Jump to content

వివేక్ జయసింహ

వికీపీడియా నుండి
వివేక్ జయసింహ
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1964-03-18) 1964 మార్చి 18 (వయసు 60)
హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
బ్యాటింగుకుడిచేతి వాటం బ్యాట్స్‌మన్
బౌలింగురైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ బౌలర్
పాత్రబ్యాట్స్‌మన్
బంధువులుఎం.ఎల్.జయసింహ (తండ్రి)
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1982/83–1993/94హైదరాబాదు క్రికెట్ జట్టు
1994/95–1997/98గోవా క్రికెట్ జట్టు
కెరీర్ గణాంకాలు
పోటీ ఫస్ట్ లిస్ట్ ఏ
మ్యాచ్‌లు 78 19
చేసిన పరుగులు 3,917 531
బ్యాటింగు సగటు 38.40 35.40
100లు/50లు 8/21 1/1
అత్యధిక స్కోరు 211 101
వేసిన బంతులు 942 41
వికెట్లు 12 1
బౌలింగు సగటు 46.91 51.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 n/a
అత్యుత్తమ బౌలింగు 2/27 1/35
క్యాచ్‌లు/స్టంపింగులు 64/– 7/–
మూలం: ఆఎస్పిఎన్ క్రిక్ ఇన్ఫో, 2016 ఫిబ్రవరి 18

వివేక్ జయసింహ (జననం 18 మార్చి 1964) తెలంగాణకు చెందిన భారతీయ మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్. హైదరాబాదు, గోవా క్రికెట్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.

జననం

[మార్చు]

వివేక్ 1964, మార్చి 18న తెలంగాణలోని హైదరాబాదులో జన్మించాడు. ఇతని తండ్రి ఎం.ఎల్.జయసింహ భారత మాజీ అంతర్జాతీయ క్రికెటర్. భారతదేశం తరఫున 39 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు.

క్రీడారంగం

[మార్చు]

జయసింహ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్, అప్పుడప్పుడు రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ బౌలర్. 1982/83 నుండి 1993/94 మధ్యకాలంలో 12 సీజన్లలో హైదరాబాదు క్రికెట్ జట్టు తరపున, 1994/95 నుండి 1997/98 మధ్యకాలంలో 4 సీజన్లలో గోవా క్రికెట్ జట్టు తరపున ఆడాడు. 1986–87 రంజీ ట్రోఫీ, 1987–88 ఇరానీ కప్ గెలిచిన హైదరాబాదు జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. 1989-90 రంజీ ట్రోఫీలో 59 పరుగుల సగటుతో 534 పరుగులతో ఎక్కువ పరుగులు చేసిన ఐదుమందిలో జయసింహ ఒకడు.[1] 78 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో 4000 పరుగులు, 19 లిస్ట్ ఎ మ్యాచ్‌లలో 500 కి పైగా పరుగులు చేశాడు.

పదవీ విరమణ తర్వాత జయసింహ కోచ్ గా మారాడు. 2000ల ప్రారంభంలో హైదరాబాదు జట్టు అసిస్టెంట్ కోచ్‌గా పనిచేశాడు.[2] 2008, 2010 మధ్య మ్యాచ్ రిఫరీగా కూడా పనిచేశాడు.[3] 2010 నవంబరు వరకు హైదరాబాదు జట్టు బ్యాటింగ్ కోచ్ గా ఉండి, రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాదు జట్టు 21 పరుగుల వద్ద ఆలౌట్ అయినపుడు తన పదవికి రాజీనామా చేశాడు.[4] ఆ తర్వాత హైదరాబాదు క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్‌లో కోచ్‌లలో ఒకరిగా పనిచేశాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. "Batting and Fielding in Ranji Trophy 1989/90 (Ordered by Runs)". CricketArchive. Archived from the original on ఫిబ్రవరి 7 2016. Retrieved జూలై 23 2021. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (help)
  2. "Hyderabad keen to finish off in style". The Hindu. డిసెంబరు 31 2004. Archived from the original on నవంబరు 21 2018. Retrieved జూలై 23 2021. {{cite web}}: Check date values in: |access-date=, |date=, and |archive-date= (help)
  3. "Lists of matches and detailed statistics for Vivek Jaisimha". CricketArchive. Archived from the original on ఫిబ్రవరి 24 2016. Retrieved జూలై 23 2021. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (help)
  4. Tagore, Vijay (నవంబరు 13 2010). "Hyderabad cricket: From Nizams to pauper". DNA India. Retrieved జూలై 23 2021. {{cite web}}: Check date values in: |access-date= and |date= (help)
  5. Subrahmanyam, V. V. (ఫిబ్రవరి 28 2013). "Gymkhana Ground abuzz with cricketing activity again". The Hindu. Archived from the original on మార్చి 2 2013. Retrieved జూలై 23 2021. {{cite web}}: Check date values in: |access-date=, |date=, and |archive-date= (help)

బయటి లింకులు

[మార్చు]