విప్లవం వర్ధిల్లాలి (సినిమా)
విప్లవం వర్ధిల్లాలి (1970 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | సి.వి.శ్రీధర్ |
---|---|
నిర్మాణం | సి.వి.శ్రీధర్ |
తారాగణం | శివాజీ గణేశన్, కాంచన |
సంగీతం | ఎం.ఎస్.విశ్వనాథం |
నిర్మాణ సంస్థ | చిత్రాలయ పిక్చర్స్ |
భాష | తెలుగు |
విప్లవం వర్ధిల్లాలి సి.వి.శ్రీధర్ స్వీయ దర్శకత్వంలో చిత్రాలయ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించిన డబ్బింగ్ సినిమా. ఈ సినిమా 1970, జూన్ 12వ తేదీన విడుదల అయ్యింది.[1] తమిళభాషలో వందరోజులు ఆడిన శివంద మన్ అనే సినిమా దీనికి మాతృక. ఈ సినిమా హిందీ భాషలో రాజేంద్ర కుమార్, వహీదా రహ్మాన్ జంటగా ధర్తీ అనే పేరుతో పునర్మించబడింది.
నటీనటులు
[మార్చు]- శివాజీ గణేశన్ - భారత్
- కాంచన - వసంత
- ఎస్.వి.రంగారావు - పోలీసు ఆఫీసర్
- శాంతకుమారి - పోలీసు ఆఫీసర్ భార్య
- నంబియార్ - దివాన్
- ముత్తురామన్ - విప్లవవీరుడు
- నాగేష్
- సచ్చు
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు, నిర్మాత: సి.వి.శ్రీధర్
- మాటలు: ఆరుద్ర
- సంగీతం: ఎం.ఎస్.విశ్వనాథన్
కథ
[మార్చు]వసంతపురి రాజును కీలుబొమ్మగా చేసి దివాన్ ఆడింది ఆటగా పాలిస్తూ వుంటాడు. అంతేకాక పోర్చుగీసు సామ్రాజ్యవాదుల వలసప్రాంతంగా చేయాలని కూడా కుట్రపన్నుతాడు. ఈ పన్నాగాన్ని ఒక దేశభక్తుడు ఎదుర్కొంటాడు. అతడికి వసంతపురి పోలీస్ ఇన్‌స్పెక్టర్ జనరల్ కొడుకు భారత్ తోడైనాడు. ఇద్దరూ దివాన్‌ను ఎదురించారు. వసంతపురి రాకుమారి వసంత భారత్‌ను ప్రేమిస్తుంది. దివాన్ ఆమెను వివాహం చేసుకుని తానే వసంతపురి రాజు కావాలని చూస్తూ ఉంటాడు. యువరాణికూడా విప్లవ వాదులతో చేయికలిపి దివాన్ అకృత్యాలను ఎదుర్కొంటుంది. ఆ విప్లవ వర్గం ఎలా దివాన్‌ను గెలిచింది అనేది మిగిలిన కథ.[2]
విశేషాలు
[మార్చు]- ఈ సినిమా స్విట్జర్లాండ్, స్పెయిన్, రోమ్, ప్యారిస్ మొదలైన విదేశీ ప్రాంతాలలో చిత్రీకరించారు. ఈ చిత్రం తరువాత అనేక తమిళ, తెలుగు సినిమాలకు ఫ్రాన్సులో షూటింగ్ జరుపుకోవడానికి ప్రేరణగా నిలించింది.
- ఈ సినిమాలో బుల్ ఫైట్, నదులలో, మంచుపై ఆటపాటల చిత్రీకరణ, విమానాలలో పోరాటాలు, హెలీకాప్టర్ పై నుండి విప్లవవాదులపై బాంబులను విసిరే సన్నివేశాలు, సముద్రంలో ఆయుధాలున్న నౌకను విప్లవకారులు పేల్చివేసిన సన్నివేశం, క్యాబరే నృత్యాలు ఆకర్షణీయంగా ఉన్నాయి.
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "Viplavam Vardhillali (C.V. Sridhar) 1970". ఇండియన్ సినిమా. Retrieved 19 September 2022.
- ↑ తుర్లపాటి (14 June 1970). "చితసమీక్ష: విప్లవం వర్ధిల్లాలి" (PDF). ఆంధ్రజ్యోతి దినపత్రిక. No. సంపుటి 10, సంచిక 340. Archived from the original (PDF) on 20 సెప్టెంబరు 2022. Retrieved 19 September 2022.