విమ్మీ భట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విమ్మీ భట్
జననంజనవరి 3
వృత్తినటి

విమ్మీ భట్ భారతీయ టివి, సినిమా నటి.[1] భరతనాట్య నృత్యకారిణి. కలర్స్ గుజరాతీ ఛానల్ లో ప్రసారమైన గుజరాతీ సిట్‌కామ్ ఆ ఫ్యామిలీ కామెడీ చే ద్వారా ప్రసిద్ధి చెందింది.[2]

జననం[మార్చు]

విమ్మీ భట్ జనవరి 3న జన్మించింది.

వృత్తిరంగం[మార్చు]

విమ్మీ 2002లో ఫెమినా మిస్ ఇండియా అందాల పోటీలో సెమీ ఫైనలిస్ట్ గా నిలిచింది. 2006లో స్టార్ ప్లస్‌లో ప్రసారమైన ధర్తి క వీర్ యోధ పృథ్వీరాజ్ చౌహాన్ అనే టీవీ సిరీస్‌లో 'జ్వాల' పాత్ర ద్వారా టెలివిజన్‌ రంగంలోకి ప్రవేశించింది.[3] టీమ్ పోస్ట్‌మాస్టర్‌లచే "స్పీచ్‌లెస్"[4] విజయంతో 2016లో హార్దిక్ అభినందన్‌ అనే గుజరాతీ సినిమాతో సినిమారంగంలోకి అడుగుపెట్టింది.[3] 2018లో బ్లింక్ అనే షార్ట్ ఫిల్మ్ లో నటించింది. " ఫిలిప్ కె. డిక్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ఫెస్టివల్ (2019)లో "ఉత్తమ అంతర్జాతీయ షార్ట్ ఫిల్మ్" & "ఉత్తమ సైన్స్ ఫిక్షన్ షార్ట్"కి నామినేట్ చేయబడింది.[5][6]

విమ్మీ భబ్ నటించిన ఆశా,[7] బేటి[8] గుజరాతి సినిమాలు 2021 విడుదలయ్యాయి.

సినిమాలు, టీవీ సిరీస్‌లతోపాటు చేవ్రొలెట్ (2013), ఇండియన్ టీ బ్రాండ్స్ & షాపర్స్ స్టాప్ కోసం ప్రింట్ యాడ్ క్యాంపెయిన్‌లలో, న్యూ ఉమెన్ (మ్యాగజైన్) కోసం వార్త కథనాలతోపాటుగా వీడియో ప్రకటన ప్రచారాలలో నటించింది.

టెలివిజన్[మార్చు]

సంవత్సరం కార్యక్రమం పాత్ర భాష
2006 పృథ్వీరాజ్ చౌహాన్ (స్టార్ ప్లస్) జ్వాల హిందీ
2007 కాయమత్ (స్టార్ ప్లస్) పూర్వి హిందీ
2009 బంధన్ సాత్ జనమో కా (రంగుల) డాలీ హిందీ
2010 షార్ (సహారా వన్) సరిత హిందీ
2014 తారీ అంఖ్ నో అఫిని (కలర్స్ గుజరాతీ) సుచరిత గుజరాతీ
2015 ఆ ఫ్యామిలీ కామెడీ చే (కలర్స్ గుజరాతీ) దిశా గుజరాతీ
2013 సావధాన్ ఇండియా (స్టార్ భారత్) సరిత హిందీ

సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా పాత్ర భాష
2013 స్పీచ్‌లెస్ శిఖా శర్మ హిందీ/ఇంగ్లీష్
2016 హార్దిక్ అభినందన్ ఆర్తి పటేల్ గుజరాతీ
2018 బ్లింక్ స్మృతి హిందీ/ఇంగ్లీష్
2021 ఆశా ఆశా గుజరాతీ
2021 బేటి పూర్వి గుజరాతీ

అవార్డులు[మార్చు]

సంవత్సరం అవార్డు విభాగం పాత్ర సినిమా/టెలివిజన్ ఫలితం
2013 48 గంటల సినిమా ప్రాజెక్ట్ ఉత్తమ నటి శిఖా శర్మ స్పీచ్ లెస్ విజేత[9]
2014 14వ వార్షిక గుజరాతీ స్క్రీన్ & స్టేజ్ అవార్డు ఉత్తమ నటి (మహిళా ప్రధాన) దిశా శాస్త్రి ఆ ఫ్యామిలీ కామెడీ చే విజేత[10]
  • టైమ్స్ ఆఫ్ ఇండియాలో "తారీ అంఖ్ నో అఫిని"లో సుచరిత పాత్రకు, దిశా శాస్త్రి "ఆ ఫ్యామిలీ కామెడీ చే "లో 'ఫేవరెట్ బేటీ'కి విమ్మిని వీక్షకులు 'ఇష్టమైన బహు'గా నామినేట్ చేశారు.[11]

ప్రచురించబడిన పుస్తకాలు[మార్చు]

  • ది రెవెర్సల్ థాట్ ప్రాసెస్-మైండ్ యువర్ మైండ్[12]
  • ది అన్నోన్ లవ్-కంప్లికేటెడ్[13]

మూలాలు[మార్చు]

  1. Malini, Navya. "Vimmy Bhatt says no to saas bahu sagas, opts for a Gujarati TV show - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 16 May 2021.
  2. "COLORS GUJARATI AA FAMILY COMEDY CHE | AA FAMILY COMEDY CHE Episode | AA FAMILY COMEDY CHE". Archived from the original on 2015-06-14. Retrieved 2015-06-12.
  3. 3.0 3.1 Vadgama, Arpita. "TV actress Vimmy Bhatt to debut in Gujarati film - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 16 May 2021.
  4. "Vimmy Bhatt - Gujarati film celebrities and their candid filming moments". The Times of India. Retrieved 16 May 2021.
  5. "Blink by Anthelion Films makes a global presence". www.mid-day.com (in ఇంగ్లీష్). 12 May 2021. Retrieved 16 May 2021.
  6. "Aasha- A hope for love | WFCN". WFCN – World Film Communities Network (in ఇంగ్లీష్). Retrieved 16 May 2021.
  7. "Beti - Official Trailer". timesofindia.indiatimes.com (in ఇంగ్లీష్). Retrieved 16 May 2021.
  8. Prakashan, Priya (28 April 2014). "Love is never silent: Speechless, award-winning short film of The 48 Hour film Project". india.com (in ఇంగ్లీష్). Retrieved 16 May 2021.
  9. Raval, Aditi (3 March 2015). "transmedia-awards". rjaditi.com. Retrieved 16 May 2021.
  10. "Gujarati TV's favourite Beti". The Times of India. 13 February 2015.
  11. bhatt, vimmy. THE REVERSAL THOUGHT PROCESS.
  12. bhatt, vimmy. THE UNKNOWN LOVE.

బయటి లింకులు[మార్చు]