విప్లవం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

విప్లవం ("తిరగడం" అనే అర్ధం గల లాటిన్ పదం revolutio నుండి వచ్చినది) అనేది అధికారంలో లేక సంస్థాగత నిర్మాణాలలో కొద్ది సమయములోనే ఏర్పడే మౌలిక మార్పు . కోపర్నికస్ ' యొక్క ప్రసిద్ధ De Revolutionibus Orbium Coelestium అని చుట్టూ తిరగడం అనే అర్ధం గల వైజ్ఞానిక పదాలు వాడే కాలము నుండే ఈ పదం రాజకీయ మార్పులను సూచించడానికి వాడబడుతుంది.[1][a] అరిస్టాటిల్ రెండు రకాల రాజకీయ విప్లవాలను వివరించాడు.

 1. ఒక రాజ్యాంగం నుండి మరొకటికి పూర్తిగా మారడం
 2. ప్రస్తుత రాజ్యాంగాన్ని సవరించడం.[2]

మానవ చరిత్రలో విప్లవాలు చోటు చేసుకున్నాయి. పద్ధతులు, వ్యవధి మరియు ప్రేరేపించే సిద్ధాంతం అనే అంశాలలో వీటి మధ్య చాలా తేడాలు ఉన్నాయి. వీటి ఫలితంగా సంస్కృతి, ఆర్థిక వ్యవస్థ, మరియు సామాజిక-రాజకీయ సంస్థలలో పెను మార్పులు జరిగాయి.

ఏది విప్లవం ఏది విప్లవం కాదనే విషయములో మేధావుల మధ్య జరిగే వివాదాలు పలు అంశాలను పరిగణనలోకి తీసుకుంటాయి. విప్లవాల పై జరిగిన ప్రారంభ అధ్యయనాలు ఐరోపా చరిత్రలో జరిగిన ఘటనలను ఒక మానసిక కోణం లోనే విశ్లేషించాయి. కాని ఆధునిక అధ్యయనాలు ప్రపంచవ్యాప్త ఘటనలను సాంఘిక శాస్రం, రాజకీయ శాస్త్రం వంటి సామాజిక శాస్త్రాల కోణాలలో విశ్లేషించాయి. విప్లవాల పై పలు తరాలకు చెందిన పండితుల యొక్క ఆలోచనల వలన పలు విభిన్నమైన సిద్ధాంతాల ఉత్పన్నమయి, ఈ సంక్లిష్ట ప్రక్రియ పై ప్రస్తుతం ఉన్న అవగాహనకు తోడ్పడ్డాయి.

పద చరిత్ర[మార్చు]

సూర్యుడు చుట్టూ గ్రహాల యొక్క కదిలికల గురించి కోపర్నికస్ తాను వ్రాసిన 1543 గ్రంథానికి De revolutionibus orbium coelestium (ఆన్ ది రివల్యూషన్స్ అఫ్ సెలెస్టియల్ బాడీస్ ) అని పేరు పెట్టాడు. "రివల్యూషన్" అనే పదం తరువాత ఖగోళశాస్త్రం నుండి జ్యోతిష శాస్త్రానికి వ్యాపించి, సామాజిక క్రమంలో ఏర్పడే ఆకస్మిక మార్పును సూచించడానికి వాడబడింది. 1688లో యువ యునైటెడ్ కింగ్డంలో జేమ్స్ II స్థానే విల్లియం III రావడాన్ని వివరిస్తూ, ఈ పదం మొట్ట మొదటి సారిగా రాజకీయాలలో వాడబడింది. ఈ ప్రక్రియ "ది గ్లోరియస్ రివల్యూషన్ (గొప్ప విప్లవం)"గా పిలువబడింది.[3][unreliable source?]

