ఫుల్ స్టాప్ ను తెలుగులో విరామ బిందువు అంటారు. దీనిని వాక్యాలు రాసేటప్పుడు ఒక వాక్యం పూర్తయిన తరువాత వాక్యం పూర్తయినది అని సూచించడానికి ఈ గుర్తును ఉపయోగిస్తారు. ఫుల్ స్టాప్ సంకేతం (.). వెబ్ చిరునామాలు చెప్పేటప్పుడు డాట్ అని, గణన సందర్భంలో చెప్పవలసినప్పుడు డాట్ లేక పాయింట్ అని అంటారు. వాక్యం పూర్తయిన సందర్భంగా వచ్చే బిందువుకు భిన్నంగా ఇవి మధ్య బిందువుగా ఉండుట వలన కొందరు నిపుణులు ఈ బిందువులను బేస్ లైన్ డాట్ అంటారు, ఎందుకంటే ఈ డాట్ బేస్ లైన్ మీద ఉండుట వలన.
విరామ చిహ్నాల సిస్టమ్ను కనుగొన్న బైజాంటియమ్ అరిస్టోఫాన్స్ నుండి ఫుల్ స్టాప్ చిహ్నం వచ్చింది, లైన్ పై డాట్ స్థానం ఉండే ఎత్తుపై దాని అర్థం నిర్ణయించబడుతుంది. ఎక్కువ ఎత్తులో ఉన్న డాట్ ను (˙) "periodos" అని పిలిచేవారు, ఇది ఒక పూర్తి ఆలోచన లేదా వాక్యాన్ని సూచిస్తుంది. మధ్య డాట్ (·) ను "kolon" అని పిలిచేవారు, ఒక పూర్తి ఆలోచన భాగాన్ని సూచిస్తుంది. కింద ఉన్న డాట్ ను (.) "telia" అని పిలిచేవారు, ఇంకా ఒక పూర్తి ఆలోచన భాగాన్ని సూచిస్తుంది.