వినీతా బాలి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వినీతా బాలి
వినీతా బాలి ,బ్రిటానియా ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరక్టర్ & CEO
జననం1955 నవంబరు 11
జాతీయతభారతీయులు
విద్యాసంస్థఢిల్లీ విశ్వవిద్యాలయం
JBIMS (MBA)
మిచిగన్ విశ్వవిద్యాలయం
వృత్తిబ్రిటానియా ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరక్టరు.
క్రియాశీల సంవత్సరాలు1980-ఇప్పటి వరకూ

వినీతా బాలి భారతీయ వ్యాపారవేత్త. ఆమె బ్రిటానియా ఇండస్ట్రీస్ లిమిటెడ్ కు మానేజింగ్ డైరెక్టరుగా పనిచేస్తోంది.[1]

విద్య

[మార్చు]

1975 లో ఆమె ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని లేడీ శ్రీ రాం కాలేజ్ ఫర్ ఉమెన్ నుండి బ్యాచిలర్స్ డిగ్రీని పొందింది. జమ్నాలాల్ బజాజ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్ స్టడీస్ లో ఎం.బి.ఎ డిగ్రీని సాధించింది. ఆమె మిచిగన్ విశ్వవిద్యాలయం నుండి స్కాలర్‌షిప్ పొందారు, ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో పనిచేసింది.[2]

కెరీర్

[మార్చు]

వినీత ఉద్యోగ జీవితం వోల్టాస్‌లో రస్నా పానీయం ఆవిష్కరణతో మొదలైంది. క్యాడ్‌బరీ భారత విభాగంలో చేరి 14 సంవత్సరాలు పనిచేసింది. ఈ సమయంలో కంపెనీ వ్యాపారాన్ని భారత్‌లోను, ఆఫ్రికాలోనూ అభివృద్ధి చేసింది. 1994 లో కోకా కోలా కంపెనీలో మార్కెటింగ్ డైరెక్టరుగా చేరి తరువాతి కాలంలో మార్కెటింగు వైస్ ప్రెసిడెంటుగా లాటిన్ అమెరికా బాధ్యతలు స్వీకరించింది. అక్కడ పనిచేసిన తొమ్మిదేళ్ళలో కార్పొరేట్ స్ట్రాటజీ విభాగానికి వైస్ ప్రెసిడెంటుగా కూడా వ్యవహరించింది.[3][4] 2003 లో కోకా కోలా ను వదిలి జైమన్ గ్రూపులో చేరింది. అట్లాంటాలో వ్యాపార వ్యూహ విభాగానికి అధిపతిగా పనిచేసింది.[2] 2005 ఆ ఉద్యోగం వదిలి భారత్‌లో బ్రిటానియా ఇండస్ట్రీస్‌లో ముఖ్య కార్యనిర్వహణాధికారిగా చేరింది. 2006 లో మేనేజింగ్ డైరెక్టరుగా నియమితురాలైంది. ఆమె సారథ్యంలో బ్రిటానియా వ్యాపారం మూడు రెట్లై, $841 మిలియన్లకు చేరింది.[5]

2009 ఎకనామిక్ టైమ్స్ పురస్కారాల్లో వినీతకు బిసినెస్ విమన్ ఆఫ్ ది ఇయర్ పురస్కాఅరం లభించింది.[6] 2009 లో ఆమె బ్రిటానియా న్యూట్రిషన్ ఫౌండేషన్ స్థాపించింది. భారతీయ పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు బలవర్ధకమైన బిస్కట్ల పంపిణీని చేపట్టింది. ఈ సంస్థ ద్వారా ఆమె చేపట్టిన ఈ కార్యక్రమానికి వినీత కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పురస్కారం అందుకుంది.[7] 2011 లో ఫోర్బ్స్ పత్రిక ప్రకటించిన "50 మంది శక్తిమంతులైన ఆసియా మహిళా వ్యాపారవేత్తల" జాబితాలో చోటు పొందింది.[5]

గ్రేట్ లేక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్ వద్ద డా. బాలా తో వినీతా బాలి

మూలాలు

[మార్చు]
  1. Karmali, Naazneen (31 January 2012). "Britannia's Tough Cookie". Forbes.com. Retrieved 10 March 2013.
  2. 2.0 2.1 "Management Team: Vinita Bali". Britannia Industries. Archived from the original on 26 డిసెంబరు 2018. Retrieved 6 March 2012.
  3. "Vinita Bali". Businessweek.
  4. "Meet Vinita Bali, Britannia CEO". Rediff.com Money. 8 November 2004.
  5. 5.0 5.1 "Asia's 50 Power Businesswomen: Karen Agustiawan". Forbes. March 2012. Retrieved 6 March 2012.
  6. "ET Awards 2009 winners" Economic Times, 25 August 2009.
  7. "Britannia Industries get CSR Award". The Hindu. 12 December 2010. Retrieved 6 March 2012.

ఇతర లింకులు

[మార్చు]