రాజాకీయ మరియు సామాజిక-ఆర్ధిక విప్లవాలు[మార్చు]

ఫ్రెంచ్ విప్లవం సమయంలో 1789 జూలై 14న, బస్టిల్ ను ముట్టటించడం
జార్జ్ వాషింగ్టన్, అమెరికన్ విప్లవం యొక్క నాయకుడు
వ్లాడిమిర్ లెనిన్, 1917 నాటి బోల్షెవిక్ విప్లవం యొక్క నాయకుడు
సన్ యట్ -సేన్, 1911 నాటి చైనేసే జిన్ హాయ్ విప్లవం యొక్క నాయకుడు

అనేక సార్లు, 'రివల్యూషన్' అనే పదం సామాజిక -రాజకీయ వ్యవస్థలలో ఏర్పడే ఒక మార్పును సూచించడానికి వాడబడుతుంది.[4][5][6] జెఫ్ గుడ్విన్ విప్లవానికి రెండు నిర్వచనాలు ఇస్తున్నాడు. ఒక విశాలమైన అర్ధంలో, విప్లవం అనగా

"any and all instances in which a state or a political regime is overthrown and thereby transformed by a popular movement in an irregular, extraconstitutional and/or violent fashion"

మరియు సంకుచితమైన అర్ధంలో, అది

"revolutions entail not only mass mobilization and regime change, but also more or less rapid and fundamental social, economic and/or cultural change, during or soon after the struggle for state power."[7]

జాక్ గోల్డ్ స్టోన్ ఈ విధముగా నిర్వచనం ఇస్తున్నాడు

"an effort to transform the political institutions and the justifications for political authority in society, accompanied by formal or informal mass mobilization and noninstitutionalized actions that undermine authorities."[8]

రాజకీయ మరియు సామాజిక-ఆర్ధిక విప్లవాలు పలు సామాజిక శాస్తాలలో, ముఖ్యంగా సామాజిక శాస్త్రం, రాజకీయ శాస్త్రాలు మరియు చరిత్రలో అధ్యయనం చేయబడ్డాయి. ఆ రంగంలో ప్రముఖ పండితులలో కొందరు: క్రేన్ బ్రిన్టన్, చార్లెస్ బ్రోకేట్, ఫారిడే ఫర్హి, జాన్ ఫారన్, జాన్ మేసన్ హర్ట్, సామ్వేల్ హంటింగ్టన్, జాక్ గోల్డ్ స్టోన్, జెఫ్ గుడ్విన్, టెడ్ రాబర్ట్స్ గుర్, ఫ్రెడ్ హాలిడే, చాల్మేర్స్ జాన్సన్, టిం మెక్ డేనియల్, బారింగ్టన్ మూర్, జెఫేరీ పైజె, విల్ఫ్రెడో పారేటొ, టేరెంస్ రెంజేర్, యూగెన్ రోసేన్స్టాక్ -హస్సీ, తీడా స్కోక్పోల్, జేమ్స్ స్కాట్, ఎరిక్ సెల్బిన్, చార్లెస్ టిల్లీ, ఎల్లెన్ కే ట్రింబ్రిన్గేర్, కార్లోస్ విస్టాస్, జాన్ వాల్టన్[-అయోమయ నివృత్తి పేజీకి వెళ్తున్న ఈ లింకును సవరించాలి-], టిమోతీ వికాం -క్రౌలె మరియు ఎరిక్ వోల్ఫ్.[9]

విప్లవాలపై అధ్యయనం చేసిన జాక్ గోల్డ్‌స్టోన్ వంటి మేధావులు విప్లవాలపై ప్రస్తుతం జరుగుతున్న ఈ తరం పరిశోధనను నాలుగు విధాలుగా విభజిస్తారు.[8] గుస్టవే లే బాన్, చార్లెస్ ఎ. ఎల్వుడ్, పిటిరిం సోరోకిన్ వంటి మొదటి తరం పండితులు తమ వైఖరిలో ప్రధానంగా వివరణాత్మకంగా ఉన్నారు మరియు విప్లవాల గురించిన వారి వివరణలు సాధారణంగా సాంఘిక మనస్తత్వ శాస్త్రానికి సంబంధించినట్లుగానే ఉండేవి. ఉదాహరణకు, లీ బాన్ యొక్క గుంపు యొక్క మనస్తత్వం.[4]

రెండవ తరం సిద్ధాంతవాదులు విప్లవాలు ఎందుకు, ఎప్పుడు ఉత్పన్నమవుతాయి అని వివరించే సవిస్తరమైన సిద్ధాంతాలను అభివృద్ధి చేశారు. ఇవి మరింత సంక్లిష్టమైన సామాజిక ప్రవర్తన సిద్ధాంతాల పై ఆధారపడి ఉన్నాయి. అవి మూడు ప్రధాన పద్ధతులుగా విభజించబడ్డాయి: మనస్తత్వం, సాంఘికం మారియు రాజకీయం.[4]

