విటమిన్ డి



విటమిన్ డి నిర్మాణపరంగా సంబంధం ఉన్న, కొవ్వులో కరిగే సమ్మేళనాల సమూహం. ఇది కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫేట్‌లను పేగులు ఎక్కువగా శోషింపజేయడంతో పాటు అనేక ఇతర జీవసంబంధ విధులకు బాధ్యత వహిస్తుంది.[1][2] మానవులలో, ఈ సమూహంలోని ముఖ్యమైన సమ్మేళనాలు విటమిన్ డి3 (కొలెకాల్సిఫెరాల్), విటమిన్ డి2 (ఎర్గోకాల్సిఫెరాల్).[2][3]
ఇతర పన్నెండు విటమిన్‌ల వలె కాకుండా, విటమిన్ డి కొన్ని సార్లు ప్రత్యేకంగా ఇవ్వాల్సి వస్తుంది. సూర్యరశ్మిలోని అతినీలలోహిత (UVB) కిరణాలకు తగినంత చర్మం బహిర్గతం అయినప్పుడు, చర్మం దిగువ పొరలలో కోలెకాల్సిఫెరాల్ సంశ్లేషణ జరుగుతుంది. చాలా మందికి, ఆహార వనరుల కంటే చర్మ సంశ్లేషణ ఎక్కువగా దోహదపడుతుంది. విటమిన్ డి బలవర్ధకమైన ఆహారం, ఆహార సప్లిమెంట్ల ద్వారా కూడా పొందవచ్చు. అమెరికాలో ఆవు పాలు, మొక్కల ఆధారిత పాల ప్రత్యామ్నాయాలకు విటమిన్ డి3 తో బలవర్థకం చేస్తారు. చాలా అల్పాహార ధాన్యాలకు కూడా అలాగే చేస్తారు. పట్టణ జీవనం, ఆరుబయట ఉన్నప్పుడు కొన్ని సాంస్కృతిక కారణాలతో ధరించే వస్త్రాల వలన, చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం, ఇంకా సహా సురక్షితమైన సూర్యరశ్మి స్థాయిల గురించి ఆందోళనల కారణంగా సన్‌స్క్రీన్ వాడతున్నారు.[2][4]: 362–394 దీనివల్ల సూర్యరశ్మి తగినంతగా లభించకపోవచ్చనే కారణంతో, ప్రభుత్వం విటమిన్ డి ని ఆహార ద్వారా తీసుకోవాలని సిఫారసు చేస్తుంది.
కోలెకాల్సిఫెరాల్ కాలేయంలో కాల్సిఫెడియాల్ (కాల్సిడియాల్ లేదా 25-హైడ్రాక్సీకోలెకాల్సిఫెరాల్ అని కూడా పిలుస్తారు) గా మార్చబడుతుంది. ఎర్గోకాల్సిఫెరాల్ ఎర్కాల్సిడియాల్ (25-హైడ్రాక్సీఎర్గోకాల్సిఫెరాల్) గా మార్చబడుతుంది. ఈ రెండు విటమిన్ డి మెటాబోలైట్‌లు, సమిష్టిగా 25-హైడ్రాక్సీవిటమిన్ డి లేదా 25(OH)D గా సూచించబడతాయి. ఒక వ్యక్తి యొక్క విటమిన్ డి స్థితిని అంచనా వేయడానికి సీరంలో కొలుస్తారు.
