విజయదుర్గ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
VIJAYADURGA
విజయదుర్గ
విజయదుర్గ
Vijayadurga - dooradarshan anchor.png
జననం
విజయవాడ
జాతీయతభారతీయులు
వృత్తియాంకర్, దూరదర్శన్ (టి.వి) .

విజయదుర్గ తెలుగు దూరదర్శన్ వ్యాఖ్యాత, ప్రయోక్త. తెలుగుభాషలో దూరదర్శన్ ప్రసారాలు ప్రారంభమవుతున్న రోజుల్లో మహిళా వ్యాఖ్యాతలలో ఆమె ఒకరు. చక్కని కార్యక్రమాల రూపకల్పన ద్వార బుల్లితెరకు విశేష ఖ్యాతి తెచ్చిపెట్టిన ఘనత సాధించినవారు.[1]

జీవిత విశేషాలు[మార్చు]

ఆమె పుట్టి పెరిగింది విజయవాడ పట్టణంలో. ఆమె విద్యాభ్యాసం పూర్తయ్యేనాటికి ఆమె కుటుంబం హైదరాబాదు వెళ్ళింది. ఆమె దూరదర్శన్ లో చేరకముందు రేడియోలో ప్రోగ్రామ్స్‌ చేశారు. ఫ్రీలాన్స్‌ జర్నలిస్ట్‌గా సినిమా పత్రికలకు ఆర్టికల్స్‌ రాశారు. కొన్నాళ్ళు వీణ, నాట్యం వంటి సాంస్కృతికపరమైన పలు అంశాలపట్ల ఆమెకు ఆసక్తి, అభిరుచి ఉండేది. ఆమె రేడియోలో అప్పట్లో వచ్చే "యువవాణి" కార్యక్రమంలో పాల్గొనేవారు. ఆ సమయంలో దూరదర్శన్‌ వాళ్ళు ప్రెజెంటర్స్ కోసం చేసిన ప్రకటన చూసి దాని ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఇంటర్యూలో వారు 10 పుటక వార్తల్ని గుర్తుపెట్టుకొని వెంటనే ఆడిషన్ ఇమ్మని కోరారు. ఆమె ఒక్క అక్షరం పొల్లు పోకుండా చదివారు. ఆమె దూరదర్శన్ కు సెలెక్ట్ అయ్యారు.[2]

వ్యాఖ్యాతగా[మార్చు]

ఆమె తెలుగు దూరదర్శన్ ప్రసారాలు మొదలవుతున్న రోజుల్లో ప్రజెంటేషన్, యాంకరింగ్, ఇంటర్వ్యూలు వంటి కార్యక్రమాలను నిర్వహించేవారు. ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు భాష, యాస, ఉచ్ఛారణ, శరీరభాష, కట్టూబొట్టూ వంటి అన్ని అంశాలలో శ్రద్ధ తీసుకునేవారు. ఆమెకు స్క్రీన్‌పై కనపడాలనే ఆసక్తి కంటే ఆ ప్రోగ్రామ్‌కు కావాల్సిన విషయంపైనే దృష్టి ఉండేది. ఆమె మొట్టమొదట విజయవాడ కనకదుర్గ దేవాలయం మీద డాక్యుమెంటరీకి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.[3]

ఆమె సినీరంగ ప్రముఖులైన బానుమతి రామకృష్ణ, అక్కినేని నాగేశ్వరరావు, అంజలీదేవి, గుమ్మడి, కె.విశ్వనాథ్‌, దాసరి నారాయణరావు వంటి ఎందరో మహానుభావుల్ని ఇంటర్యూచేసారు. ఆమె సినిమా ఇంటర్వ్యూలే కాకుండా సాంస్కృతిక, సాహిత్య, రాజకీయ, సామాజిక కార్యక్రమాలు కూడా చేసారు. ఈ క్రమంలో ఎందరో ముఖ్యమంత్రులు, ప్రధానులతో కూడా దూరదర్శన్ కార్యక్రమాలను నిర్వహించారు.[4]

పురస్కారాలు[మార్చు]

  • బెస్ట్ అనౌన్సర్ పురస్కరం - అనేక సార్లు.
  • లైఫ్ టైం అఛీవ్‌మెంటు పురస్కారం - సుమారు 10 సార్లు

మూలాలు[మార్చు]

  1. sirakadambam (2015-04-19), Vijaya Darshan 03, retrieved 2017-11-16 CS1 maint: discouraged parameter (link)
  2. "నిన్న‌టి త‌రం యాంక‌ర్.. ఎంద‌రికో ఇన్సిపిరేష‌న్." Namaste (in ఇంగ్లీష్). Retrieved 2017-11-16.
  3. sirakadambam (2015-03-20), Vijaya Darshan 01, retrieved 2017-11-16 CS1 maint: discouraged parameter (link)
  4. Stories, Prajasakti News. "కంటిలో చెమ్మ ఉన్నా న‌వ్వు‌తూనే ప‌ల‌క‌రించా!!". Prajasakti. Retrieved 2017-11-16.

ఇతర లింకులు[మార్చు]

  • sirakadambam (2015-04-19), Vijaya Darshan 03, retrieved 2017-11-16 CS1 maint: discouraged parameter (link)
  • sirakadambam (2015-04-04), Vijaya Darshan 02, retrieved 2017-11-16 CS1 maint: discouraged parameter (link)
  • sirakadambam (2015-03-20), Vijaya Darshan 01, retrieved 2017-11-16 CS1 maint: discouraged parameter (link)