వి.ఎల్.ఎస్.భీమశంకరం

వికీపీడియా నుండి
(వి.యల్.యస్. భీమశంకరం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
వేము లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్య భీమశంకరం
వి.ఎల్.ఎస్.భీమశంకరం
జననంనవంబరు 16 , 1931
మరణంనవంబరు 19 , 2021
పౌరసత్వంభారతీయుడు
జాతీయత భారతీయుడు
రంగములుభూ భౌతిక శాస్త్రవేత్త

వి.ఎల్.ఎస్.భీమశంకరం (వేము లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్య భీమశంకరం) ప్రముఖ భూ భౌతిక శాస్త్రవేత్త.[1]

జీవిత విశేషాలు[మార్చు]

భీమశంకరం నవంబరు 16 1931 న జన్మించారు. 1957 లో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పి.హెచ్.డి పట్టభద్రులైనారు. 1967 నుండి 1979 ల మధ్య ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జియోఫిజిక్స్ విభాగపు అధిపతిగా పనిచేశారు. యూనివర్శిటీలో "సెంటర్ ఫర్ ఎక్స్‌ప్లోరేషన్" జియోఫిజిక్స్ ను ఎంతగానో అభివృద్ధి చేశారు. యు.జి.సి నేషనల్ ఫెలోషిప్ నందుకున్నారు.

మన దేశంలోని దక్కన్ పీఠభూమి యొక్క ప్రాచీన లోహకర్షకత్వం (అయస్కాంతత్వం) నకు సంబంధించి అతి విలువైన సమాచారాన్ని తన పరిశోధనల ద్వారా వెల్లడించారు.[2] అగ్ని శిలల అయస్కాంతత్వ పాక్షిక స్వయం విపర్యను విశదపరచడంలో అమోఘమేధాశక్తిని కల్పించారు. భూగర్భం లోని ఖనిజ సంపదను వెలికి తీయు క్రమంలో శాస్త్రీయమైన వ్యూహ రచన చేసి భూభౌతిక శాస్త్రమును అభివృద్ధి పరచారు.

ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ (1928), ఇండియన్ జియోఫిజికల్ యూనియన్లో జియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, అసోసియేషన్ ఆఫ్ ఎక్స్ ప్లోరేషన్ ఆఫ్ జియో ఫిజిక్స్, ఆంధ్ర ప్రదేశ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ మొదలగు సంస్థల గౌరవ సత్కారాలను అందుకున్నారు. ఇండియన్ అకాడమీ ఆఫ్ జియోసైన్స్ లో గౌరవ సభ్యత్వ గ్రహీత. వాన్ వీల్డెన్ అవార్డు, యూరోపియన్ అసోసియేషన్ ఆఫ్ ఎక్స్ ప్లోరేషన్ జియోఫిజిక్స్, నెదర్లాండ్స్ (1957), డెసెన్ వీల్ అవార్డు, ఇండియన్ జియోఫిజికల్ యూనియన్ అవార్డు (1981) మొదలైనవి అందుకున్నారు.

అశ్రు నివాళి[మార్చు]

విఖ్యాత భూభౌతిక శాస్త్రవేత్త, ఉస్మానియా విశ్వవిద్యాలయ పూర్వ డీన్ ఆఫ్ సైన్సెస్, ప్రముఖ ప్రౌఢ పద్యకవి, తెలుగు విశ్వవిద్యాలయం వారిచే సాహిత్య రంగంలో 'జీవన సాఫల్య పురస్కార గృహీత', 'రసస్రువు', 'శివానంద మందహాసం' వంటి ఆధునిక ప్రబంధాల కర్త -ఆచార్య వి.ఎల్.ఎస్. భీమశంకరం గారు 2021 నవంబరు 19, కార్తీక పౌర్ణమి పర్వదినం నాడు పరమపదించారు.భూభౌతిక శాస్త్రంలో జర్మనీ, ఇంగ్లాండ్ వంటి దేశాలలో పరిశోధనలు జరుపడంతోబాటు, నోబెల్ బహుమతి గ్రహీత అయిన పముఖ శాస్త్రవేత్త 'బ్లాకెట్' తో కలసి పనిచేసిన అపార అనుభవశాలి శ్రీ భీమశంకరం. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో భూవిజ్ఞాన శాఖను ప్రారంభించి, దానికి మొట్టమొదటి శాఖాధిపతిగా బాధ్యతలు చేపట్టిన ఘనత ఆయనది. అనంతరం 1987 - 89 మధ్య ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖనిజాభివృద్ధి సంస్థ అధ్యక్షులుగా వ్యవహరించి నేటి తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలోని అనేక గనుల వివరాలను వెలికి తీసి ఆనాటి ప్రభుత్వానికి అందజేసారు. 1994 - 96 మధ్య యూ.జీ.సీ. 'ఎమెరిటస్ ఫెలో'గా సేవలందించారు. పదవీ విరమణానంతరం ఆయన ప్రౌఢ పద్యకవిగా నూతన అవతారమెత్తారు. అనేక పద్య కృతులను రచించి సాహిత్య రంగంలో అనతి కాలంలోనే విశిష్ట కవిగా ఎనలేని కీర్తిని సాధించారు. అంతే కాకుండా 'వి.ఎల్.ఎస్. విజ్ఞాన, సారస్వత పీఠం' నెలకొల్పి ఎంతో మంది సాహితీ మూర్తులను, శాస్త్రవేత్తలను పురస్కారాలతో సత్కరించి, భాషా, విజ్ఞాన రంగాలకు సేవ చేసారు. 90 ఏళ్ళ ప్రాయంలో కొంత కాలంగా అనారోగ్యంతో ఉండి, పరమపదించిన ఆ మహాశాస్త్రవేత్త, మహాకవికి విజ్ఞాన శాస్త్ర రంగ నిపుణులు, సాహితీవేత్తలు హృదయ పూర్వక అశ్రు నివాళులను సమర్పిస్తున్నారు.

మూలాలు[మార్చు]

  1. "ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ". Archived from the original on 2016-03-04. Retrieved 2014-07-27.
  2. యునెస్కో వారి పరిశోధనా పత్రం

యితర లింకులు[మార్చు]