టెడ్ రాబర్ట్ గుర్, ఇవో కే. ఫీర్ బ్రాండ్, రోసలిండ్ ఎల్. ఫీర్ బ్రాండ్, జేమ్స్ ఎ. గేస్చ్ వెన్డెర్, డేవిడ్ సి. ష్వార్ట్జ్ మరియు డెంటన్ ఈ. మొరిసన్ లాంటి వారి అధ్యయనాలు మొదటి కోవలోకి వస్తాయి. కాగ్నిటివ్ సైకాలజీ, ఆశాభంగం-దూకుడుతనం సిద్ధాంతం వంటి సిద్ధాంతాలను వారు అనుసరించి, విప్లవానికి కారణం మంది యొక్క మానసిక స్థితి అని చెప్పారు. విప్లవానికి కచ్చితమైన కారణం ఏది అనే అంశం (ఉదా: ఆధునీకరణ, మాంద్యం లేక విపక్ష) పై వారి వైకరిలో తేడాలు ఉన్నాయి. కాని విప్లవానికి ముఖ్య కారణం, సామాజిక-రాజకీయ పరిస్థితి పై విస్తృత ఆశాభంగం అనే విషయాన్ని అందరూ అంగీకరించారు.[4]

రెండవ కోవకు చెందిన వారైన చాల్మేర్స్ జాన్సన్, నీల్ స్మేల్సేర్, బాబ్ జేస్సోప్, మార్క్ హార్ట్, ఎడ్వర్డ్ ఎ. టిర్యకియాన్ మరియు మార్క్ హగోపియన్ సాంఘిక శాస్త్రం లోని స్ట్రక్చరల్-ఫంక్షనలిస్ట్ సిద్ధాంతాన్ని అనుసరించి టాల్కోట్ పార్సన్స్ అడుగుజాడలలో నడిచారు; వారు వివిధ రాకాల వనరులు, అవసరాలు మరియు ఉపవ్యవస్థలు (రాజకీయ, సాంస్కృతిక వంటివి) యొక్క సమతుల్యతలో ఉన్నట్లు సమాజాన్ని చూశారు. మనస్తత్వ శాస్త్రంలో మాదిరిగానే, వీరు కూడా అసమతుల్యతకు ఏది కారణమనే నిర్వచనాలలో వారు భేదాభిప్రాయం కలిగి ఉన్నారు. అయితే, అసమతుల్యత తీవ్రంగా ఉన్న ఒక పరిస్థితి వలెనే విప్లవాలు ఏర్పడుతాయని అందరూ అంగీకరించారు.[4]

చివరిగా చార్లెస్ టిల్లీ, సామ్వేల్ పి. హంటింగ్టన్, పేటర్ అమ్మన్ మరియు ఆర్థర్ ఎల్. స్తిన్చ్కొంబ్ వంటి రచయితులు మూడవ కోవకు చెందినవారు. వీరు రాజకీయ శాస్త్రాల బాటను అనసరించి సమష్టివాద సిద్ధాంతం మరియు ఆసక్తిగలవారి మధ్య ఘర్షణలు అనే సిద్ధాంతాలను పరిగణనలో తీసుకున్నారు. పోటీ పడుతున్న వివిధ ఆసక్తి గల బృందాల మధ్య అధికారం కొరకు నెలకొన్న ఘర్షణలో ఫలితాలకు కారణమని ఈ సిద్ధాంతాలు భావిస్తున్నాయి. ఇటువంటి పద్ధతిలో, ఒక రాజకీయ వ్యవస్థలో సాంప్రదాయకమైన నిర్ణయాలు తీసుకునే ప్రక్రియతో రాజీ పడలేని రెండు లేదా అంతకంటే ఎక్కువ బృందాల వలనే విప్లవాలు ఏర్పడతాయి. అదే సమయములో తమ లక్ష్యాలను నెరవేర్చుకొనడానికి బలప్రయోగం చేయడానికి అవసరమైన వనరులు కూడా ఆ బృందాలకు ఉంటాయి.[4]