1922లో రికెట్స్ ఉన్న పిల్లలలో ఆహార లోపాన్ని గుర్తించే ప్రయత్నం కారణంగా ఈ విటమిన్ కనుగొనబడింది.[5][6] స్టెరాల్స్, విటమిన్‌లతో వాటి సంబంధంపై చేసిన కృషికి అడాల్ఫ్ విండౌస్ 1928లో రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతిని అందుకున్నారు. విటమిన్ డి లోపం వల్ల వచ్చే రికెట్స్, ఆస్టియోమలేసియాను నివారించడానికి లేదా చికిత్స చేయడానికి ప్రస్తుతం కొన్ని దేశాలలో ప్రభుత్వ ఆహార బలవర్థక కార్యక్రమాలు, విటమిన్ డి సప్లిమెంట్‌లను సేవించాలనే సిఫార్సులు చేస్తున్నాయి. విటమిన్ డి లోపం వల్ల అనేక ఇతర ఆరోగ్య లోపాలు కూడా ఉన్నాయి. అయితే, అప్పటికే విటమిన్ డి పుష్కలంగా ఉన్న వ్యక్తులలో విటమిన్ డి సప్లిమెంటేషన్ ఇవ్వడం వల్ల ఆరోగ్య ప్రయోజనం ఉన్నట్లు ఆధారాలు లేవు.
గర్భిణీలు - విటమిన్ డి ఆవశ్యకత
[మార్చు]తమకు పుట్టబోయే పిల్లలు కండలు పెంచాలనుకొనే తల్లులు గర్భవతులుగా ఉన్నప్పుడు విటమిన్ డి పుష్కలంగా తీసుకొంటే పుట్టబోయే పిల్లల కండరాలు శక్తిమంతంగా ఉంటాయట. వారి మజిల్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయని, నాలుగేళ్ల వయసు నుంచే వారి పట్టులో బిగువు ఉంటుందని యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్ పరిశోధకులు తేల్చారు.ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా ఆరు పలకల దేహాలకు ప్రాచుర్యం ఎక్కువవుతున్న నేపథ్యంలో ఈ పరిశోధన ఆసక్తికరంగా మారింది. అబ్బాయిల సిక్స్‌ప్యాక్‌ను తీర్చిదిద్దే శక్తి తల్లులకే ఉందని ఈ పరిశోధన తేల్చింది. కేవలం కండలు పెంచడానికే కాదు, కాబోయే అమ్మలు విటమిన్ డి ఎక్కువగా తీసుకొంటే పిల్లల్లో శారీరక సత్తా పెరిగే అవకాశం ఉంటుందని పరిశోధకులు వివరించారు. చర్మానికి సూర్యకాంతి తగిలినప్పుడు శరీరంలో విటమిన్ డి జనిస్తుంది. చేపలను తినడం ద్వారా కూడా గర్భిణీలు విటమిన్ డి ని వృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా ఎంత అవసరమో అంత తీసుకుంటే పర్వాలేదు. కానీ, కొంతమంది విటమిన్ టాబ్లెట్స్ ఎక్కువ వాడి ప్రాణాల మీదకి Hypervitaminosis D తెచ్చుకుంటున్నారు. ఎంతో ఉపయోగకరమైన.. విటమిన్ D అవసరం మేరకే తీసుకోవాలి. Vitamin D ఎక్కువ తీసుకోవటం వాళ్ళ ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడమే అని BMJ Case Reports లో ప్రచురితమైన తాజా కథనం హెచ్చరిస్తోంది. విటమిన్ D వారానికి ఒకటి మాత్రమే తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.[7][8]
అవలోకనం
[మార్చు]విటమిన్ డి మన శరీరానికి చాలా ముఖ్యం. సూర్యకాంతి నుండి మనుషుల శరీరానికి తగినంత మొత్తంలో విటమిన్ డి లభించినప్పటికీ కొన్నిసార్లు తగిన మొత్తంలో విటమిన్స్ డి శరీరానికి అందక పోవచ్చు. మన శరీరంలో కాల్షియం గ్రహించడంలో సహాయపడి, ఎముకలు, కండరాలు, నరాలను ఆరోగ్యంగా ఉంచడానికి విటమిన్ డి అవసరం. విటమిన్ డి మన కండరాలు, నరాలు, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి కూడా సహాయపడుతుంది.
