Jump to content

వీడు

వికీపీడియా నుండి
వీడు
వీడు సినిమా పోస్టర్
దర్శకత్వంబాలు మహేంద్ర
రచనబాలు మహేంద్ర
కథఅఖిల మహేంద్ర
నిర్మాతకళాదాస్
తారాగణంఅర్చన
భానుచందర్
చంద్రమోహన్
ఛాయాగ్రహణంబాలు మహేంద్ర
కూర్పుబాలు మహేంద్ర
సంగీతంఇళయరాజా
నిర్మాణ
సంస్థ
సాయికళా ఇంటర్నేషనల్
విడుదల తేదీ
1988
సినిమా నిడివి
108 నిముషాలు
దేశంభారతదేశం
భాషతమిళం

వీడు, 1988లో విడుదలైన తమిళ సినిమా. సాయికళా ఇంటర్నేషనల్ బ్యానరులో కళాదాస్ నిర్మాణంలో బాలు మహేంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అర్చన, భానుచందర్, చంద్రమోహన్ ప్రధాన పాత్రలో నటించారు.[1] ఒక మధ్యతరగతి కుటుంబం తన ఇంటిని నిర్మించడానికి చేసే ప్రయత్నంతో ఎదుర్కొంటున్న ఇబ్బందుల నేపథ్యంలో సినిమా రూపొందింది. ఈ సినిమాకు దర్శకత్వంతోపాటు స్క్రిప్ట్, ఫోటోగ్రాఫ్, ఎడిటింగ్ విభాగాల్లో కూడా బాలు మహేంద్ర పనిచేసాడు. ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం సమకూర్చాడు. 1987లో జరిగిన 35వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఈ సినిమాకు జాతీయ ఉత్తమ నటి (అర్చన), ఉత్తమ తమిళ చిత్రం అవార్డులు వచ్చాయి.[2] 12 లక్షల బడ్జెట్‌తో రూపొంది విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 72 లక్షలు వసూలు చేసింది.[3]

నటవర్గం

[మార్చు]
  • అర్చన (సుధ)
  • భానుచందర్ (గోపి)
  • చొక్కలింగ భాగవతార్ (మురుగేశన్‌)
  • పసి సత్య (మంగమ్మ)
  • ఇంధు (ఇంధు)
  • సెంథామరై
  • వీర రాఘవన్
  • రాళ్ళపల్లి
  • ఓరు వైరల్ కృష్ణారావు
  • చంద్రమోహన్
  • నాయర్ రామన్
  • దర్శకుడు బాల (పోస్ట్‌మ్యాన్‌)
  • మీనన్
  • వైరం కృష్ణమూర్తి
  • వెంకటేశ్వరన్
  • ఆటో రాజా
  • అశ్విని శాస్త్రిగల్
  • విజయలక్ష్మి
  • సుశీల
  • బేబీ విజి

అవార్డులు

[మార్చు]
35వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు

చిత్రోత్సవాలు

[మార్చు]

1988లో జరిగిన భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో "ఇండియన్ పనోరమా" విభాగంలో ప్రదర్శించబడిన 16 సినిమాలో ఇదీ ఒకటి.[4] బాలు మహేంద్ర తమిళ సినిమా విభాగంలో ఉత్తమ దర్శకుడిగా సినిమా ఎక్స్‌ప్రెస్ అవార్డును గెలుచుకున్నాడు.[5] 2002లో లోకర్నో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో "ఇండియన్ సమ్మర్" విభాగంలో కూడా ఈ సినిమా ప్రదర్శించబడింది.[6]

మూలాలు

[మార్చు]
  1. "Veedu (1987)". Indiancine.ma. Retrieved 2021-08-07.
  2. 2.0 2.1 Indian Cinema 1988, p. 76.
  3. Baskaran 2013, p. 47.
  4. Indian Cinema 1988, p. 103.
  5. "Cinema Express readers choose Agni Nakshathiram". The Indian Express. Express News Service. 11 March 1989. p. 4.
  6. Rodier, Melanie (28 June 2002). "No Man's Land producer to head Locarno festival jury". Screen International. Retrieved 7 August 2021.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=వీడు&oldid=4213924" నుండి వెలికితీశారు