Retrieved 31 July 2016.
- ↑ McDonald, SJ; Middleton, P; Dowswell, T; Morris, PS (11 July 2013). "Effect of timing of umbilical cord clamping of term infants on maternal and neonatal outcomes". The Cochrane database of systematic reviews (7): CD004074. PMID 23843134.
- ↑ Hofmeyr, GJ; Hannah, M; Lawrie, TA (21 July 2015). "Planned caesarean section for term breech delivery". The Cochrane database of systematic reviews (7): CD000166. PMID 26196961.
- ↑ Childbirth: Labour, Delivery and Immediate Postpartum Care (in ఇంగ్లీష్). World Health Organization. 2015. p. Chapter D. ISBN 978-92-4-154935-6. Retrieved 31 July 2016.
- ↑ Molina, G; Weiser, TG; Lipsitz, SR; Esquivel, MM; Uribe-Leitz, T; Azad, T; Shah, N; Semrau, K; Berry, WR; Gawande, AA; Haynes, AB (1 December 2015). "Relationship Between Cesarean Delivery Rate and Maternal and Neonatal Mortality". JAMA. 314 (21): 2263–70. doi:10.1001/jama.2015.15553. PMID 26624825.
- ↑ 15.0 15.1 15.2 Education material for teachers of midwifery : midwifery education modules (PDF) (2nd ed.). Geneva [Switzerland]: World Health Organisation. 2008. p. 3. ISBN 978-92-4-154666-9.
- ↑ Martin, Richard J.; Fanaroff, Avroy A.; Walsh, Michele C. Fanaroff and Martin's Neonatal-Perinatal Medicine: Diseases of the Fetus and Infant (in ఇంగ్లీష్). Elsevier Health Sciences. p. 116. ISBN 9780323295376.