వెనుకబడిన క్షత్రియ కులాలు
పరిచయము
ఆంధ్రప్రదేశ్లో వీరిని బి.సి గ్రూపులుగా పరిగణింపబడుచున్నారు. వాస్తవానికి వీరు వెనుకబడిన క్షత్రియులు.
పెరిక క్షత్రియులు
పెరిక అనేది తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, చత్తీస్ గడ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో కనిపించే ఒక కులము. ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా బి గ్రూపులో 15 వ కులం. ఇది వెనుకబడిన క్షత్రియ ఉప కులమని చెప్పవచ్చు. వృత్తిరీత్యా వీరు వ్యవసాయదారులు, భూస్వాములు. సంస్కృతంలో వ్యాపారక్ అను పదమునుండి పెరిక అను పదము వచ్చినదని పలువురి అభిప్రాయం. వీరిలో ఐఏఎస్‌లు, ఐపిఎస్‌లు కూడా ఉన్నారు. హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో పెఱిక భవన్‌లో ఈ కులస్థులకు వసతి కల్పించి విద్యావంతులను చేస్తున్నారు. పెఱిక వారిది వ్యవసాయ వృత్తి. వ్యాపార వస్తువులను సంచుల్లో నింపి ఎడ్ల వీపుపైన అటొక సంచి, ఇటొక సంచి వేసి అలా వందల ఎడ్లను అదిలించుకుంటూ వందల మైళ్ళ దూరాలలో ఉన్న వ్యాపార కేంద్రాలకు చేరవేసే వారిని పెరికపూత్తువారు అనేవారు. ‘పెరిక’ అంటే ఎడ్ల వీపుపై రెండు వైపులా వేలాడదీసిన రెండు వస్తువుల సంచుల ప్రమాణం. పెరికపూత్తు వారు గుర్రాలు, ఎడ్ల బండ్లపైన కూడా సరుకులను వ్యాపార కేంద్రాలకు చేరవేసేవారు.
భవసార క్షత్రియులు
ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా డి గ్రూపులోని 26వ కులం. భవసారులు గుజరాత్ , మహారాష్ట్ర , రాజస్థాన్, మధ్య ప్రదేశ్, కర్నాటక, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో కనిపిస్తారు. బట్టలకు రంగులు వేయడం, టైలరింగు చేయడం వీరి ప్రధాన వృత్తి గనుక వీరిని రంగ్రేజు రంగరాజ్ రంగురాజులు అనికూడా పిలుస్తారు.
పరశురాముడి క్షత్రియ వధ నుండి తప్పించుకొని హింగులాంబిక అను దేవత గుడిలో తలదాచుకొన్న క్షత్రియులే భవసారులని, కనుక భవసారులు క్షత్రియవర్ణానికి చెందినవారని సిద్ధాంతం ఉంది. సూరత్కు చెందిన భవ సింగ్, సర సింగ్ అను యువరాజులు భవసార సమాజాన్ని నెలకొల్పారని కూడా కథనం ఉంది. చరిత్ర ప్రకారం వీరు సింధు (పాకిస్తాన్ ప్రాంతం) నుండి వచ్చినవారు. అయితే వీరు క్షత్రియ వర్ణానికి చెందినవారని చెప్పుటకు ఎటువంటి చారిత్రాత్మక ఆధారాలు లేవు.
మూలాలు
https://web.archive.org/web/20190111060512/http://sathyakam.com/pdfImageBook.php?bId=10903#page/38 ★అగ్నివంశపురాజులు★ ★కళిశక విజ్ఞానము 3★ పుస్తకములు రాసినవారు చరిత్ర పరిశోధకులు బహు గ్రంధ కర్త శ్రీమాన్ పండిట్ కోటావెంకటాచలం గారు. అగ్నికులక్షత్రియులు శూద్రులు అనడానికి చారిత్రక ఆధారాలు లేవు.