Jump to content

వెణుతురుబల్లి విశ్వనాధకవి

వికీపీడియా నుండి

వెణుతురుబల్లి విశ్వనాధకవి 16 వ శతాబ్దానికి చెందిన కవి. విశ్వనాధ కవి ఆర్వేల నియోగి వెంకటామాత్యుల వారి కొడుకు [1]

ద్రౌపదీ పరిణయం అనే ప్రభంధమును రచించిన ఏనుగు పెదలక్ష్మణ కవి గారికి మేనమామ

రచనలు

[మార్చు]

పెద్దాపురం సంస్థానమును చతుర్భుజ తిమ్మ జగపతి గారు పరిపాలించే కాలంలో 1600 ప్రాంతం వాడగు శేష ధర్మములు అనే పద్య కావ్యమును రచించి గారికి అంకితం ఇచ్చారు
ఇతను శ్రీరామ విజయము అనే యక్ష గానం -
గౌరీ వివాహం అనే ద్విపద ప్రభందము ను
హరీశ్చంద్ర చరితము అనే నిర్దోష్ట్య ప్రభందము ను
పారిజాతాపహరణం ను సంస్కృతం లోనూ రచించినారు. [2]

దురదృష్టవ శాత్తూ ఈయన రచించిన గ్రంధాలన్నీ కూడా కాల గర్భంలో కలిసిపోయినవి కానీ ఏనుగు లక్ష్మన కవి గారి గ్రందాల ద్వారా వెణుతురు బల్లి విశ్వనాధ కవి గారి గొప్పతనాన్ని తెలుసుకొనవచ్చు

శేషధర్మములు

[మార్చు]

శా. మాయావిప్రుల కాద్విజుండు కడిగెన్ బాదా బుజద్వంద్వముల్
చేయూరం గునుమాక్షతాదులను బూజించెం బాత్రము ల్వైచె న
ట్లాయాపాత్రములందు నన్నము లిడన్ నారంభు డౌనంతలో
నాయింద్రుండు గృహస్థుజూచి పలికెన్ సాక్షేపపూర్వంబుగన్. ఆ.1.

ఉ. కాలినయిర్పగుండ్ల మఖగహ్వరభాగములందు గ్రుక్కుచున్
సోలుపు లేర్పడ న్మెఱుగుసుదులు కన్నుల గ్రుచ్చుచుం దలల్
నెలకు జేర్చి పాదములు నింగికి నెత్తుచు బెక్కుజాడలన్
గాలభటు ల్వెతిల్గుడుపగా బడియుండుదు రంతమీదటన్. ఆ.3.

మూలాలు

[మార్చు]
  1. ఆంధ్ర కవుల చరిత్రము, మూడవ భాగములో పేర్కొన్న కవులు, పేజీ 12,13
  2. ఆంధ్ర సంస్థానములు - సాహిత్య పోషణము, ముఖ్య సంస్థానములు - పెద్దాపురం, డా. తూమాటి దొప్పన్న, పేజీ 269