విద్యానగర వీరులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విజయనగర వీరులు
కృతికర్త: శిరపు ఆంజనేయులు
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: చరిత్ర
ప్రచురణ:
విడుదల: 1928

విజయనగర సామ్రాజ్యానికి రాజధానియైన విద్యానగరానికి చెందిన ఆనాటి వీరుల గురించి ఈ గ్రంథంలో వివరించారు. ఈ పుస్తకాన్ని శిరపు ఆంజనేయులు రచించారు.[1]

రచన నేపథ్యం[మార్చు]

శిరపు ఆంజనేయులు రచించిన విద్యానగర వీరులు గ్రంథం 1928లో ముద్రితమైంది.[1]

వివరాలు[మార్చు]

13-16 శతాబ్దాల నడుమ నేటి ఆంధ్ర, కర్ణాటక, కొంతవరకూ తమిళనాడులోని ప్రాంతాలను పరిపాలించిన హైందవ సామ్రాజ్యం-విజయనగర సామ్రాజ్యం. ఆ విజయనగర సామ్రాజ్యానికి రాజధాని నేటి కర్ణాటకలోని హంపీ పట్టణం వద్ద నెలకొని వుండేది. అది నేటి లండన్ మహానగరాన్ని కూడా వైశాల్యంలో మించి, వ్యాపార వాణిజ్య వ్యవహారల్లో ప్రపంచంలోని ఎన్నో గొప్ప నగరాలను తలదన్నేలా ఉండేదని పోర్చుగీసు యాత్రికులు వెల్లడించారు. ఆ మహానగరం పేరు విద్యానగరమనీ, విజయనగరమనీ వ్యవహారంలో ఉన్నా విజయనగర సామ్రాజ్య స్థాపన వెనుకనున్న మహనీయుడు, శృంగేరీ పీఠాధిపతి విద్యారణ్య స్వామి పేరుమీదుగా విద్యానగరం అనే పెట్టారు.

విషయాలు[మార్చు]

విద్యానగరానికి చెందిన విజయనగర సామ్రాజ్య వీరుల గురించి ఈ గ్రంథాల్లో రాశారు. మొత్తం రెండు సంపుటాలుగా వెలువడ్ద ఈ రచనల్లో దాదాపుగా 20మంది మహావీరుల జీవన చిత్రాలు ఉన్నాయి. కొందరు అందరికీ సుపరిచితులైన తిమ్మరుసు, కృష్ణరాయలు వంటి వారు కాగా మరికొందరు అంతగా పరిచయం లేని వారు కావడం విశేషం.[1]

బయట లింకులు[మార్చు]

మూలం[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 విద్యానగర వీరులు:శిరపు ఆంజనేయులు:1928 ప్రచురణ