వెదురుగూమి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వెదురుగూమి అనగా వెదురు చెట్లు. వెదురు చెట్లు ఎప్పుడు ఒక్కొక్కటిగా వుండవు. అవి కొన్ని కలిసి ఒక గుంపుగా ఏర్పడుతాయి. వాటిని వెదురుగూమి అంటారు. ఈ గుంపులో పదుల నుండి వందల సంఖ్యలో వెదురు చెట్లు వుంటాయి. వెదురు వృక్షాలలో అత్యంత వేగంగ పెరిగే జాసి. ఒక రోజులో సుమారు ఒక అడుగు ఎత్తు వరకు పెరుగుతాయి.

సాగు విధానము, ఉపయోగము

[మార్చు]
వెదురు గూమి

ఇదివరకు వీటిని ప్రత్యేకించి పెంచే వారు కాదు. అవి అడవి మొక్కలు. వాటంతట అవే అడవులలో పెరుగుతాయి. ప్రస్తుతం రైతులు వెదురు మొక్కలను తమ పొలాలలో కంచెగాను పెంచుతున్నారు. వీటిలో అనేక రకాలున్నాయి. సన్నవి, లావుపాటివి మొదలయినవి. వీటి ఉపయోగము రైతులకు ఎంతో ఉంది. తమకు కావలసిన బుట్టలు, గంపలు, తట్టలు మొదలగు వాటిని వెదురు బద్దలతో అల్లించుకునే వారు. అదే విధంగా పూరిళ్ళు కట్టుటకు వెదురు కఱ్ఱలు ఎంతో ఉపయోగపడతాయి. వెదురు బద్దలతో బుట్టలు, తట్టలు అల్లే చేతివృత్తి వారిని మేదరులు అంటారు. ఇవి ఎడారి మొక్కలు. అన్ని రకాల నేలలలో పెరుగుతాయి. వీటికి ప్రత్యేకించి నీటి వసతి అవసరం లేదు.

అడవుల్లో సహజసిద్ధంగా పెరిగే వెదురుకు ఇప్పుడు భారీ డిమాండ్ ఏర్పడింది. విద్యుత్ ఉత్పత్తికోసం థర్మల్ ప్లాంట్లు బొగ్గును వినియోగించడం వల్ల కాలుష్యం విపరీతంగా విడుదల అవుతోంది. దీంతో విద్యుత్ ప్లాంట్లు కనీసం ఏడు శాతం మేర బొగ్గుకు బదులు వెదురు పిల్లెట్లను వినియోగించాలంటూ కేంద్ర ప్రభుత్వం నూతన విధానాన్ని తీసుకొచ్చింది. దీంతో ఒక్క తెలంగాణలోనే విద్యుత్ ప్లాంట్లకు సుమారు 25 లక్షల టన్నుల మేర వెదురు బొంగులు కావాల్సి వస్తుందని ఉద్యానవన శాఖ అంచనా.[1]

అనాదిగా మనకు సుమారు 1500 రకాలుగా వెదురు ఉపయోగపడుతున్నట్లు అంచనా. అయితే, మన దేశంలో వెదురు ఇన్నాళ్లూ సంరక్షించదగిన అటవీ చెట్ల జాబితాలో ఉంది. అందుకని, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అటవీ చెట్ల జాబితాలో నుంచి తొలగించింది. దీంతో పొలాల్లో వెదురు తోటలు సాగు చేయడానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "'వెదురే' బంగారమాయెనా". EENADU. Retrieved 2022-02-20.