వృక్ష శాస్త్రజ్ఞుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొప్పుల హేమాద్రి - వృక్ష శాస్త్రవేత్త

వృక్షశాస్త్రాన్ని గురించి పరిశీలన చేయడానికి పూనుకున్న వ్యక్తిని వృక్ష శాస్త్రజ్ఞుడు అంటారు. వృక్ష శాస్త్రవేత సూక్ష్మజీవరాశి, మహా వృక్షాలు మొక్క యొక్క మొత్తం జీవితాన్ని అధ్యయనం చేస్తాడు. వృక్ష శాస్త్రవేతలు అన్ని ప్రదేశాలలో మొక్కల గురించి తెలుసుకుంటూ వీరు మొక్క అన్వేషకులుగా ఉంటారు. వీరు (అమ్ల వర్షం వంటి) కాలుష్య ప్రభావాలపై అధ్యయనం చేసి దాని నివారణ కొరకు మొక్కలపై సమర్ధమైన పనిచేసి పర్యావరణ రక్షణ కొరకు తోడ్పడతారు. కొత్త మొక్కలను గుర్తించి వాటిని పరిశీలించి వాటి యొక్క భాగాలు వాటి వలన ఉపయోగాలను తెలియజేస్తారు. కొందరు శాస్త్రవేతలు ఏక కణంతో మొక్కలను సృష్టించడానికి ప్రయత్నిస్తారు. దీనినే సాంకేతిక పరిభాషలో టిష్యూ కల్చర్ అంటారు అనగా కణజాల ప్రవర్ధన విధానం. మరికొందరు జీవ సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించి కొత్త మొక్కలను సృష్టించడం లేక ఉన్న వాటిని మెరుగు పరచడం చేస్తుంటారు. కొందరు శాస్త్రవేతలు ఉద్యోగ రీత్యా విద్యాసంస్థలలో వృక్ష శాస్త్రవేతలుగాను, ఉపాధ్యాయులగాను, పరిశోధకులుగాను పనిచేస్తుంటారు. మరికొందరు వృక్ష శాస్త్రవేతలు నూతనమైన చెట్లను పెంచే తోటలలోను అనగా బొటానికల్ గార్డెన్స్ లోను, సేకరణ వనాలలోను, మూలికా వనాలలోను, జంతు ప్రదర్శన శాలలోను, ఔషధ మొక్కల లేక విత్తన సేకరణ ఆశ్రయ ప్రయోగశాలలోను పనిచేస్తుంటారు. మరికొందరు వృక్ష సంబంధిత పరిశ్రమలైన జీవ సంబంధ సరఫరా గృహములలోను, జీవ సాంకేతిక విజ్ఞాన వ్యాపార సంస్థలలోను, ఔషధీయ సంస్థలలోను, నర్సరీ లేక హరిత గృహ వ్యాపార సంస్థలలోను, రసాయనిక సంస్థలలోను పనిచేస్తుంటారు. మరికొందరు ప్రచురణ విభాగాలలోను, అమ్మకాల విభాగాలలోను, జంతు లేక మొక్క ఆరోగ్య తనిఖీ విభాగాలలోను పనిచేస్తుంటారు. వృక్ష శాస్త్రవేత వృక్ష శాస్త్రంలో కళాశాల నుండి పట్టాని పొంది ఉంటాడు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]