వి.రాజారామమోహనరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వి.రాజారామమోహనరావు ప్రముఖ రచయిత, అనువాదకుడు, సాహితీవిమర్శకుడు. పలు పత్రికల్లో అసంఖ్యాకమైన ముద్రిత రచనలు, ఎన్నో బహుమతులు పొందిన ఆయన తెలుగు సాహిత్యంలో తనదైన స్థానాన్ని సాధించుకుంటున్నారు. కథారచయిత, విమర్శకునిగానే కాక తెలుగు సినీవిమర్శలో కూడా తనదైన ముద్రవేశారు ఆయన.

వ్యక్తిగతం జీవితం[మార్చు]

1948 సం.లో రాజమండ్రి లో జన్మించారు. వీరి స్వస్థలం ఏలూరు.(ప.గో.జి) ఏడవ తరగతి వరకు పాఠశాలలకు వెళ్ళలేదు. 7 వ తరగతి పెద్దాపురంలో చదివారు. తరువాత ఇంజనీరింగ్ చేశారు. సెంట్రల్ రైల్వే నాంపల్లి లో ఉద్యోగిగా పనిచేశారు.gor

రచనారంగం[మార్చు]

రాజారామమోహనరావు విలక్షణమైన కథావస్తువుతో క్లుప్తంగా కథలు, నవలలు రాయడంలో సిద్ధహస్తులు. ఆయన పలు పురస్కారాలు పొంది, నవలల పోటీల్లో, కథల పోటీల్లో విజయాలు సాధించారు. తెలుగు పుస్తకాలను ఇతర భాషల్లోకి అనువాదం చేశారు. తెలుగులో ప్రఖ్యాతమైన నవలలను పాఠకులకు "నవలా హృదయం" శీర్షికన పరిచయం చేశారు.[1]

రచనల జాబితా[మార్చు]

పత్రికల్లో ప్రచురించిన రచనలు[మార్చు]

 • మొదటి కథ : ఒక్కక్షణం
 • కథలు - 200కి పైగా
 • నవలలు - 17
 • అనువాద కథలు - 30
 • అనువాద నవలలు - 3

నవలలు[మార్చు]

 • పరాయినీడ

కథసంపుటాలు[మార్చు]

 • వరద - ఎమెస్కో పాకెట్ బుక్స్ - 1975
 • తెల్లటి చీకటి -జ్యేష్ఠ లిటరరీ ట్రస్ట్ - 1999
 • లోలోపల... - చినుకు ప్రచురణ -2011

ఇతరాలు[మార్చు]

 • వి.రాజారామమోహనరావు రాసిన నవలా హృదయం
  నవలా హృదయం= జనవరి 2013 వి.ఎన్.ఆర్ బుక్ వరల్డ్ ,చౌడపల్లి,చిత్తూరు జిల్లా వారు ప్రచురించారు.
 • 27 ప్రసిద్ద తెలుగు నవలల విమర్శనాత్మక పరిచయాలు నవలాహృదాయంలో వున్నాయి.

పురస్కారాలు, బహుమతులు[మార్చు]

ఆయన సాహిత్యరంగంలో కృషికి పలు పురస్కారాలు, వివిధ రచనల పోటీల్లో బహుమతులు పొందారు

పురస్కారాలు[మార్చు]

జ్యేష్ఠ లిటరరీ ట్రస్ట్ పురస్కారం - 1999 పాకాల రామలక్ష్మి పురస్కారం - 2001 పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కథానికా ప్రక్రియ పురస్కారం(తెల్లటి చీకటి కథా సంపుటికి) - 2002 పులికంటి సాహితీ సత్కృతి - 2002 గురజాడ 150 జయంతి స్మారక పురస్కారం(చేదోడు కథకి) - 2012

బహుమతులు[మార్చు]

వివిధ సంస్థలు, పత్రికలు నిర్వహించిన పోటీల్లో కథలకు, నవలలకు ఇరవై సార్లు బహుమతులు పొందారు పఠనాపరంగా, ప్రయోగపరంగా, ఉద్యమస్ఫూర్తి వల్ల, సృజనాత్మకమైన కొత్త దృక్కోణం వల్ల, రచనాపరమైన నైపుణ్యంతో.... ఇలా రకరకాలుగా ఎంతో ప్రాచుర్యం పొందిన ప్రసిద్ధ తెలుగు నవలలు ఎన్నో ఉన్నాయి. అలాంటి రచనల్లో కొన్నింటిని అమెరికాలో వెలువడే తెలుగునాడి మాసపత్రిక కోసం విమర్శనాత్మక పరిచయాలుగా నేను రాశాను. ఆ రచనల సంపుటే ఈ పుస్తకం అంటూ తన నవలాహృదయం గురించి వెల్లడించారు.

ఇతరుల మాటలు[మార్చు]

 • సామాజిక భాద్యతలో భాగంగా తాను మంచి కథలు రాస్తూ, ఆ కథల ద్వారా పాఠకుడికి ఓర్పునీ, నేర్పునీ, నేర్పించే శక్తిమంతమైన కలం రాజారామమోహనరావుది. కథావస్తువు. శైలీ, శిల్పం అన్నీ అందంగా అమరిన గొప్ప కథ ’చిరిగిన తెరచాప’. మద్యతరగతి బతుక్కి ధ్వని మంతమైన శీర్షిక! -విహారి

మూలాలు[మార్చు]

 1. వి.రాజారామమోహనరావు రచించిన నవలాహృదయం పుస్తకం వెనుక రచయిత పరిచయం

ఇవి కూడా చేర్చండి[మార్చు]