వివేక్ రామ్ చౌదరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వివేక్‌ రామ్‌ చౌదరి
వివేక్ రామ్ చౌదరి


27వ ఎయిర్‌ చీఫ్‌ స్టాఫ్‌
పదవీ కాలం
30 సెప్టెంబర్ 2021 – ప్రస్తుతం
రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ముందు రాకేశ్‌కుమార్‌ సింగ్‌ భదౌరియా

45వ డెప్యూటీ ఎయిర్‌ చీఫ్‌ స్టాఫ్‌
పదవీ కాలం
1 జులై 2021 – 30 సెప్టెంబర్ 2021
ముందు హర్జిత్ సింగ్ అరోరా
తరువాత సందీప్ సింగ్

వ్యక్తిగత వివరాలు

జననం (1962-09-04) 1962 సెప్టెంబరు 4 (వయసు 61)[1]
తల్లిదండ్రులు రామ్ భౌ చౌదరి (నాన్న), సుహాస్‌ చౌదరి
సంతానం 2
వృత్తి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పైలట్

వివేక్‌ రామ్‌ చౌదరి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారి. ఆయన 30 సెప్టెంబర్ 2021న భారత వైమానిక (ఇండియన్ ఎయిర్‌ఫోర్స్) దళాధిపతిగా భాద్యతలు చేపట్టాడు.[2]

జననం, విద్యాభాస్యం[మార్చు]

వివేక్‌ రామ్‌ చౌదరి మహారాష్ట్ర రాష్ట్రం, నాందేడ్ జిల్లా, హద్గావ్ తాలూకా హస్తారా గ్రామంలో జన్మించాడు. ఆయన కుటుంబం చాన్నాళ్ల క్రితమే హైదరాబాద్‌ వచ్చి స్థిరపడింది. ఆయన తండ్రి ఆర్‌జీ చౌదరి రామచంద్రాపురంలోని భెల్‌ ట్రైనింగ్‌ స్కూల్లో సీనియర్‌ ఇన్‌స్ట్రక్టర్‌గా తల్లి సుహాస్‌ చౌదరి హయ్యర్‌ సెకండరీ స్కూల్లో ఉపాధ్యాయురాలిగా పని చేసింది. వీఆర్‌ చౌదరి నేషనల్ డిఫెన్స్ అకాడమీ, డిఫెన్స్‌ సర్వీసెస్‌ స్టాఫ్‌ కాలేజీ, వెల్లింగ్టన్‌ లో విద్యాభాస్యం పూర్తి చేశాడు.

వృత్తి జీవితం[మార్చు]

వివేక్‌ రామ్‌ చౌదరి 1982, డిసెంబర్‌ 29న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ లో పైలట్‌గా చేరాడు. ఆయన భారత వైమానిక దళానికి చెందిన వివిధ రకాల ఫైటర్, ట్రైనర్ విమానాలను నడిపాడు. మిగ్ -21, మిగ్ -23 ఎంఎఫ్, మిగ్ -29, సుఖోయ్-30 ఎంకేఐ ఫైటర్ వంటి ఎయిర్‌క్రాఫ్ట్‌లలో సుమారు 3,800 గంటల పాటు ప్రయాణించిన అనుభవం ఉంది. వీఆర్‌ చౌదరి దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ డిప్యూటీ కమాండర్‌గా కొంతకాలం పని చేశాడు.

ఆయన ఈస్టర్న్ ఎయిర్ కమాండ్(EAC)కి సెకండ్ ఇన్ కమాండ్‌గా, తరువాత పశ్చిమ ఎయిర్‌ కమాండ్‌ (WAC) కమాండింగ్‌ ఇన్‌ చీఫ్‌గా ఆగస్టు 2020 నుంచి జులై 2021 వరకు పని చేసి, ఎయిర్ స్టాఫ్ డిప్యూటీ చీఫ్‌గా పని చేశాడు. వీఆర్‌ చౌదరి 30 సెప్టెంబర్ 2021న భారత వైమానిక (ఇండియన్ ఎయిర్‌ఫోర్స్) దళాధిపతిగా భాద్యతలు చేపట్టాడు.[3][4]

అవార్డ్స్[మార్చు]

మూస:Ribbon devices/alt మూస:Ribbon devices/alt మూస:Ribbon devices/alt మూస:Ribbon devices/alt
మూస:Ribbon devices/alt మూస:Ribbon devices/alt మూస:Ribbon devices/alt మూస:Ribbon devices/alt
మూస:Ribbon devices/alt మూస:Ribbon devices/alt మూస:Ribbon devices/alt
మూస:Ribbon devices/alt మూస:Ribbon devices/alt మూస:Ribbon devices/alt మూస:Ribbon devices/alt
పరమ్ విశిష్ఠ్ సేవా మెడల్ అతి విశిష్ట్ సేవా మెడల్ వాయుసేన మెడల్ సామాన్య సేవా మెడల్
ఆపరేషన్ విజయ్ స్టార్ సియాచిన్ గ్లేసియర్ మెడల్ స్పెషల్ సర్వీస్ మెడల్ ఆపరేషన్ పరాక్రం మెడల్
ఆపరేషన్ విజయ్ మెడల్ సైన్య సేవా మెడల్ హై ఆల్టిట్యుడ్ సర్వీస్ మెడల్ విదేశ్ సేవా మెడల్
50th Anniversary of Independence Medal 30 Years Long Service Medal 20 Years Long Service Medal 9 Years Long Service Medal

మూలాలు[మార్చు]

  1. Indian Air Force (2021). "Indian Air Force: Touch The Sky With Glory". Indian Air Force: Touch The Sky With Glory. Archived from the original on 19 September 2021. Retrieved 3 October 2021.
  2. Mana Telangana (30 September 2021). "వాయుసేన అధిపతిగా వివేక్‌రామ్". Archived from the original on 3 October 2021. Retrieved 3 October 2021.
  3. Andrajyothy (3 October 2021). "కొత్త ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వీఆర్‌ చౌదరి". Archived from the original on 3 October 2021. Retrieved 3 October 2021.
  4. TV9 Telugu (1 October 2021). "వైమానిక దళాధిపతిగా హైదరాబాదీ.. ఆర్కేఎస్ బదౌరియా నుంచి బాధ్యతలు స్వీకరించిన వివేక్ రామ్ చౌదరి". Archived from the original on 30 September 2021. Retrieved 3 October 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)