రెండవ తరం సిద్ధాంతవాదులు విప్లవం ఏర్పడడాన్ని రెండు- అంచల ప్రక్రియ లాగా చూశారు; మొదటిది, గతానికంటే భిన్నంగా ఉండే విధముగా ప్రస్తుత పరిస్థితిని కలగచేసే కొన్ని మార్పులు; రెండవది, కొత్త పరిస్థితి ఒక విప్లవం జరగడానికి కావలసిన అవకాశాన్ని సృష్టిస్తుంది. అటువంటి పరిస్థితిలో, గతములో విప్లవాన్ని ఉత్పన్నం చేయడానికి సరిపోని ఒక కారణం (ఉదా: యుద్ధం, కలహము, కరువు, పంట నష్టం వంటివి) ఇప్పుడు సరిపోవచ్చు- కాని ఈ ప్రమాదం గురించి తెలిస్తే, అధికారములో ఉన్న వారు (సంస్కరణ లేదా అణగదొక్కడం ద్వారా) అది జరగకుండా నివారించవచ్చు.[8]

ప్రారంభంలో విప్లవాల పై జరిగిన ఇటువంటి అనేక అధ్యయనాలలో, నాలుగు సంప్రదాయక విప్లవాల పై కేంద్రీకరించాయి - ప్రసిద్ధ మరియు వివాదాస్పదం కాని ఉదాహారణలు. ఇవి విప్లవాల యొక్క అన్ని నిర్వచనాలకు సరిపోతాయి. అవి గొప్ప (గ్లోరియస్) విప్లవం (1688), ఫ్రెంచ్ విప్లవం (1789–1799), 1917 నాటి రష్యన్ విప్లవం మరియు చైనీస్ విప్లవం (1927–1949).[8] ప్రసిద్ధమైన తన "ది అనాటమీ ఆఫ్ రివల్యూషన్"లో ప్రసిద్ధ హార్వర్డ్ చరిత్రకారుడు క్రేన్ బ్రిన్టన్ ఇంగ్లీష్ సివిల్ యుద్ధం, అమెరికన్ విప్లవం, ఫ్రెంచ్ విప్లవం మరియు రష్యన్ విప్లవం[10] పైనే దృష్టి కేంద్రీకరించాడు.[10]

కాలక్రమేణా, పండితులు వందలాది ఇతర సంఘటనలను (విప్లవాలు మరియు తిరుగుబాటు జాబితా చూడండి) కూడా విప్లవాలుగా పరిశీలించడం ప్రారంభించారు. నిర్వచనాలు మరియు వైఖరులలో తేడాల వలన కొత్త నిర్వచనాలు మరియు వివరణలు ఉత్పన్నమయ్యాయి. రెండవ తరం సిద్ధాంతాలు పరిమితమైన భూగోళ ఆస్కారం కలిగినవని, సంఖ్యాపరంగా రుజువు చేయడానికి వీలులేకుండా ఉన్నాయని విమర్శించబడ్డాయి. అంతే కాక, అవి కొన్ని ప్రత్యేక విప్లవాలను వివరిస్తున్నాయి కాని అదే పరిస్థితులు ఉన్నఇతర సమాజాలలో ఎందుకు విప్లవాలు జరగడం లేదని చెప్పలేకపోయాయి.[8]

