వి. శ్రీనివాసరావు
వి శ్రీనివాసరావు | |
|---|---|
| సిపియం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి | |
| In office 2021 డిసెంబరు 26 – ప్రస్తుతం | |
| వ్యక్తిగత వివరాలు | |
| జననం | ప్రకాశం జిల్లా, మర్రిపూడి మండలం, కెల్లంపల్లి |
| రాజకీయ పార్టీ | కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) |
వంకాయలపాటి శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లా, మర్రిపూడి మండలం, కెల్లంపల్లి గ్రామంలో 1960 లో జన్మించాడు. అతను వీఎస్సార్ అనే పొట్టిపేరుతో కూడా ప్రసిద్ధుడు. ఇతను కమ్యూనిస్ట్ రాజకీయ నాయకుడు. ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించాడు. స్వంతజిల్లాలోనే ప్రాథమిక, ఉన్నత విద్యను పూర్తిచేసాడు. ఆ తరువాత శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, కావలిలో ఇంటర్, డిగ్రీ చదువు పూర్తి చేసాడు.[1]
రాజకీయ ప్రస్థానం
[మార్చు]కళాశాల చదివే రోజులలోనే ప్రజా ఉద్యమాలవైపు ఆకర్షితుడై ఎన్నో యువజనోద్యమాలకు సారద్యం వహించాడు. దాని పలితంగా సీపీఎం పార్టీ నుండి అతనికి మంచి గుర్తింపు లభించింది. 2021 డిసెంబరు 30 నుండి ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. [2][3] అతను మొదటసారి 2021 డిసెంబరులో జరిగిన 26వ రాష్ట్ర సమావేశంలో రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. ఆ తరువాత 2025 ఫిబ్రవరిలో జరిగిన 27వ రాష్ట్ర సమావేశంలో తిరిగి ఎన్నికయ్యాడు.[4][5]2005 ఏప్రిల్ 11 నుండి పార్టీ కేంద్ర కమిటీలో పనిచేస్తున్నాడు.[6][7][8][9][10] అతను గతంలో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) కేంద్ర కార్యదర్శిగా ఉన్నాడు.[11] కొంతకాలం ప్రజాశక్తి దినపత్రిక సంపాదకుడుగా పనిచేసాడు. బి.వి.రాఘవులు తరువాత రాష్ట్రపార్టీ కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్న రెండవ వ్యక్తి వీఎస్సార్.[12]
మూలాలు
[మార్చు]- ↑ "సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా శ్రీనివాసరావు". Sakshi. Retrieved 2025-11-22.
- ↑ India, The Hans (2021-12-30). "Vijayawada: V Srinivasa Rao elected CPM state secretary". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2025-07-08.
- ↑ Service, Express News (2021-12-30). "V Srinivasa Rao CPM's new Andhra Pradesh state secretary". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2025-07-08.
- ↑ Express News Service (2025-01-31). "CPM State convention in Nellore from February 1". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2025-07-08.
- ↑ Muthe Rajitha (2025-02-03). "AP CPM : ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా వి. శ్రీనివాసరావు". www.dishadaily.com. Retrieved 2025-07-08.
- ↑ "Documents of the 18th Congress of CPI (M) April 6-11, 2005, New Delhi". 2005.
- ↑ "Communist Party of India (Marxist)".
- ↑ "Central Committee Elected at the 21st Congress | Peoples Democracy".
- ↑ "Full list: CPI(M) newly elected central committee and politburo members". 22 April 2018. Archived from the original on 27 November 2024.
- ↑ "New Central Committee & Central Control Commission Elected at the 23rd Congress". Communist Party of India (Marxist).
- ↑ "CPI(M) gears up for struggle against govt. Policies". The Hindu. 7 January 2015.
- ↑ https://www.sakshi.com/index.php/telugu-news/andhra-pradesh/srinivasa-rao-cpm-state-secretary-andhra-pradesh-1423529