వీరమాచనేని రామకృష్ణ
వీరమాచనేని రామకృష్ణ విజయవాడకు చెందిన ఛార్టెడ్ అకౌంటెంట్. అతను "వీరమాచినేని డైట్ ప్లాన్" ను రూపొందించాడు. ఈ ప్లాన్ సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో అనేక మంది ఈ ప్లాన్ ను అనుసరిస్తున్నారు. మనం తీసుకున్న ఆహారంలో కొన్ని మార్పులు చేయడం ద్వారా మధుమేహం, బీ.పీ, ఊబకాయం వంటి జీవనశైలి వ్యాధులను నయం చేయవచ్చని అతను తెలియజేసాడు.[1] అతను మందులతో పని లేకుండ డయాబెటిస్, ఎలాంటి శస్త్ర చికిత్సతో పని లేకుండ,డైట్ తగ్గించే పని లేకుండ ఒబెసిటీని తగ్గించవచ్చంటున్నారు. తెలుగు రాష్ట్రాలలో ఈయన చెప్పిన డైట్ ను కొన్ని లక్షల మంది ఫాలో అవుతున్నారు.చాలా మంది బరువు తగ్గుతున్నారు.షుగరు పేషంట్లు మందులతో పని లేకుండా షుగరు తగ్గించుకోగలగుతున్నారు.[2]
జీవిత విశేషాలు
[మార్చు]కామర్స్ చేసి వృతి రీత్యా బిజినెస్ లో స్థిరపడ్డ రామకృష్ణగారు తన బరువును తగ్గించుకునే ప్రయత్నంలో రకరకాల పద్ధతులను ప్రయత్నించి విసిగి అనేక రకాల పద్దతులను స్టడీ చేసి చివరకు ఒక డైట్ ప్లాన్ రెడీ చేసుకుని ఆ డైట్ ను పాటించి 120 కిలోల బరువు నుండి 90 కిలోల బరువుకు తగ్గాడు. అంతేకాకుండా తన స్నేహితులతో ఈ డైట్ ప్లాన్ చేయించి వారికున్న ఒబెసిటీ,డయాబెటిస్ లను తగ్గించగలిగాడు. ఈ ప్రేరణతో అతను ఒక డైట్ ప్లాన్ ను రూపొందించాడు.[3]
డైట్ ప్లాన్
[మార్చు]అతని డైట్ ప్లాన్ ప్రకారం వంటలకు కొబ్బరినూనె, నెయ్యి, ఆలివ్ ఆయిల్, పెరుగు మిద మీగడ, వెన్న, ఛీజ్, సముద్రపు ఉప్పు వాడాలి. శాకాహారులు, మాంసాహారులు ఇద్దరికీ అనుకూలమైన రీతిలో నాలుగు పిల్లర్స్ గా ఈ ప్రోగ్రాం ను రూపొందించాడు[1].
తీసుకోదగినవి
[మార్చు]- పంచదార లేకుండా టీ, కాఫీ—– పాలు
- గ్రీన్ టీ, బుల్లెట్ ఫ్రూఫ్ కాఫీ
- ఉప్పులేకుండా సోడా రోజుకు అర లీటరు
- మజ్జిగ (రెండు స్పూన్ల పెరుగుతో ఒక లీటర్ నీటితో తయారు చేసుకోవడం)
- గోరుచిక్కుడు, గుమ్మడికాయ, కాకరకాయ, బెండకాయ, వంకాయ, దొండకాయ, క్యాప్సికం, దోసకాయ, మునగకాయ, మునగాకు కూర, మునగాకు సూపు, అన్నిరకాల ఆకుకూరలు శాఖాహారానికి పరిమితి లేదు. తినగలిగితే కేజీ తినవచ్చు.
- పాక్షికంగా తినాల్సినవి
- రోజు మొత్తంమీద
- టమాటా పెద్దది -1 లేదా చిన్నవి – 2
- క్యారెట్-1
- ఉల్లిగడ్డ- 1
- కీరదోస అధికంగా నీరు ఫైబర్ ను కలిగి ఉంటుంది కనుక పరిమితి లేకుండా తీసుకోవచ్చు.
- ముదురు కొబ్బరి లేదా ఎండుకొబ్బరి ఒక చిప్పవరకు తీసుకోవచ్చు.
