Jump to content

వీశ

వికీపీడియా నుండి

వీశ అనే మాట బరువును సూచించటానికి వాడేవారు. ప్రస్తుతం ఉన్న కిలోగ్రాములు మెట్రిక్ విధానం రాక పూర్వం, వీశలు, మణుగులు ద్వారా బరువులను కొలిచేవారు. ఏబులము అన్నిటికన్నా తక్కువ బరువు కలది, మణుగు అన్నిటికన్నా ఎక్కువ బరువు కలది. .

భారమానము
4 ఏబులములు = 1 వీశ
2 ఏబులములు = 1 అర వీశ
2 అరవీశలు = 1 వీశ
8 అరవీశలు = 1 మణుగు
20 మణుగులు = 1 బారువా

రెండు సవాశేర్లు అరవీశ, అదే లెక్కన నాలుగు సవాశేర్లు కూడా ఒక వీశ, మూడు సవాశేర్లు ముప్పావు వీశ అవుతాయి. రెండు అరవీశలు వీశ అవుతాయి. దాదాపుగా 1970ల మొదటిరోజులవరకూ కూడా కూరలు మొదలైనవి ఈ లెక్కలోనే అమ్మేవారు. వాటికి సరిపొయ్యే సవాశేరు, ఆరవీశ, వీశ రాళ్ళు, గుండ్రంగా ఉన్నవి ఉండేవి.

"https://te.wikipedia.org/w/index.php?title=వీశ&oldid=4317150" నుండి వెలికితీశారు