విటమిన్ డి లోపం ప్రధానంగా ఎముకలు,కండరాలతో సమస్యలను కలిగిస్తుంది. మానవ శరీరంలో ఎముక అభివృద్ధి, నిర్వహణ కోసం ఉపయోగించే ఒక ముఖ్యమైన విటమిన్. విటమిన్ డి నాడీ వ్యవస్థ, కండరాల వ్యవస్థ, రోగనిరోధక వ్యవస్థలో సహాయ పడుతుంది. విటమిన్ డి ముఖ్యమైనది గా వైద్యులు పేర్కొంటారు. శరీరం ఆరోగ్యంగా ఉండటానికి అవసరమైన అనేక విటమిన్లలో విటమిన్ డి ఒకటి. మనిషి లో రక్తం, ఎముకలలో కాల్షియం సమతుల్యతను నిర్వహించడం, ఎముకల నిర్మాణంలో, నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మానవ శరీరం లో ఎముకల నిర్మాణానానికి, ఆరోగ్యకరమైన కణజాలాలకు మద్దతు ఇవ్వడానికి కాల్షియం, భాస్వరం ఉపయోగించగలదు. దీర్ఘకాలిక / లేదా తీవ్రమైన విటమిన్ డి లోపంతో, ప్రేగుల ద్వారా కాల్షియం, భాస్వరం శోషణ తగ్గడం హైపోకాల్సెమియా ( రక్తంలో తక్కువ కాల్షియం స్థాయిలు) కు దారితీస్తుంది. ఫలితంగా సెకండరీ హైపర్పారాథైరాయిడిజానికి దారితీస్తుంది (రక్తంలో కాల్షియం స్థాయిలను సాధారణంగా ఉంచడానికి ప్రయత్నించే అతి చురుకైన పారాథైరాయిడ్ గ్రంథులు). హైపోకాల్సెమియా, హైపర్పారాథైరాయిడిజం రెండూ తీవ్రంగా ఉంటే, కండరాల బలహీనత, తిమ్మిరి, అలసట, నిరాశతో సహా లక్షణాలను మనిషులు కలిగిఉంటారు .
రక్తంలో కాల్షియం స్థాయిలను సమతుల్యం చేయడానికి (ద్వితీయ హైపర్పారాథైరాయిడిజం ద్వారా), శరీరం లో ఎముకల నుండి కాల్షియం తీసుకుంటుంది, తద్వారా వేగవంతమైన ఎముక డీమినరలైజేషన్కు (ఎముక సంస్కరించగలిగే దానికంటే వేగంగా విచ్ఛిన్నమైనప్పుడు) దారితీస్తుంది. పెద్దవారిలో ఆస్టియోమలాసియా (మృదువైన ఎముకలు), పిల్లలలో రికెట్స్కు దారితీస్తుంది. ఆస్టియోమలాసియా, ఎముకల వ్యాధి ఎముక పగుళ్లు వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి. రికెట్స్ ఆస్టియోమలాసియా మాదిరిగానే ఉంటుంది, ఇది పిల్లలను మాత్రమే ప్రభావితం చేస్తుంది. పిల్లల ఎముకలు ఇంకా పెరుగుతున్నందున, డీమినరలైజేషన్ ఎముకలు వంగిపోవడం లేదా వంగిపోవడానికి కారణమవుతుంది.
విటమిన్ డి లోపం ప్రపంచ సమస్య. ప్రపంచవ్యాప్తంగా సుమారు 1 బిలియన్ మందికి విటమిన్ డి లోపం ఉంది, జనాభాలో 50% మందికి విటమిన్ డి లోపం ఉంది. ఆమెరికా దేశంలో సుమారు 35% పెద్దలకు విటమిన్ డి లోపం తో ఉన్నారని పేర్కొంటారు[9].
