వినియోగదారుల రక్షణ చట్టం - 2019
వినియోగదారుల రక్షణ చట్టం, 2019లో నిబంధనలను ఉల్లంఘించడం తదితర విషయాలను నియంత్రించడానికి
ఒక కేంద్ర వినియోగదారుల రక్షణ ప్రాధికార సంస్థ ( సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ - సి సి పి ఏ ) - 2020లో ఏర్పాటయింది[1]. సాధారణ పౌరులను గాక వినియోగదారులను ప్రత్యేక తరగతిగా గుర్తించి వారి ప్రయోజనాలకు విగాథం కలిగించే లేదా వారిని తప్పుదారి పట్టించే ప్రకటనలు, తదితర అంశాలను నియంత్రించేందుకు ఈ సంస్థ కృషి చేస్తుంది[2]. ప్రపంచీకరణ, అంతర్జాల వేదికలు, ఈ - కామర్స్ విపనులు మొదలైన ఆధునిక యుగంలో వినియోగదారుల రక్షణ కోసం నిబంధనలను మరింత బలోపేతం చేయడానికి 1986 వినియోగదారుల రక్షణ చట్టం స్థానంలో 2019 వినియోగదారుల రక్షణ చట్టాన్ని తెచ్చారు[3]. ఇది ఒక విధంగా అంతర్జాతీయ వేదికలపై లావాదేవీలలో పాల్గొనే వినియోగదారులకు మెరుగైన రక్షణ కల్పిస్తుంది.1986 నాటి నియోగదారుల రక్షణ చట్టంలో అంతర్జాలంలో లేని వస్తువులను లేదా ఇతర ఎలక్ట్రానిక్ మార్గాల ద్వారా కొనుగోలు చేసే లేదా వస్తువులను పొందే వ్యక్తులను కూడా చేర్చడానికి వినియోగదారుల రక్షణ చట్టం 2019లో పరిధిలో చేర్చి ' వినియోగదారు ' నిర్వచనం పరిధిని విస్తృతం చేశారు[4]. వినియోగదారుల రక్షణ చట్టం 2019లో ఏదైనా ఆడియో లేదా దృశ్య ప్రచారం, ఎలక్ట్రానిక్ మీడియా, ఇంటర్నెట్, వెబ్ సైట్ ద్వారా చేసిన ప్రకటనలను కూడా ప్రకటన నిర్వచనంలో చేర్చారు.
తప్పుదారి పట్టించే ప్రకటనల నివారణకు మార్గదర్శకాలను 2022 జూన్ 9వ తేదీన విడుదల చేశారు. తప్పుదోవ పట్టించే ప్రకటనల కోసం ఆమోదాలు, అటువంటి ప్రకటనల ద్వారా దోపిడీకి గురిగావడానికి లేదా ప్రభావితమయ్య వినియోగదారులను రక్షించే లక్ష్యంతో ప్రకటన జారీ చేశారు.
మూలాలు :
- ↑ Nipuna. "వినియోగదారుల హక్కుల చట్టం-2019". Retrieved 2023-09-16.
- ↑ "జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం: ఆన్‌లైన్‌లో వస్తువులు కొని మోసపోతే ఎవరికి ఫిర్యాదు చేయాలి?". BBC News తెలుగు. 2022-12-24. Retrieved 2023-09-16.
- ↑ Saichand, Rekulapally. "Consumer Protection: వినియోగదారుల హక్కుల రక్షణ చట్టం గురించి ఈ విషయాలు తెలుసా!". Hindustantimes Telugu. Retrieved 2023-09-16.
- ↑ "వినియోగదారులకు ప్రత్యేక రక్షణ చట్టం". Prajasakti (in ఇంగ్లీష్). Retrieved 2023-09-16.[permanent dead link]