విలియం జోన్స్

From వికీపీడియా
Jump to navigation Jump to search

విలియం జోన్స్ 8-9-1746 న ఇంగ్లాండ్ లోని వెస్ట్ మినిస్టర్ లో ఉన్న బ్యూఫోర్ట్ బిల్డింగ్స్ లో జన్మించారు. జోన్స్ ఆంగ్లో వెల్ష్ ఫైలాలజిస్ట్, పూస్నే జడ్జి, ప్రాచీన భాషా వేత్త. తండ్రిపేరు కూడా విలియం జేమ్స్ అవటం యాదృచ్చికమే. తండ్రి వేల్స్ లో గణిత శాస్త్ర వేత్త. గణితం లో ‘’పై ‘’గుర్తు ను కనిపెట్టిన వాడు కూడా. కొడుకు జోన్స్ బాల్యం లోనే ఇంగ్లీష్ వెల్ష్ గ్రీక్ ,లాటిన్ పెర్షియన్, అరెబిక్, హీబ్రూ, చైనా భాషలను నేర్చి న బాల భాషా మేధావి. చనిపోయే నాటికి 13 భాషల్లో మహా పాండిత్యం మరో 28 భాషల్లో పాండిత్యం సాధించిన వాడు. అందుకే ఆయన్ను మహోన్నత బహుభాషా వేత్త అన్నారు .

విలియం జోన్స్ చేసిన అతి ముఖ్యమైన పని ఏమంటే –ఇండో యూరోపియన్ భాషల మధ్య ఉన్న వారసత్వ బాంధవ్యాన్ని గురించి విస్తృతంగా ప్రచారం చేయటం. ఏషియాటిక్ సొసైటీ మూడవ వార్షికోత్సవం లో మాట్లాడుతూ సంస్కృత , గ్రీకు, లాటిన్ భాషలకు ఒకే మూలం ఉందని ,అదే గోతిక్ ,సెల్టిక్ పెర్షియన్ భాషలనూకలుపుతోందనీ చెప్పాడు .ఈవిషయం విలియం జోన్స్ కంటే ముందే 16 వ శతాబ్దపు ఐరోపా యాత్రికులు గుర్తించి భారత ఐరోపా భాషలమధ్య సన్నిహిత సంబంధం ఉందని రాశారు .1653 లో ‘’వాన్ బాక్స్ హారన్ అనే భాషా వేత్త జర్మన్ ,‘గ్రీక్ బాల్టిక్ ,స్లావిక్ సెల్టిక్ ,ఇరానియన్ భాషలకు ’ప్రోటో లాంగ్వేజ్ ‘’అనే అభిప్రాయాన్ని ప్రతిపాదిస్తూ పుస్తకం రాశాడు .ఫ్రెంచ్ అకాడెమి సైన్సెస్ కు 1767 లో’’జీవితం అంతా ఇండియాలో గడిపిన ఫ్రెంచ్ జెసూట్ గాస్టన్ లారెనన్స్ కోర్ డాక్స్ ‘’సంస్కృతానికి యూరోపియన్ భాషలకు మధ్య ఉన్న సారూప్యతను నిర్ధారించి రాసిపంపాడు.

దక్షిణ ఆసియా సంస్కృతులపై విలియం జోన్స్కు వున్న మక్కువతో 15-1-1784 న కలకత్తాలో ‘’ఏషియాటిక్ సొసైటీ ‘’స్థాపించాడు .నాడీయ హిందూ యూని వర్సిటి కి చెందినా సంస్కృత పండితుడు రామ లోచన వద్ద వేదాలను అభ్యసింఛి నిష్ణాతుడయ్యాడు .జ్యోతిషం పై సామ్యుయాల్ డేవిస్ తో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపాడు .ఇదంతా తర్వాత ఆయన రచనా స్రవంతికి గొప్పగా దోహదం చేశాయి .ఇండియాలోని స్థానిక న్యాయం సంగీతం సాహిత్యం వృక్ష ,భూగోళ శాస్త్రాలపై విస్తృత౦ గా రచనలు చేశాడు .భారతీయ సాహిత్యాన్ని మొదటి సారిగా ఇంగ్లీష్ లోకి అనువాదం చేశాడు .47 ఏళ్ళు మాత్రమె జీవించిన భారత భాషాభిమాని పండితుడు విద్యావేత్త విలియం జోన్స్ 27-4-1794 న కలకత్తా లో మరణించాడు. సౌత్ పార్క్ స్ట్రీట్ సేమేటరిలో ఖననం చేశారు .

మూలాలు[edit]