వీరాస్వామి శేషయ్య
వీరస్వామి శేషయ్య రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్‌లో ఫెలో (FRCP) | |
---|---|
జననం | 1938 మార్చి 10 |
పురస్కారాలు | పద్మశ్రీ (2022) డా. బి.సి.రాయ్ అవార్డు (1988) |
వీరాస్వామి శేషయ్య ఒక భారతీయ వైద్యుడు, మధుమేహ వ్యాధి నిపుణుడు.[1] మద్రాసు మెడికల్ కళాశాలలో మధుమేహ విభాగాన్ని ఏర్పాటు చేసాడు. చెన్నై లోని డయాబెటిస్ ఇన్ ప్రెగ్నెన్సీ స్టడీ గ్రూప్ ఇండియా (డిఐపిఎస్‌ఐ) వ్యవస్థాపకుడు. భారత సైన్యంలో వైద్య దళంలో చేరి, భారత పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొన్నాడు.
జీవిత విశేషాలు
[మార్చు]వీరాస్వామి శేషయ్య 1938 మార్చి 10 న చెన్నైలో, వీరాస్వామి, భువనమ్మలకు జన్మించాడు.
1957 లో మద్రాసు మెడికల్ కాలేజీలో చేరి 1962లో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. 1963 లో అతను ఆర్మీ మెడికల్ కార్ప్స్‌లో చేరాడు. భారత పాకిస్తాన్ యుద్ధంలో పనిచేశాడు. సైన్యంలో అతని సేవలకు గాను అతనికి సమర్ సేవా స్టార్, సైన్య సేవా పతకాన్ని అందుకున్నాడు.[2][3]
సైన్యంలో సేవ తరువాత, శేషయ్య స్టాన్లీ మెడికల్ కాలేజీలో చేరి, MD పట్టా పొందాడు. మద్రాసు మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియమితుడయ్యాడు. 1978 లో అతను ఆ కళాశాలలో మధుమేహ విభాగాన్ని ప్రారంభించాడు[4]
చెన్నైలోని స్త్రీలు, పిల్లల ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భం, మధుమేహ విభాగాన్ని స్థాపించడంలో కూడా అతను కృషిచేసాడు.[5] డయాబెటిస్ ఇన్ ప్రెగ్నెన్సీ స్టడీ గ్రూప్ ఇండియా (డిఐపిఎస్‌ఐ) వ్యవస్థాపకుడు, 2004 నుండి దాని పోషకుడు.[6]
జాతీయ GDM అవేర్‌నెస్ డే 2019 లో భారత ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ జాతీయ జిడిఎం అవగాహనా దినాన్ని ప్రారంభించబడింది. మహిళల ఆరోగ్యంపై గర్భధారణ సమయంలో మధుమేహం కలిగించే గణనీయమైన ప్రభావాన్ని గుర్తించి, ఈ కీలకమైన చర్య తీసుకుంది. ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ప్రొ. శేషయ్య జన్మదినమైన మార్చి 10 ను భారత GDM అవేర్‌నెస్ డేగా ప్రకటించింది.[7]
సీనియర్ డయాబెటాలజిస్టులు గర్భధారణ సమయంలోమధుమేహాన్ని నివారించడానికి గర్భపు 8 వ వారంలో మెట్‌ఫార్మిన్‌ను ఉపయోగించాలని సూచించారు.[8] పిండం నుండి ఇన్సులిన్ స్రావం ప్రారంభమైనప్పుడు, తల్లి జీవక్రియలో మార్పులు సంభవిస్తాయని డాక్టర్ శేషయ్య చెప్పాడు. హైపర్‌గ్లైసీమియా వలన తరువాతి జీవితంలో నాన్-కమ్యూనికేబుల్ వ్యాధులు కలుగుతాయి. కాబట్టి గర్భధారణ సమయంలో మధుమేహాన్ని నివారించి, వారసత్వంగా వ్యాపించకుండా చూడాలి.[9]
భారత మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, 2022 లో డాక్టర్ వీరాస్వామి శేషయ్యకు వైద్య రంగంలో పద్మశ్రీ పురస్కారం అందించాడు.[10]
పురస్కారాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ https://www.alumnimmc.com/nwhalloffame/dr-seshiah
- ↑ Video | Independence Day Special: Meet Dr Veeraswamy Seshiah, Padma Shri Awardee and Diabetologist, retrieved 2023-08-19
- ↑ "The Padma Shri awardees from Tamil Nadu this year". The Indian Express (in ఇంగ్లీష్). 2022-01-25. Retrieved 2023-08-19.
- ↑ Network, eHealth (2022-01-27). "Padma Bhushan awarded to Covid-19 vaccine makers - Elets eHealth". eHealth Magazine (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-08-19.
- ↑ "Late CDS Bipin Rawat, Kalyan Singh and Ghulam Nabi Azad among Padma awardees | Full list here". India Today (in ఇంగ్లీష్). Retrieved 2023-08-19.
- ↑ https://dipsi.in/committee/
- ↑ https://www.worlddiabetesfoundation.org/news/india-marks-first-national-gdm-awareness-day
- ↑ https://www.thehindu.com/news/national/tamil-nadu/senior-diabetologist-advocates-use-of-metformin-by-8th-week-of-pregnancy-to-prevent-gestational-diabetes/article67734900.ece
- ↑ https://www.cureus.com/articles/117629-prediction-and-prevention-of-gestational-diabetes-mellitus-and-its-sequelae-by-administering-metformin-in-the-early-weeks-of-pregnancy#!/metrics
- ↑ https://www.youtube.com/watch?v=1Ls4UYkpUlE
- ↑ https://en.wikipedia.org/wiki/List_of_Padma_Shri_award_recipients_(2020%E2%80%932029)