Jump to content

విజ్జిక

వికీపీడియా నుండి
విజ్జిక
జననంక్రీ.పూ.650
ఇతర పేర్లువిద్య
వృత్తికవయిత్రి
సుపరిచితుడు/
సుపరిచితురాలు
ప్రాచీన కాలం నాటి కవయిత్రి

విజ్జిక (విద్య) సా.శ.పూ.6వ శతాబ్ది నాటి కవయిత్రి. అతి ప్రాచీన కాలం నాటి కవయిత్రిగా చరిత్రలో స్థానం సంపాదించిన వ్యక్తి.[1]

స్థలకాలాలు

[మార్చు]

విజ్జిక సా.శ.పూ.650ల కాలంనాటి వ్యక్తిగా చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి కర్ణాటక రాష్ట్రమున్న ప్రాంతంలో ఆమె నివసించినట్లుగా ఆధారాలు లభిస్తున్నాయి.

రచనలు

[మార్చు]

సా.శ.100 సంవత్సరం కాలం నాటి బౌద్ధ పండితుడైన విద్యాకారుడు చేసిన సంకలనంలో విజ్జిక సాహిత్యంలో కొంతభాగాన్ని జతపరిచాడు. ఇవి తప్ప ఆమె సాహిత్యం నేడు అలభ్యం.

ప్రాచుర్యం

[మార్చు]

సంస్కృత సాహిత్యంలోని మహాకవి కాళిదాసు ప్రతిభ, మేధస్సులతో ఆమెను పోల్చుతూ కొందరు ప్రాచీనులైన పండితులు చేసిన వ్యాఖ్యలు ఆమె ప్రాచుర్యానికి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.

మూలాలు

[మార్చు]
  1. చరిత్రకెక్కని "చిరంజీవులు":కె.లలిత:తెలుగు వెలుగు:మార్చి 2014
"https://te.wikipedia.org/w/index.php?title=విజ్జిక&oldid=3264350" నుండి వెలికితీశారు