విక్టరీ ఇండియా ఛారిటబుల్ టెంట్ ఆఫ్ రెస్క్యూ యాచ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

విక్టరి ఇండియా ఛారిటబుల్ టెంట్ ఆఫ్ రెస్క్యూ యాట్ - అనే స్వచ్ఛంద సేవాసంస్థ ఏప్రిల్ 11, 1989 న ప్రారంభింపబడింది. ప్రస్తుతం వంద మంది చెవిటి మరియూ మూగ విద్యార్థులు ఈ సంస్థలో విద్యనభ్యసించుచున్నారు. వారికి స్పీఛ్ థెరెపీ మరియూ ఆధునిక పద్ధతుల ద్వారా విద్యాబోధన చేయడంతో పాటుగా వృత్తి విద్యయందు ప్రతేక శిక్షణ ఇవ్వబడుతున్నది. ఈ సంస్థ నియోజకవర్గంలోని వికలాంగులకు ప్రభుత్వం అందించే సహాయము వారికి అందే విధంగా కృషి చేస్తోంది. ఈ సంస్థచే చెవి యంత్రము, త్రిచక్ర వాహనాలు, చేతి కర్రలు, వీల్ చైర్లు ఉచితంగా అందిచబడుచున్నవి, వికలాంగులకు రాయితీ బస్సు పాసులు, వైద్య శిబిరాలను నిర్వహించి వైద్య ధృవీకరణ పత్రాలను అందించుచున్నది.

బయటి లింకులు[మార్చు]

విక్టరీ ఇండియా వెబ్ సైటు.

మూలాలు[మార్చు]

  • [1]
  • [2]
  • వార్తా దిన పత్రికలోని కథనం.