Jump to content

వెర్నర్ హైసెన్‌బర్గ్

వికీపీడియా నుండి
హైసన్ బర్గ్

వెర్నర్ హైసెన్బర్గ్ (డిసెంబరు 5, 1901 – ఫిబ్రవరి 1, 1976) జర్మనీకి చెందిన ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త. క్వాంటమ్ యాంత్రిక శాస్త్రాన్ని అభివృద్ధి చేసిన వారిలో ప్రధానమైన వాడు. 1925 లో తన సిద్ధాంతాల్ని ప్రచురించడం ప్రారంభించాడు. 1927 లో ఆయన ప్రతిపాదించిన అస్థిరత్వ నియమంతో శాస్త్రపరిశోధనలో ఖ్యాతి గడించాడు. 1932 లో క్వాంటం యాంత్రిక శాస్త్రాన్ని సృష్టించినందుకు గాను ఆయనకు నోబెల్ బహుమతి లభించింది. [1] ఆయన ఇంకా అణుకేంద్రకం, ఫెర్రోమాగ్నటిజం, విశ్వకిరణాలు, అణువుకన్నా సూక్ష్మమైన కణాలు లాంటి విషయాలపై పరిశోధన చేశాడు. పశ్చిమ జర్మనీలో మొట్టమొదటి అణు రియాక్టరుకు, 1957 మ్యూనిక్ లో ఒక ప్రయోగాత్మక రియాక్టరుకు ప్రణాళిక తయారు చేశాడు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఆయన అణువులపై చేసిన పరిశోధనపై కొంత వివాదం కూడా నెలకొని ఉన్నది.

యుద్ధం అయిపోయిన తరువాత కైజర్ విల్హెహ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ కి డైరెక్టరుగా నియమితుడయ్యాడు. దీని పేరే తరువాతి కాలంలో మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఫిజిక్స్ గా మార్చబడింది.

ఆయన జర్మన్ రీసెర్చి కౌన్సిల్ కి అధ్యక్షుడిగానూ, అణు భౌతిక శాస్త్రానికి సంబంధించిన పలు కమీషన్లకు ఛైర్మన్ గా వ్యవహరించాడు.


మూలాలు

[మార్చు]
  1. "The Nobel Prize in Physics 1932". Nobelprize.org. Retrieved 2012-12-07. ఈ మూలం తెలిపేదేమిటంటే ఆయనకు 1932లో నోబెల్ బహుమతి ప్రకటించినా అది 1933 లో ప్రధానం చేయబడింది.