విజయ్ ఆనంద్ రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విజయ్ ఆనంద్ రెడ్డి
జననం1959, అక్టోబరు 20
వృత్తిఅంకాలజిస్ట్
సుపరిచితుడు/
సుపరిచితురాలు
కంటి క్యాన్సర్ చికిత్స
రొమ్ము క్యాన్సర్ చికిత్స
ప్రోటాన్ థెరపీ

డాక్టర్ విజయ్ ఆనంద్ రెడ్డి, తెలంగాణకు చెందిన అంకాలజిస్ట్, క్యాన్సర్ రంగంలో కృషికి ప్రసిద్ధి చెందాడు.[1][2][3] హైదరాబాద్‌లోని అపోలో క్యాన్సర్ హాస్పిటల్‌లో డైరెక్టర్‌గా, సీనియర్ కన్సల్టెంట్ ఆంకాలజిస్ట్‌గా పనిచేస్తున్నాడు.[4][5][6] అసోసియేషన్ ఆఫ్ రేడియేషన్ ఆంకాలజిస్ట్స్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా, ఇండియన్ కాలేజ్ ఆఫ్ రేడియేషన్ ఆంకాలజీకి ఛైర్మన్‌గా కూడా పనిచేశాడు.[7]

జననం, విద్య[మార్చు]

రెడ్డి 1959, అక్టోబరు 20న తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదు నగరంలో జన్మించాడు. 1982లో హైదరాబాదులోని ఉస్మానియా వైద్య కళాశాల నుండి వైద్యవిద్యలో పట్టభద్రుడయ్యాడు. 1992లో అదే కళాశాల మాస్టర్స్ డిగ్రీ పొందాడు. న్యూ ఢిల్లీలోని రేడియేషన్ ఆంకాలజీ నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్‌లో డి.ఎన్.బి. కూడా పొందాడు.

వృత్తిరంగం[మార్చు]

1998 నుండి ఎల్‌వి ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌లో కన్సల్టెంట్ ఓక్యులర్ ఆంకాలజిస్ట్‌గా కూడా పనిచేసిన రెడ్డి, 2002లో హైదరాబాద్‌లోని అపోలో క్యాన్సర్ హాస్పిటల్‌లో డైరెక్టర్ & సీనియర్ కన్సల్టెంట్‌గా నియమితులయ్యాడు.[8][9] 2003లో పేదల కోసం క్యూర్ ఫౌండేషన్‌ను స్థాపించాడు, ఆ సంస్థ ద్వరా ఉత్తమమైన క్యాన్సర్ సంరక్షణను అందిస్తున్నాడు.[10][11]

అమెరికన్ సొసైటీ ఆఫ్ క్లినికల్ ఆంకాలజీ, అమెరికన్ సొసైటీ ఫర్ రేడియేషన్ ఆంకాలజీ, యూరోపియన్ సొసైటీ ఆఫ్ మెడికల్ ఆంకాలజీ, యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్, ఇండియన్ సొసైటీ ఆఫ్ ఆంకాలజీ వంటి అనేక ప్రతిష్టాత్మక కమిటీలలో సభ్యుడిగా పనిచేశాడు.[12] లండన్‌లోని మేయర్‌స్టెయిన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్లినికల్ ఆంకాలజీ క్లినికల్ ఆంకాలజీ ఫెలోషిప్ నుండి అంతర్జాతీయ ఫెలోషిప్‌లను కూడా పొందాడు; నర్గీస్ దత్ మెమోరియల్ క్యాన్సర్ ఫౌండేషన్ ఫెలోషిప్ ఆఫ్ ది న్యూయార్క్ హాస్పిటల్, న్యూయార్క్; ఫిలడెల్ఫియాలోని విల్స్ ఐ హాస్పిటల్, చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో ఓక్యులర్ ఆంకాలజీ ఫెలోషిప్, మెల్‌బోర్న్‌లోని పీటర్ మెక్‌కలమ్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో హెడ్ అండ్ నెక్ ఆంకాలజీ ఫెలోషిప్ లను పొందాడు.[13][14]

సన్మానాలు, విజయాలు[మార్చు]

