Jump to content

వీరన్ సుందరలింగం

వికీపీడియా నుండి
వీరన్ సుందరలింగం
ఉత్తరాధికారిబ్రిటిషు పాలన
మరణం1799
తండ్రిపాండియన్ కట్టన కరుప్పనన్
మతంహిందూ

వీరన్ సుందరలింగం (మరణం 1799) తమిళనాడుకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు,[1] రాజకీయవేత్త. అతను వీరపాండ్య కట్టబొమ్మన్ సైనిక దళంలో చేరాడు. తరువాత ఆ దళానికి డిప్యూటీ కమాండర్, కమాండర్ అయ్యాడు.

జననం

[మార్చు]

వీరన్ సుందరలింగం తమిళనాడు, పాంచాలంకురిచి సమీపంలోని గోవర్ణగిరిలో జన్మించాడు. తండ్రి పేరు పాండియన్ కట్టన కరుప్పనన్.[2]

ఉద్యమం

[మార్చు]

వీరపాండ్య కట్టబ్రహ్మన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా పోరాటం చేసినపుడు వీరన్ సుందరలింగం పోలిగర్ జనరల్ గా ఉన్నాడు. 1799లో మొదటి పాలిగర్ యుద్ధంలో కట్టబొమ్మన్ కోసం పోరాడుతున్నప్పుడు వీరన్ సుందరలింగం చంపబడ్డాడని ఒక ఆధారం చెబుతుండగా, రెండవ పాలిగర్ యుద్ధంలో (1800-01) కట్టబొమ్మన్ తమ్ముడు ఊమైతురైకి సహాయం చేస్తున్నప్పుడు చంపబడ్డాడని మరోక ఆధారం చెబుతోంది. 

వారసత్వం

[మార్చు]

తమిళనాడు ప్రభుత్వం 2009లో గోవర్ణగిరిలో సుందరలింగం స్మారక చిహ్నాన్ని నిర్మించడానికి ఉత్తరువులు జారీ చేసింది.[3][4][5][6][7] ఇతడు తమిళనాడు రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ సంఘమైన దేవేంద్రకుల వెలలార్‌కు చెందినవాడు.[8]

మరణం

[మార్చు]

వీరన్ సుందరలింగం 1799లో మరణించాడు.

మూలాలు

[మార్చు]
  1. "Freedom fighter Veeran Sundaralingam Birthday Function News | Thoothukudi District | India". Retrieved 8 September 2021.
  2. Kumar, Ashok (2021-04-16). "Veeran Sundaralingam Kudumbanar, The Army General of Kattabomman". The Commune. Retrieved 8 September 2021.
  3. "Fear, hatred haunts violence-hit southern districts of TN". Rediff. 30 June 1997. Retrieved 8 September 2021.
  4. "Tamil Nadu Budget Speech 2010" (PDF). Government of Tamil Nadu. Retrieved 8 September 2021.
  5. "பூலித்தேவன்: அண்ணன் மு.க....தொடர்ச்சி". Sify. 26 November 2007.
  6. Smita Narula (1999). Broken people: caste violence against India's "untouchables". Human Rights Watch. p. 84. ISBN 9781564322289.
  7. "Policy note on Information and Publicity" (PDF). Government of Tamil Nadu. 2009. Retrieved 8 September 2021.
  8. "Lok Sabha passes bill to place seven castes under Devendrakula Velalars in Tamil Nadu". The Hindu. 19 March 2021. Retrieved 8 September 2021.