Jump to content

వికీవాండ్

వికీపీడియా నుండి
వికీవాండ్
Type of businessప్రైవేటు స్టార్టప్ కంపనీ
Available in52 భాషలలో
Founded2013
Headquartersశాన్ ఫ్రాన్సిస్కో బే ప్రాంతం
Area servedప్రపంచవ్యాప్తంగా
Founder(s)లియర్ గ్రాస్మాన్, ఇలాన్ లెవిన్
Employees10+
Registrationఐచ్ఛికం
Current statusఅంతర్జాలం

వికీవాండ్ అనేది ఒక సాఫ్ట్‌వేర్ ఇంటర్‌ఫేస్. వికీపీడియా వ్యాసాలను చూడడంకోసం ఈ ఇంటర్‌ఫేస్ అభివృద్ధి చేయబడింది.[1] అనేక ఇతర ముఖ్యమైన వెబ్ బ్రౌజర్‌లకు ఉచిత బ్రౌజర్ గా, మొబైల్ యాప్ గా కూడా ఈ ఇంటర్‌ఫేస్ అందుబాటులో ఉంది. ఇది ప్రాయోజిత కథనాలు, ప్రకటనలు అనుకూలమైన నావిగేషన్ తో కూడిన ఇంటర్‌ఫేస్‌ను అందిస్తోంది.[2]

చరిత్ర

[మార్చు]

2013లో లియర్ గ్రాస్మాన్, ఇలాన్ లెవిన్ అనే ఇద్దరు వ్యక్తులు ఈ వికీవాండ్ ను స్థాపించారు.[3] 2014, ఆగస్టు నెలలో ఇది అధికారికంగా ప్రారంభించబడింది.[4] ఈ ఇంటర్‌ఫేస్‌లో సైడ్‌బార్ మెనూ, నావిగేషన్ బార్, ఇతర భాషలకు వ్యక్తిగతీకరించిన లింకులు, కొత్త టైపోగ్రఫీ, లింక్డ్ వ్యాసాల ప్రివ్యూలకు అనుమతులు ఉన్నాయి.[5] ఇందులో విషయాల జాబితా నిరంతరం ఎడమవైపు చూపబడుతుంది.[6] 2020, జూలై నెలలో ఒక వికీవాండ్ వెబ్‌పేజీలో 6 ప్రకటనలు, 36 ప్రాయోజిత కథనాలు ఉన్నాయి. ఇందులో ఐదు ప్రకటనలు వ్యాస ప్రధాన కంటెంట్ విభాగంలో ఉన్నాయి. ఒకటి ఎడమ చేతి నావిగేషన్ బార్‌లో, ప్రాయోజిత కథనాలు వ్యాసం కంటెంట్ క్రింద ఉన్నాయి. [2]

"ఇది ప్రపంచంలోని ఐదవ అత్యంత ప్రజాదరణ పొందిన వెబ్‌సైట్, దీనిని అర బిలియన్ మంది ప్రజలు ఉపయోగిస్తున్నారు. వికీపీడియా ఇంటర్‌ఫేస్‌ చిందరవందరగా ఉంటూ, చదవడానికి, నావిగేట్ చేయడానికి, ఉపయోగించడానికి కష్టంగా ఉందని మేము కనుగొన్నాము" అని గ్రాస్మాన్ తెలిపాడు.[7]

2017, మే నెలలో దీని సిటిఓగా పనిచేస్తున్న ఇలాన్ లెవిన్ వికీవాండ్ నుండి వెళ్ళిపోయాడు.[8]

2019, జనవరి నెలలో దీని సిఇఓగా పనిచేస్తున్న లియోర్ గ్రాస్మాన్ వికీవాండ్ నుండి వెళ్ళిపోయాడు.[9]

లభ్యత

[మార్చు]

క్రోమ్, సఫారి, ఫైర్‌ఫాక్స్‌తో పాటు వికీవాండ్ వెబ్‌సైట్ ద్వారా ఈ ఇంటర్‌ఫేస్‌ అందుబాటులో ఉంది. 2015, మార్చి నెలలో ఐఫోన్, ఐప్యాడ్ కోసం ఐఓఎస్ యాప్ ను వికీవాండ్ విడుదల చేసింది.[10] ప్రస్తుతం ఆండ్రాయిడ్ యాప్ అభివృద్ధి దశలో ఉంది.[11]

2014లో ఇంటర్‌ఫేస్‌ అభివృద్ధికి వికీవాండ్ 600,000 డాలర్లు వసూలు చేయగలిగింది. ప్రకటనల ద్వారా ఆదాయం పెంచాలనుకున్నట్లు తెలిపింది.[7] అందులో 30% లాభాలు వికీమీడియా ఫౌండేషన్ కు విరాళంగా ఇచ్చారు.[12]

మూలాలు

[మార్చు]
  1. Jillian Wong (21 August 2014). "'WikiWand' Gives Wikipedia Clean New Layout For A Better Reading Experience". Taxi. Archived from the original on 19 సెప్టెంబరు 2016. Retrieved 9 January 2021.
  2. 2.0 2.1 "Dieges & Clust - Wikiwand". Wikiwand. Retrieved 9 January 2021.
  3. "WikiWand". CrunchBase. Retrieved 9 January 2021.
  4. "WikiWand". Twitter. Retrieved 9 January 2021.
  5. Martin Brinkmann (14 August 2014). "WikiWand is a modernized Wikipedia frontend". ghacks.net. Retrieved 9 January 2021.
  6. "WikiWand makes Wikipedia beautiful". TNW. Retrieved 9 January 2021.
  7. 7.0 7.1 "Web App WikiWand Raises $600,000 To Give Wikipedia A New Interface". techcrunch.com. 7 August 2014. Retrieved 9 January 2021.
  8. "Ilan Lewin's LinkedIn Profile". Ilan Lewin. Retrieved 9 January 2021.[permanent dead link]
  9. "Ilan Lewin's LinkedIn Profile". Lior Grossman. Archived from the original on 14 మే 2010. Retrieved 9 January 2021.
  10. Zach Epstein (18 March 2015). "New free iPhone app transforms Wikipedia into a stunning interactive experience". Yahoo. Archived from the original on 15 సెప్టెంబరు 2017. Retrieved 9 January 2021.
  11. "Wikiwand for Android". Wikiwand. Archived from the original on 23 జనవరి 2021. Retrieved 9 January 2021.
  12. "About - Wikiwand". Wikiwand. Archived from the original on 2015-02-08.

ఇతర లంకెలు

[మార్చు]