వికీపీడియా చర్చ:తొలగింపు కొరకు వ్యాసాలు/మోడి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మోడి మోడి ఒక క్రీడ, ఒక ఆట, ఒక వినోద కార్యక్రమం, ఇది తమిళనాడు సరి హద్దు గ్రామాలలోను, చిత్తూరు జిల్లా గ్రామాలలో గతంలో ఎక్కువగా జరిగేది. దాన్ని మోడి ఎత్తడం అనేవారు. అది జరిగే విధానం:.............................. ఒక గ్రామ ప్రాంతానికి చెందిన మంత్రగాడు, పర గ్రామనికి చెందిన మంత్ర గానితో పందెం కడతాడు. ఊరి బయట ఒక వేప చెట్టు కింద వేప మండలతో చిన్న పందిరి నిర్మిస్తాడు. దాని ముందు బొగ్గు పొడితో, ముగ్గు పిండితో, కుంకుమ, పశుపులతో, భయంకరమైన బొమ్మలను వేస్తాడు. నాలుగు వైపుల నిమ్మకాయలను కోసి పెడ్తారు. దాని ముండు వరసగా ఏడు చక్రాలను బొగ్గు పొడితో గీసి ఒక్కో దానిలొ ఒక వస్తువును పెడతారు. ఆయా వస్తువులు ఆ మంత్రగానిష్టం. సామాన్యంగా, ఒక దాంట్లో నిమ్మకాయ, ఒక దాంట్లో కోడిగుడ్డు, కొన్నింటిలో ఎదో వింత వస్తువులు పెడతారు. మంత్రగాడు అన్నింటికి మంత్రం వేసి బందిస్తాడు. అంటే ఆ వృత్తం లోనికి ఎవరూ ప్రవేచించ లేరు. ఇప్పుడు ప్రత్యర్థి మంత్ర గాడు పాముల బుర్రను వూదుతూ మొదటి వృత్తం చుట్టు తిరుగుతాడు, లోన కెళ్లడానికి ప్రయత్నిస్తాడు. ఎదుటి వాడి మత్ర భలంచే లోనికి ప్రవేసించ లేక పోతాడు. ఆ క్రమంలో అతనికి ఎన్నో ఇబ్బందులు ఎదురౌతాయి. వళ్లంతా బొబ్బలెక్కడం, రక్తం కక్కడం, వింత శ బ్దాలు చేయడం ఇలా అనేక వింత చేష్టలు చేస్తాడు. ఇదంతా ప్రత్యర్థి మంత్ర జాల మహిమే. స్తానిక మంత్రగాడు మాత్రం వేపమండల పందిరిలో లో కూర్చొని ఏవో మంత్రాలను పఠిస్తూ వింత శబ్దాలు చేస్తూ వుంటాడు. ఆ మంత్రగాని ఎత్తులకు పై ఎత్తులు వేసి చివరకు ఆ రింగు లోనికి ప్రవేసిస్తాడు ప్రత్యర్థి. అలా ఒక ఘట్టం పూర్తవుతుంది. ఇక రెండోది...... అది కోడి గ్రుడ్డు అయితే కొంత సేపటికి ఆ కోడి గ్రుడ్డు కోడిగా మారి ఎగిరి పోతుంది. మంత్ర గాడు దానెంబడి పడి పట్టు కొస్తాడు. ఇలా అన్నీ రింగుల లోని వస్తువులను దక్కించు కోవాలి. అలా అయితే ఎదుటి మంత్ర గాడు గెలిచి నట్టు. అలా ఎన్నటికి జరగదు. ఎదో ఒక రింగులో మంత్రగాడు పడి పోతాడు. సామాన్యంగా చివరి రింగులో పడి పోతాడు. స్తానిక మంత్రగానికి గౌరవం దక్కేటట్లు ఏర్పాటు చేసిన ప్రక్రియ ఇది. దాంతో ఆ "మోడి" పరిసమాప్తం అవుతుంది. ఇలా సుమారు రెండు మూడు గంటలు జరుగుతుంది. ఈ భయంకర మయిన క్రీడను/ వినోదాన్ని చూడ్డానికి చిన్న పిల్లలకు నిషేదం. పెద్దలు మాత్రం చాల మంది వస్తారు. అసలు విషయం ఏమిటంటే ఈ ఇరువురి మంత్ర గాళ్ల మద్యన ఒక రహస్య ఒప్పందం ఉంటుందట. bhaskaranaiDu 14:03, 19 మే 2011 (UTC)


[[ఈ "మోడి" గురించి కొంత మందికి ఇంకా కొన్ని ఎక్కువ విషయాలు తెలిసి వుండ వచ్చు. అలాంటి వారు ఈ వ్యాసాన్ని ఇంకొంచెం విస్తరిస్తే చాల సంతోషం. చాల మందికి ఈ విషయం తెలియడమే మన ఉద్దేశం గదా?..............................."]]bhaskaranaiDu 16:19, 19 మే 2011 (UTC)