విజిల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
A party whistle.
A metal pea whistle.
పోలీసు విజిల్ శబ్దం వినాలనుకుంటే ప్లే బటన్ నొక్కండి

విజిల్ లేదా ఏరోడైనమిక్ విజిల్ అనేది వాయు ప్రవాహంతో అధిక ధ్వని చేసే లేదా వ్యక్తి తన పెదవుల మధ్యన ఉంచి తన శ్వాసతో దాని లోకి గాలిని ఊది అధిక ధ్వనిని ఉత్పత్తి చేసే వస్తువు. విజిల్లు చిన్న స్లైడ్ విజిల్ నుంచి పెద్ద బహుళ గొట్టపు చర్చి ఆర్గాన్ వరకు పరిమాణంలో విభిన్నమైనవి ఉన్నాయి. ప్రారంభ మానవులు మొదట కాయలను లేదా కొమ్మలను తొలచి, మలచి శబ్దాన్ని ఉత్పత్తి చేయగల ఈల పరికరములను తయారు చేశారు. చరిత్రపూర్వ ఈజిప్ట్ లో, చిన్న గవ్వలను ఈలలుగా ఉపయోగించారు.[1] అనేక ఈనాటి గాలి వాయిద్యాలు ప్రారంభ ఈలల వారసత్వమే. అధిక యాంత్రిక శక్తి పెరగడంతో, ఈలల యొక్క ఇతర రూపాలను అభివృద్ధి చేశారు. విజిల్ యొక్క ఒక లక్షణం ఏమనగా అది ఒక స్వచ్ఛమైన, లేదా దాదాపుగా స్వచ్ఛమైన స్వరం సృష్టిస్తుంది.

మూలాలు

[మార్చు]
  1. Arroyos, Rafael Pérez (2003). Egypt: Music in the Age of the Pyramids (1st ed.). Madrid: Centro de Estudios Egipcios. p. 28. ISBN 8493279617.
"https://te.wikipedia.org/w/index.php?title=విజిల్&oldid=1903634" నుండి వెలికితీశారు