- పాలు,పెరుగు తీసుకోకూడదు ( కానీ సొరకాయ, బీరకాయ, తోటకూర కాడలు వంటివి వండుతున్నప్పుడు కొద్దిగా పాలు రుచికోసం వాడుకోవచ్చు.[4]
తీసుకోకూడనివి
[మార్చు]- ఇడ్లీ, దోశ, ఉప్మా, చపాతి, పూరి, పరోట, వడ, గారే, బోండా, బజ్జీలు….. మొదలగు పిండి పదార్థాలు
- వైట్ రైస్, బ్రౌన్ రైస్ (ముడిబియ్యం), జొన్నలు ,రాగులు, బార్లీ, ఓట్స్, గోధుమలు, మొక్కజొన్నలు, సజ్జలు, కొర్రలు, అరికలు, వరిగెలు, సామలు,కినోవా, అన్నిరకాల పప్పులు మొదలగునవి
- ఎటువంటి పళ్ళు, పళ్లరసాలు
- దుంపలు: బంగాళదుంప, చేమగడ్డ, కందగడ్డ, బీట్రూట్, కూర అరటి, చిలగడదుంప(గణ సగడ్డ),పెండలం, నాటు చిక్కుడు, బీన్స్, పచ్చిబఠాని
- ఆల్కహాల్, కూల్ డ్రింక్స్
- ధూమపానం ఈ కార్యక్రమానికి అంతరాయం కలిగించదు కాదు – కానీ శరీరమంతా బాగుపడి గుండె కు రంధ్రాలు పడటంవల్ల ఉపయోగం లేదు కావున మానేయడం ఉత్తమం.
- బెల్లం, తేనే, పంచదార, తీపి పదార్థాలు, బిస్కెట్లు, చాక్లెట్లు, ప్రసాదం, తీర్థం, కొబ్బరినీరు, లేత కొబ్బరి
- పనసకాయ కూర కూడా వండుకొనకూడదు.
- చింతపండు, చింత చిగురు వాడరాదు.
- మీల్ మేకర్, పచ్చి మామిడికాయలు,పుచ్చకాయ తినకూడదు.
- సబ్జా గింజలు, చియా సీడ్స్ వాడరాదు.
- ఎటువంటి ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకో కూడదు.
- సుగర్ కోటెడ్ మల్టీ విటమిన్ టాబ్లెట్ వాడకూడదు.
- ఆయుర్వేద మందులు తీయదనాన్ని కలిగి ఉంటాయి కనుక వాడరాదు.
- పిల్స్ రూపంలో ఉన్న హోమియో మందులు కూడా వాడరాదు. (తప్పనిసరైతే ద్రవరూపంలో ఉన్న, టింక్చర్ రూపంలో ఉన్న హోమియో మందులు వాడవచ్చు)[4]
వైద్యుల వ్యతిరేకత
[మార్చు]ఎక్కువమంది డాక్టర్లు ఈ వీరమాచినేని డైట్ ప్లాన్ కు వ్యతిరేకులే. కారణం అది వైద్య ప్రమాణాలకు అనుగుణంగా సైంటిఫిక్ గా ప్రామాణికమైనది కాకపోవడం, ఆ డైట్ వాడితే అన్ని సమస్యలు పోతాయి, ఇక డాక్టర్లకు డబ్బు తగలేయక్కర్లేదు అన్నట్లుగా ప్రచారం జరుగుతుండటం అనే ప్రధాన కారణాల చేత వైద్యులు ఈ డైట్ ప్లాన్ అంటేనే వ్యతిరేకిస్తున్న పరిస్థితి. అయితే అందనూ వ్యతిరేకంగా కాకుండా కొందరు సానుకూలంగానూ చెబుతున్న వైద్యులు కూడా ఉన్నారు. ఈ కీటో డైట్ అనేది అందరికీ సూట్ కాదని, కొంతమందిలో తీవ్రమైన దుష్ప్రలితాలు తప్పవనేది వైద్యుల హెచ్చరిక. పైగా ఈ కీటో డైట్ అందరిలోనూ ఒకే రకమైన ఫలితాలు ఇవ్వవని, శరీర తీరును బట్టి దాని ఫలితాలు వేరువేరుగా ఉంటాయని చెబుతున్నారు. అది షుగర్ పేషెంట్లలో కిడ్నీలు పాడయ్యేందుకు, షుగర్ లెవల్స్ పెరిగేందుకు కారణం అవుతుందని అంటున్నారు. అంతేకాదు ఇన్సులిన్ సెన్సిటివిటీని మరింత పెంచే అవకాశాలు ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. క్రానిక్ షుగర్ పేపెంట్లలో ఈ డైట్ వాడకం ప్రాణాలతో చెలగాటమంటున్నారు. పైగా ఈ కీటోజెనిక్ డైట్ దీర్ఘకాలంలో వాడటానికి అదీ నిపుణుల పర్యవేక్షణలో అవలంబిస్తేనే సత్పలితాలు ఇవ్వడానికి అవకాశం ఉందంటున్నారు. వీటితో పాటు వీరమాచినేని రూపొందించిన డైట్ ఆయన సొంత ఫార్మాలా లాగా ఉందని, అది వైద్య శాస్త్రం నిర్థారించింది కాదని చెబుతున్నారు.[5] తాను వైద్యుడిని కానని సామాజిక చైతన్యం తీసుకొచ్చే కార్యకర్తను మాత్రమేనని, జీవన విధానం, వైద్య విధానం వేర్వేరు ప్రక్రియలని, కిడ్నీలు చెడిపోవడానికి మధుమేహం ఎంత మాత్రం కారణం కాదని రామకృష్ణ తెలియజేసాడు. తాను చేసే ఆరోగ్య విధానం రోగాలను నయం చేస్తుందే తప్ప అనారోగ్యానికి గురి చేయదని స్పష్టం చేశాడు. ఈ విధానం ద్వారా కిడ్నీ చెడిపోయిందని నిరూపిస్తే జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధమేనని చెప్పాడు.[6]
వీరమాచనేని రామకృష్ణ చేసిన కీటో డైట్ ప్రచారం షుగర్ డాక్టర్లకు పెద్ద తలనొప్పిగా మారిందనే చెప్పాలి. దీనిపై సంయమనం పాటిస్తూ కాలం గడిపేస్తున్నారు. మొదట్లోనే వీరమాచినేని చెప్పిన ఆహార పద్ధతులపై అల్లోపతి డాక్టర్లు తీవ్ర విమర్శలు చేశారు. వైద్యుల పర్యవేక్షణ లేకుండా షుగర్ రోగులు కీటో డైట్ పాటిస్తే కిడ్నీలు పాడవుతాయని, షుగర్ లెవల్స్ పెరుగుతాయని ప్రకటించారు. గుంటూరులో జరిగిన ఏపీ డయాబెటిస్ ఫెడరేషన్ సదస్సులో ఏకంగా కొంతమంది సభ్యులు వీరమాచనేనిపై తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు. అతడిని నకిలీ డాక్టర్‌గా పరిగణించి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అయితే కీటో డైట్ సరైంది కాదని నిరూపిస్తే.. ఏ శిక్షకైనా సిద్ధమని వీరమాచినేని సవాల్ విసిరారు. దీనిపై వైద్యవర్గాల నుంచి స్పందన లేదు.[7]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "మూడు నెలల్లో మధుమేహం మాయం... అమరావతిలో వైద్యుడు కాని వైద్యుడి సలహా".
- ↑ ""వీరమాచినేని" వారి డైట్". Archived from the original on 2018-06-23. Retrieved 2018-07-13.
- ↑ "CA's diet plan to control diabetes, cut down weight is a rage in vijaytawada".
- ↑ 4.0 4.1 "శ్రీ వీరమాచనేని రామకృష్ణ గారి విధానంలో తీసుకోదగినవి, తీసుకోకూడనివి". Archived from the original on 2018-07-09. Retrieved 2018-07-13.
- ↑ "డాక్టర్లకు బిపి పెంచుతున్న..."వీరమాచినేని డైట్ ప్లాన్":పేషెంట్ల ప్రశ్నలతో సతమతం".
- ↑ "నిరూపిస్తే జైలుకెళ్తా : వీరమాచనేని".
- ↑ "కీటో.. అటో, ఇటో!".[permanent dead link]