విబ్రియో
Appearance
విబ్రియో (లాటిన్ Vibrio) ఒక రకమైన బాక్టీరియా (Bacteria) ప్రజాతి (Genus). ఇవి కామా (, ) ఆకృతిలోని గ్రామ్ నెగిటివ్ బాక్టీరియా.[1][2][3] విబ్రియో సూక్ష్మజీవులు ఉప్పునీటిలో నివసిస్తాయి, ఆక్సిడేజ్ (Oxidase) ను కలిగియుండి సిద్ధబీజాలు (Spores) ను ఏర్పరచవు.[4] వీటిలో అన్ని జీవులు కశాభాలు (Flagellum) తో చలిస్తాయి. విబ్రియో జీవులలో అతి ముఖ్యమైనది విబ్రియో కలరే (Vibrio cholerae), ఇవి కలరా (Cholera) అనే ప్రమాదకరమైన అతిసార వ్యాధిని కలగజేస్తాయి.
మూలాలు
[మార్చు]- ↑ Thompson FL; Iida T; Swings J (2004). "Biodiversity of Vibrios". Microbiology and Molecular Biology Reviews. 68 (3): 403–431. doi:10.1128/MMBR.68.3.403-431.2004. PMID 15353563.
- ↑ Ryan KJ, Ray CG, eds. (2004). Sherris Medical Microbiology (4th ed.). McGraw Hill. ISBN 0-8385-8529-9.
- ↑ Faruque, SM; Nair, GB (2008). Vibrio cholerae: Genomics and Molecular Biology. Caister Academic Press. ISBN 978-1-904455-33-2.
- ↑ Madigan, Michael; Martinko, John (2005). Brock Biology of Microorganisms (11th ed.). Prentice Hall. ISBN 0-13-144329-1.