ప్రయోజనం-లభించే పదార్థాలు
[మార్చు]మనుషుల రోజువారి ఆహారంలో తగినంత విటమిన్ డి ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆరోగ్యకరమైన కణాలను పెంచడానికి, అనారోగ్యాన్ని నివారించడానికి , రోగనిరోధక వ్యవస్థను పెంచటానికి, ఎముకలు బలంగా ఉండటానికి కాల్షియం శోషణలో సహాయపడుతుంది. ముఖ్యంగా పిల్లలలో ఎముకల వ్యాధిని నివారించడంలో తోడ్పడుతుంది. పెద్దలలో బోలు ఎముకల వ్యాధి నుండి రక్షిస్తుంది. మన శరీరంలో ఉండే మొత్తం విటమిన్ డిలో కేవలం 10% ఆహారం ద్వారా మాత్రమే అందుతుంది. విటమిన్ డి లభించే పదార్థాలలో పుట్టగొడుగులు, సముద్రంలో లభించే పదార్థాలలో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. చేపల రకాన్ని బట్టి విటమిన్ డి కంటెంట్ మారుతుంది. అందులో ట్యూనా చేప, మాకేరెల్, రొయ్యలు,సార్డినెస్, అంకోవిస్, వీటన్నింటిలో ఒమేగా -3 ఎక్కువగా ఉంటాయి. కాడ్ లివర్ ఆయిల్ ఒక సప్లిమెంట్. విటమిన్ డి లోపానికి చికిత్స చేయడానికి చాలా సంవత్సరాలుగా ఉపయోగించబడుతోంది. రికెట్స్, సోరియాసిస్ , క్షయవ్యాధి చికిత్సలో దీనిని ఉపయోగిస్తున్నారు. ఈ నూనెలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. గుడ్డు సొనలు (పచ్చసొన విటమిన్ డితో కూడి ప్రధాన భాగం.) ఒక గుడ్డులో దాదాపు 200 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది. అయితే రోజూ తినకూడదు. సోయా పాలు సాధారణ ఆవు పాలతో సమానమైన ప్రోటీన్‌ను కలిగి ఉంటుంది. ఇందులో అధిక విటమిన్ డి, విటమిన్ సి, ఐరన్ ఉన్నాయి[10].
వైద్యుల సలహా, సూచనల మేరకు విటమిన్ డి ని ప్రజలు తగిన మోతాదులో తీసుకంటే, విటమిన్ డి లోపం వల్ల వచ్చే బాధలను కొంత మేరకు నివారణ చేయవచ్చును.
మూలాలు
[మార్చు]- ↑ "Vitamin D". Micronutrient Information Center, Linus Pauling Institute, Oregon State University, Corvallis. 11 February 2021. Archived from the original on 8 April 2015. Retrieved 14 March 2022.
- ↑ 2.0 2.1 2.2 "Vitamin D: Fact Sheet for Health Professionals". Office of Dietary Supplements, US National Institutes of Health. 26 July 2024. Archived from the original on 9 April 2021. Retrieved 20 January 2025.
- ↑ Bikle DD (March 2014). "Vitamin D metabolism, mechanism of action, and clinical applications". Chemistry & Biology. 21 (3): 319–329. doi:10.1016/j.chembiol.2013.12.016. PMC 3968073. PMID 24529992.
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;Ross_2011
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ Wolf G (June 2004). "The discovery of vitamin D: the contribution of Adolf Windaus". The Journal of Nutrition. 134 (6): 1299–302. doi:10.1093/jn/134.6.1299. PMID 15173387.
- ↑ Deluca HF (January 2014). "History of the discovery of vitamin D and its active metabolites". BoneKEy Reports. 3: 479. doi:10.1038/bonekey.2013.213. PMC 3899558. PMID 24466410.
- ↑ http://telugutaruni.weebly.com/23/post/2014/01/17.html
- ↑ Raghavendra (2022-07-13). "అతిగా విటమిన్ D తీసుకుంటే ఏమవుతుంది?". AP GAP (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-07-13.[permanent dead link]
- ↑ "7 Nutritious Foods That Are High in Vitamin D". https://www.healthline.com/. Retrieved 23 July 2024.
{{cite web}}
: External link in
(help)|website=
- ↑ "7 Healthy Foods That Are High in Vitamin D". Healthline (in ఇంగ్లీష్). 2019-12-19. Retrieved 2024-07-23.