Jump to content

ఊళ్ళపాలెం

అక్షాంశ రేఖాంశాలు: 15°14′12.336″N 80°4′16.500″E / 15.23676000°N 80.07125000°E / 15.23676000; 80.07125000
వికీపీడియా నుండి
(వూల్లపాలెం నుండి దారిమార్పు చెందింది)
ఊళ్ళపాలెం
గ్రామం
పటం
ఊళ్ళపాలెం is located in ఆంధ్రప్రదేశ్
ఊళ్ళపాలెం
ఊళ్ళపాలెం
అక్షాంశ రేఖాంశాలు: 15°14′12.336″N 80°4′16.500″E / 15.23676000°N 80.07125000°E / 15.23676000; 80.07125000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం
మండలంసింగరాయకొండ
అదనపు జనాభాగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )

ఊళ్ళపాలెం ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామ చరిత్ర

[మార్చు]

శతాబ్దాల చరిత్ర గలిగిన గ్రామం ఇది. బ్రిటిష్ వారికాలంలో ఉప్పు వ్యాపారానికి ఆయువుగా నిలిచిన ప్రాంతం.

సమీపగ్రామాలు

[మార్చు]

బింగినిపల్లి =2.2 కి.మీ; పాకాల=3.1 కి.మీ; సోమరాజుపల్లి=4.1 కి.మీ; సింగరాయకొండ=5.7 కి.మీ; కరేడు=6.8 కి.మీ.

విద్యాసౌకర్యాలు

[మార్చు]

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:- ఈ పాఠశాలలో 2015, జూలై-17వ తేదీనాడు, ఒంగోలు జిల్లా అథ్లెటిక్స్ మీట్ నిర్వహించి, బాలబాలికలకు అండర్-14 విభాగంలో పోటీలు నిర్వహించెదరు. ఈ పోటీలలో ప్రతిభ చూపిన విద్యార్థులు, విశాఖపట్నంలో నిర్వహించబోయే 19వ జాతీయ, అంతర్ జిల్లాల అథ్లెటిక్స్ పోటీలలో పాల్గొనేందుకు అర్హత సాధించెదరు.

గ్రామ పంచాయతీ

[మార్చు]

మొదట ఈ గ్రామంలో సగభాగం బింగినిపల్లిలోనూ, సగభాగం పాకాల పంచాయతీలోనూ ఉండేవి. 1981లో ఈగ్రామాన్ని ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు చేశారు. అచ్చకాలవ నరసింహారావు ఈ గ్రామానికి మొదటి సర్పంచిగా 1981లో ఎన్నికై 1983 వరకూ పనిచేశారు. 1983 నుండి 1988 వరకూ ఉపసర్పంచి మూలగాని వెంకట కృష్ణారావు ఇన్ ఛార్జి సర్పంచిగా పనిచేశారు. 1988 నుండి 1989 వరకూ కోసూరి ఓబయ్యనాయుడు సర్పంచిగా పనిచేశారు. ( వీరు 1989 లో అనారోగ్యంతో మరణించారు). అనంతరం జరిగిన ఉప ఎన్నికలో పీ.వీ.రెడ్డి సర్పంచిగా ఎన్నికై 1989 నుండి 1995 వరకూ పనిచేశారు. 1995 నుండి 2006 వరకూ గొల్లపోతు రాఘవులు రెండు దఫాలుగా ఎన్నికై సర్పంచిగా పనిచేశారు. 2006 ఎన్నికలలో బాయిరెడ్డి వెంకటమురళీధర్, సర్పంచిగా గెలుపొందారు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

శ్రీ కోదండరామస్వామివారి ఆలయం:- ఈ ఆలయం తీరప్రాంత ఆలయాలలో పేరెన్నికగన్నది. సింగరాయకొండ వరాహ లక్ష్మీనరసింహుని ఆలయం తరువాత, బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించే ఆలయం ఇది. బ్రహ్మోత్సవాలు జరిగినన్ని రోజులూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించెదరు. వీటిని తిలకించేటందుకు భక్తులు అన్నిప్రాంతాలనుండి విచ్చేస్తారు. ఈ ఆలయానికి గతంలో ఊళ్ళపాలెం, బింగినపాలెం గ్రామాలలో సుమారు 21.78 ఎకరాలు, ఈతముక్కల, మన్నూరు గ్రామాలలో సుమారు 17.65 ఎకరాలు, చెన్నైలోని గృహాల నుండి లీజులు వస్తుండేవి. ఇప్పుడు ఈ ఆలయ భూములు అన్యాక్రాంతమైనవి.

మూలాలు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]