రెండవ తరం సిద్ధాంతాలు విమర్శలకు గురవ్వడంతో, మూడవ తరం సిద్ధాంతాలు వెలుగు చూశాయి. తేడా స్కోక్పోల్, బారింగ్టన్ మూర్, జెఫ్రీ పైగే వంటి రచయితులు పాత మార్క్సిస్ట్ వర్గ పోరాట విధానాన్నివిస్తరించి గ్రామప్రాంత రైతులు -ప్రభుత్వ ఘర్షణలు, ప్రభుత్వానికీ, స్వయంప్రాతిపత్యం కలిగిన ఉన్నత వర్గానికి మధ్య ఘర్షణలు, దేశీయ రాజకీయ మార్పు పై రాష్ట్రాల మధ్య నెలకున్న ఆర్ధిక మరియు సైన్య వ్యవహారాలలో పోటీ యొక్క ప్రభావం వంటి అంశాల పై వారు దృష్టి సారించారు. ముఖ్యంగా స్కోక్పోల్ యొక్క స్టేట్స్ అండ్ సోషల్ రివల్యూషన్స్ (రాష్ట్రాలు మరియు సామాజిక విఉప్లవాలు) అనే వ్యాసం మూడవ తరానికి చెందిన ప్రసిద్ధ రచనలలో ఒకటిగా గుర్తించబడింది; స్కోక్పోల్ విప్లవానికి ఈ విధంగా నిర్వచనం ఇచ్చాడు - "సమాజం యొక్క ప్రభుత్వ మరియు వర్గ వ్యవస్థలలో త్వరతగతిలో జరిగే మౌలిక మార్పులు.... క్రింద స్థాయి నుండి వర్గ-ఆధారిత తిరుగుబాట్లు కూడా కొన్ని సార్లు ఉంటాయి". రాష్ట్రం, ఉన్నత వర్గం, మరియు క్రింద స్థాయి వర్గాలు మధ్య జరిగే అనేక ఘర్షణలు కూడా విప్లవానికి దారి తీస్తాయి.[8]

1989లో జరిగిన బెర్లిన్ వాల్ ను పడగొట్టడం మరియు ఐరోపాలోని ఆటం ఆఫ్ నేషన్స్ యొక్క సంఘటనలు హటాత్తుగాను శాంతివంతంగానూ జరిగాయి.

1980ల చివరి నుండి కొందరు కొత్త పండితులు మూడవ తరం సిద్ధాంతాలను ప్రశ్నించడం ప్రారంభించారు. కొత్త విప్లవాత్మక సంఘటనలు ఈ పాత సిద్దంతాలకు పెద్ద దెబ్బ కొట్టాయి. ఆ సంఘటనలను పాత సిద్ధాంతాలకు సరైన వివరణ ఇవ్వలేకపోయాయి. 1979 నాటి ఇరానియన్ మరియు నికరాగ్వున్ విప్లవాలు, ఫిలిపైన్స్లో జరిగిన 1986 నాటి ప్రజా శక్తి విప్లవం మరియు ఐరోపాలో జరిగిన 1989 నాటి ఆటం ఆఫ్ నేషన్స్ - ఈ విప్లవాలలో ప్రజా ప్రదర్శనలు, మూకుమ్మడి సమ్మెలు వంటి అహింసా విప్లవాలు ద్వారా బహుళ-వర్గ సంకీర్ణాలు శక్తివంతమైన పాలకులను జయించాయి.

ఇరోపాలని హింసాత్మక ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య జరిగే వర్గ పోరాటాలను విప్లవాలకు నిర్వచనంగా చెప్పుకోవడం ఇక మీద సరిపోలేదు. ఈ విధముగా విప్లవాల పై జరిగిన అధ్యయనాలు మూడు దిశలలో జరిగాయి. మొదటిది, కొందరు పరిశోధకులు పూర్వం వాడిన లేదా సవరించబడిన స్ట్రక్చురలిస్ట్ సిద్ధాంతాలను అంతకు ముందు విశ్లేషించబడిన ఐరోపా ఘర్షణలకు కాకుండా ఇతర సంఘటనలకు కూడా వర్తింపచేశారు. రెండవది, విప్లవాలకు చైతన్యవంతులైన ప్రజలను మొహరించడం మరియు లక్ష్యాలను ఛేదించడం కొరకు సిద్ధాంతం మరియు సంస్కృతి లను మార్పుకు కారణమయ్యే ఏజన్సీ అనే విషయానికి పండితులు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. మూడవది, విప్లవాలు మరియు సామాజిక ఉద్యమాలు - ఈ రెండిటికి మధ్య చాలా అంశాలు ఒకే మాదిరిగా ఉన్నాయని వాటి విశ్లేషకులు గుర్తించారు. వివాదాస్పద రాజకీయం అనే ఒక కొత్త "నాలుగవ తరం" సాహిత్యం అభివృద్ధి చేయబడింది. ఇది సామాజిక ఉద్యమాలు మరియు విప్లవాలు, ఈ రెండిటిని అర్ధం చేసుకునేందుకు వాటి మధ్య ఉన్న అంశాలను కలపడానికి ప్రయత్నించింది.[8]