  • యుఐసిసి, జెనీవా, స్విట్జర్లాండ్ నుండి ఇంటర్నేషనల్ క్యాన్సర్ రీసెర్చ్ టెక్నాలజీ అవార్డు
  • నర్గీస్ దత్ మెమోరియల్ ఫౌండేషన్ అవార్డు[15]
  • 1992లో యుఐసిసి, జెనీవా, స్విట్జర్లాండ్ ద్వారా ఇంటర్నేషనల్ క్యాన్సర్ రీసెర్చ్ టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ అవార్డు[16]
  • 1996లో నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఆంకాలజిస్ట్స్ ఆఫ్ ఇండియా బెస్ట్ సైంటిఫిక్ పేపర్ అవార్డు
  • 1966లో ఇండో-అమెరికన్ క్యాన్సర్ కాంగ్రెస్ నుండి యంగ్ సైంటిస్ట్ అవార్డు
  • 1998లో యుఐసిసి నుండి యుఐసిసి అంతర్జాతీయ క్యాన్సర్ పరిశోధన సాంకేతిక బదిలీ పురస్కారం[17]
  • 2001లో ఎలి లిల్లీ & కంపెనీ, యుఎస్ఏ నుండి 2001 యంగ్ ఇన్వెస్టిగేటర్స్ అవార్డు[18]
  • 2008లో అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆప్తాల్మాలజీ ఉత్తమ పోస్టర్ అవార్డు
  • 2017 ఫిబ్రవరి 28న హైదరాబాద్‌లోని హెచ్ఐసిసిలో టైమ్స్ హెల్త్‌కేర్ అచీవర్స్ అవార్డ్స్ ఫంక్షన్‌లో 'ది లెజెండ్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ ఆంకాలజీ'
  • 2018 జనవరిలో అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆప్తాల్మాలజీ నుండి ఏఓఎస్ అచీవ్‌మెంట్ అవార్డు

మూలాలు[మార్చు]

  1. AuthorTelanganaToday. "Innovations make cancer therapy less traumatic: Dr Vijay Anand Reddy". Telangana Today. Retrieved 2023-07-30.
  2. Mallikarjun, Y. (2013-03-12). "'Cancer patients taken for a ride'". The Hindu. ISSN 0971-751X. Retrieved 2023-07-30.
  3. "Cancer cannot conquer the spirit, says Dr Vijay Anand in book on survivors and their battles". The New Indian Express. Retrieved 2023-07-30.
  4. "Dr. Vijay Anand Reddy, Radiation Oncologist - Apollo Healthcity". Sehat. Retrieved 2023-07-30.
  5. Garari, Kaniza (2018-08-24). "Burnt tobacco not as harmless as advertised". Deccan Chronicle (in ఇంగ్లీష్). Retrieved 2023-07-30.
  6. "Cancer survivors play key role in removal of stigma". The Hans India (in ఇంగ్లీష్). 2017-02-05. Retrieved 2023-07-30.
  7. "100 delegates attend AROI conference". The Hans India (in ఇంగ్లీష్). 2018-02-10. Retrieved 2023-07-30.
  8. "Apollo unveils Tomotherapy to boost precision cancer care". www.businesstoday.in. 10 September 2016. Retrieved 2023-07-30.
  9. AuthorTelanganaToday. "Kavitha launches book on cancer survivors". Telangana Today. Retrieved 2023-07-30.
  10. "Cancer Crusaders Invitation Cup – 2018". The Siasat Daily. 2018-02-05. Retrieved 2023-07-30.
  11. "Celebs to play golf for cancer". The New Indian Express. Retrieved 2023-07-30.
  12. Mallikarjun, Y. (2013-03-12). "'Cancer patients taken for a ride'". The Hindu. ISSN 0971-751X. Retrieved 2023-07-30.
  13. "Dr. Vijay Anand Reddy, Radiation Oncologist - Apollo Healthcity". Sehat. Retrieved 2019-01-22.
  14. "Dr Vijay Anand Reddy - Best Radiation Oncologist - Apollo Hospitals". Retrieved 2019-01-22.[permanent dead link]
  15. "Palkonda Vijay Anand Reddy, M.D., D.N.B., F.U.I.C.C., F.N.D.M profile in India Cancer Research Database". www.incredb.org. Retrieved 2023-07-30.
  16. "Dr Vijay Anand Reddy - Best Radiation Oncologist - Apollo Hospitals". Retrieved 2023-07-30.[permanent dead link]
  17. "CURRICULAM VITAE - Dr. Vijay Anand Reddy". studylib.net (in ఇంగ్లీష్). Retrieved 2023-07-30.
  18. "THE AUTHOR - Dr. Vijay Anand Reddy". studylib.net (in ఇంగ్లీష్). Retrieved 2023-07-30.

బయటి లింకులు[మార్చు]