Jump to content

విషక్రిమిన్యాయం

వికీపీడియా నుండి

విషములో పుట్టినపురుగు విషమే తిని జీవించునట్లు. చాణక్య నీతి దర్పణమున నీన్యాయము నుద్బోధించుచు నిట్లు నుడువఁబడియున్నది.

"విప్రాస్మి న్నగరే మహాన్‌ కథయ కః?
తాలద్రుమాణాం గణః; కో దక్షః?
పరవిత్తదారహరణే సర్వోఽపి పౌరో జనః; కోదాతా?
రజకో, దదాతి వసనం ప్రాత ర్గృహీత్వానిశి;
తత్కిం జీవసి హే సఖే?
విషక్రిమిన్యాయేన జీవామ్యహమ్‌."

ఒక బ్రాహ్మణుడు ఒక గ్రామానికి భిక్షాటనకై వెళ్ళి ఊరి బయట కనిపించిన వేరొక బ్రాహ్మణుని ఆ గ్రామ పరిస్థితులను తెలుసుకొనుటకు ఈ విధంగా ప్రశ్నిస్తాడు. అపుడు ఆ బ్రాహ్మణుడు ఈ విధంగా సమాధానము నిచ్చెను.

  • ఈ వూరిలో అందరికన్నా గొప్పవాడెవడు? - ఈ వూరిలో అందరికంటే గొప్పవాడు ఆ కనబడు తాటి తోపు.
  • ఇచట సమర్థుడెవడు ? - ఇతరుల ధనమును, భార్యలను అమాంతముగా దొంగిలించువారందరూ సమర్థులే.
  • పోనీ, దాత ఎవడో వినిపింతువా? - ఈ గ్రామంలో దాత చాకివాడు. అతడే మహాదాత. ఎందువలనంటే అతను ఉదయం తీసుకొని పోయిన గుడ్డలను రాత్రికి మరల తెచ్చుచున్నాడు.
  • అయితే ఈ ఊరిలో ఎట్లు జీవించుచున్నావు? - అయ్యా! ఏమి చెప్పను? విషక్రిమిన్యాయముగా జీవించుచున్నాను.

భావము

[మార్చు]

అనగా యీయూరఁ బుట్టినవాఁడ నగుటచే నిచటిప్రకృతి కలవాటుపడి బ్రదుకుచున్నాను అని భావము. విషములోని పురువునకు విష మిష్టాహారమే. అవిషము దాని కేమియు హాని చేయదు; కాని, యితరులకుమాత్రము హానికర మవును." (ఒకనికి ఆహార మయిన వస్తువు మఱొకనికి విషమవును. ఒకరిమేలు మఱొకరికి కీడు. పై విషకీటన్యాయము, ఈ విషక్రిమిన్యాయము రెండు నొకటియే.

మూలము

[మార్చు]

విషక్రిమిన్యాయము : సంస్కృతన్యాయములు (కూచిభొట్ల ప్రభాకరశాస్త్రి, ఘట్టి లక్ష్మీనరసింహశాస్త్రి ) 1939 https://web.archive.org/web/20140209111013/http://www.andhrabharati.com/dictionary/