కమ్యూనిస్ట్ పాలనలను జయించిన కొంత వరకు శాంతియుతమైన విప్లవాల నుంచి ఆఫ్ఘనిస్తాన్ లో జరిగిన హింసాత్మక ఇస్లామిక్ విప్లవం వరకు అన్ని సంఘటనలను విప్లవాల క్రింద పరిగణించడం జరుగుతుంది. కాని ఇవి విప్లవాల క్రిందకు రావు: సంస్థాగత మార్పులను ఉత్పన్నం చేయని లేదా అధికారానికి సరైన కారణం చూపలేని (జోజేఫ్ పిసుడ్స్కి యొక్క 1926 నాటి మేకూ లేదా అమెరికా అంతర్గత యుద్ధం వంటి) coups d'états (సైన్య తిరుగుబాటులు), అంతర్గత యుద్ధాలు, తిరుగుబాటులు మరియు ఫ్రాన్సిస్కో ఫ్రాంకో మరణాంతరం స్పెయిన్లో జరిగినట్లు ప్రజాభిప్రాయం మరియు స్వచ్ఛంద ఎన్నికల వంటి సంస్థాగత ఏర్పాట్ల ద్వారా ప్రజాస్వామ్యానికి శాంతియుతంగా జరిగిన మార్పులు.[8]

రకాలు[మార్చు]

మాడ్రిడ్ లో ఒక వాట్ స్టీం ఇంజిన్ ఆవిరి ఇంజిన్ యొక్క అభివృద్ధి బ్రిటిన్ లోను ప్రపంచం లోను పారిశ్రామిక విప్లవానికి దారి తీసింది.బొగ్గు ఘనులనుండి నీటిని తీసివేయడానికి ఆవిరి ఇంజిన్ సృష్టించబడింది. దీని మూలానా నేలమట్టం స్థాయిలకంటే లోతుగా తవ్వడానికి వీలు కలిగింది.

సామాజిక శాస్త్రంలో మరియు సాహిత్యంలో వివిధ రకాల విప్లవాలు అనేకం ఉన్నాయి. ఉదాహరణకు, అలెక్సిస్ డీ టోకె విల్లె అనే సాంప్రదాయక పండితుడు 1) రాజకీయ విప్లవాలకు 2) కొత్త రాజకీయ వ్యవస్థను ఏర్పరచడమే కాకుండా మొత్తం సమాజాన్ని మార్చే హటాత్తుగా జరిగే హింసతో కూడిన విప్లవాలకు 3) అనేక తరాల సమయం పట్టే నెమ్మదిగా జరిగే మొత్తం సమాజంలో పెనుమార్పు తెచ్చే విప్లవాలు (ఉదా.మతం) - ఈ మూడింటినీ అతను విభజించాడు.[11] వివిధ రకాల మార్క్సిస్ట్ వర్గీకరణలలో ఒకటి, విప్లవాలను ఈ విధముగా విభజిస్తుంది: ప్రీ-క్యాపిటలిస్ట్, ప్రారంభ బోర్గియాస్ కాలం, బోర్గియాస్ కాలం, బోర్గియాస్-ప్రజాస్వాంయం కాలం, ప్రారంభ ప్రోలిటేరియాన్ కాలం మరియు సోషలిస్టిక్ విప్లవాలు.[12]

చార్లెస్ టిల్లీ అనే విప్లవాల పై అధ్యయనం చేసే ఒక ఆధనిక పండితుడుకూ (సైన్య తిరుగుబాటు), పై స్థాయి నుండి అధికారాన్ని కైవసం చేసుకునే ప్రక్రియ, అంతర్గత యుద్ధం, తిరుగుబాటు మరియు ఒక "గొప్ప విప్లవం" ( 1789 నాటి ఫ్రెంచ్ విప్లవం, 1917 నాటి రష్యా విప్లవం, లేదా ఇరాన్ లో జరిగిన ఇస్లామిక్ విప్లవం వంటి ఆర్థిక మరియు సామాజిక వ్యవస్థలు మరియు రాజకీయ వ్యవస్థలను పూర్తిగా మార్చి వేసే విప్లవాలు) - ఇవి వేరు వేరని చెప్పాడు.[13][14]

ఇతర వర్గీకరణలు కొరకు సృష్టించబడిన ఇతర విప్లవాల రకాలలో ఇవి కూడా ఉన్నాయి: సామాజిక విప్లవాలు; ప్రోలిటేరియన్ లేదా కమ్యూనిస్ట్ విప్లవాలు (ధనస్వామ్యం స్థానే సామ్యవాదాన్ని నెలకొల్పాలనే ఉద్దేశంతో మార్సిజం యొక్క ఆదర్శాల నుండి ప్రేరణ పొందిన విప్లవాలు); విఫలమైన లేదా ఫలించని విప్లవాలు (తాత్కాలిక విజయానంతరం లేక పెద్ద స్థాయిలో మొహరింపు అనంతరం అధికారాన్ని చేపట్టలేకపోయిన విప్లవాలు) లేదా హింసాత్మక vs ఆహింసాత్మక విప్లవాలు .

రాజకీయ పరిధిని దాటి ఇతర రంగాలలో జరిగే పెను మార్పులకు కూడా "విప్లవం" అనే పదం వాడబడింది. ఇటువంటి విప్లవాలు రాజకీయ వ్యవస్థలో కంటే ఎక్కువగా సాధారణముగా సమాజం, సంస్కృతి, తత్వం మరియు సాంకేతిక రంగం వంటి రంగాలలో జరుగుతాయి. వీటిని సామాజిక విప్లవాలుగా పిలుస్తారు.[15] కొన్ని ప్రపంచవ్యాప్తంగా ఉండవచ్చు, మరికొన్ని ఒక దేశానికి మాత్రమే పరిమితం కావచ్చు. విప్లవం అనే పదం ఇటువంటి నేపథ్యంలో వాడబడడానికి ఒక గొప్ప ఉదాహరణ, పారిశ్రామిక విప్లవం (టొక్కువిల్లె ప్రకారం, ఇటువంటి విప్లవాలు "నెమ్మదిగా జరిగే విప్లవం" అనే నిర్వచనానికి కూడా సరిపోతుంది).[16]

విప్లవాల జాబితా[మార్చు]

విప్లవాల జాబితా కొరకు చూడండి:

 • కల్పనాత్మక విప్లవాలు మరియు సైన్య తిరుగుబాటుల జాబితా
 • తిరుగుబాట్లు మరియు విప్లవాల జాబితా

వీటిని కూడా చూడండి[మార్చు]

 • తిరుగుబాటు
 • విప్లవానికి హక్కు
 • రాజకీయ సంరక్షణ
 • విప్లవ కెరటం

గమనికలు[మార్చు]

a ^ "వ్యవాహారాలలో హటాత్తుగా పెనుమార్పు" జరిగినట్టు ఒక సాధారణ భావన 15వ శతాబ్దం మధ్యలో నెలకొంది మరియు సుమారు 1600 లో మొదటి సారిగా రాజకీయ అర్ధం ఇవ్వబడింది. 1688 నాటి గ్లోరియస్ రివల్యూషన్ (గొప్ప విప్లవం) అనే పదం సామాన్య ఉపయోగములో ఉంది. ఆక్స్‌ఫోర్డ్ ఆంగ్ల నిఘంటువులో 'రివల్యూషన్'ను చూడండి .

సూచనలు[మార్చు]

 1. రెప్చెక్, జాక్ (2007) కోపర్నికస్ సీక్రాట్: హౌ ది సైంటిఫిక్ రివల్యూషన్ బెగేన్ సైమన్ షస్టర్, న్యూ యార్క్, ISBN 978-0-7432-8951-1
 2. అరిస్టాటిల్, ది పోలిటిక్స్ V, tr. టి.ఎ. సింక్లైర్ (బాల్టిమోర్: పెంగుయిన్ బుక్స్, 1964, 1972), పే. 190.
 3. రిచర్డ్ పైప్స్, ఎ కన్సైస్ హిస్టరీ అఫ్ ది రష్యన్ రివల్యూషన్ Archived 2011-05-11 at the Wayback Machine.
 4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 జాక్ గోల్డ్‌స్టోన్ , "థియరీస్ అఫ్ రివల్యూషన్స్: ది థర్డ్ జెనరేషన్, వరల్డ్ పోలిటిక్స్ 32, 1980:425-53
 5. జాన్ ఫారన్, "థియరీస్ ఆఫ్ రివల్యూషన్ రీవిసిటడ్: టువార్డ్ ఎ ఫోర్త్ జేనేరేషన్", సోషలూజికల్ థియరీ 11, 1993:1-20
 6. క్లిఫ్టన్ బి. క్రోబెర్, థియరీ అండ్ హిస్టరీ అఫ్ రివల్యూషన్, జర్నల్ అఫ్ వరల్డ్ హిస్టరీ 7.1, 1996: 21-40
 7. Goodwin, p.9.
 8. 8.0 8.1 8.2 8.3 8.4 8.5 8.6 8.7 Jack Goldstone, "Towards a Fourth Generation of Revolutionary Theory", Annual Review of Political Science 4, 2001:139-87
 9. జేఫ్ఫ్ గుడ్విన్, నో అదర్ వే అవుట్: స్టేట్స్ అండ్ రివల్యూషనరీ మూవ్మెంట్స్ , 1945-1991. కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ ప్రెస్ (1986), పేజి. 240.
 10. 10.0 10.1 క్రేన్ బ్రిన్టన్, ది అనాటమీ అఫ్ రివల్యూషన్ , సవరించబడిన ప్రచురణ. (న్యూ యార్క్, వింటేజ్ బుక్స్, 1965). మొదటి ప్రచురణ, 1938.
 11. రోజర్ బోస్చ్, తోక్వేవిల్లీస్ రోడ్ మ్యాప్: మేతడాలజి, లిబరిలిజం, రివల్యూషన్ అండ్ డెస్పాటిజం , లెక్సింగ్టన్ బుక్స్, 2006, ISBN 0739116657, గూగుల్ ప్రింట్, పే.86
 12. మూస:Pl icon జే. టోపోల్స్కి, "Rewolucje w dziejach nowożytnych i najnowszych (xvii-xx wiek)," Kwartalnik Historyczny, LXXXIII, 1976, 251-67
 13. బెర్నార్డ్ లేవిస్, "ఇరాన్ ఇన్ హిస్టరీ", మోషే దయన్ సెంటర్, టెల్ అవివ్ యునివెర్సిటీ
 14. చార్లెస్ టిల్లీ , యూరోపియన్ రివల్యూషన్స్, 1492-1992, బ్లాక్వెల్ పబ్లిషింగ్, 1995, ISBN 0631199039, గూగుల్ ప్రింట్, పే.16
 15. ఇర్వింగ్ ఈ. ఫంగ్, ఎ హిస్టరీ అఫ్ మాస్ కమ్యూనికేషన్: సిక్స్ ఇన్ఫర్మేషన్ రివల్యూషన్స్ , ఫోకల్ ప్రెస్, 1997, ISBN 0240802543, గూగుల్ ప్రింట్, పే. xv
 16. వార్విక్ ఈ. ముర్రే, రోట్లేడ్జ్, 2006, ISBN 0415318009, గూగుల్ ప్రింట్, పే.226

గ్రంథ సూచిక[మార్చు]

 • ది ఇంటర్నేషనల్ ఎన్సైక్లోపీడియా అఫ్ రివల్యూషన్ అండ్ ప్రొటెస్ట్: 1500 టు ది ప్రెసెంట్, ఇమ్మాన్యువాల్ నెస్, మాల్డెన్, ఎంఏ [మొదలగు.] చే సరిదిద్దబడింది: విలీ & సన్స్, 2009, ISBN 1405184647
 • పెర్రూ-సాసినే, ఎమిలే, Les libéraux face aux révolutions : 1688, 1789, 1917, 1933, Commentaire, స్ప్రింగ్ 2005, పే. 181–193

బాహ్య లింకులు[మార్చు]

Wikiquote-logo-en.svg
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.

!: రివల్యూషన్ ఈస్ యాన్ ఇండేలిబిల్ ఫినామినన్ త్రూఅవుట్ హిస్టరీ, క్వాసిం హుస్సైని రచన

మూస:Social and political philosophy

"https://te.wikipedia.org/w/index.php?title=విప్లవం&oldid=2812820" నుండి వెలికితీశారు