వేగాయమ్మపేట ఎస్టేటు
Jump to navigation
Jump to search
వేగాయమ్మపేట ఎస్టేటు ఒక పురాతన జమీందారీ ఎస్టేటు. 1802–03లో 17,196 ఆదాయంతో, 8,464 పేష్కషుతో బ్రిటిష్ ప్రభుత్వం దీనికి శాశ్వత పరిష్కారం (పర్మనెంట్ సెటిల్‌మెంట్) చేసింది.[1] ఈ ఎస్టేటులో 10 గ్రామాలున్నాయి.
చరిత్ర
[మార్చు]వేగాయమ్మపేట ఎస్టేటు మొదట్లో అదే పేరుతో ఉన్న జమీందారీగా ఉండేది. హైదర్ బాద్షా దాన్ని వాడ్రేవు కుటుంబానికి మంజూరు చేశాడు. బ్రిటిషు ప్రభుత్వం ఇది 1802-03 లో దానికి శాశ్వత పరిష్కారం చేసింది. 1809 లో దీన్ని మరిన్ని ఎస్టేట్లుగా విభజించారు. వేగాయమ్మపేట వాటాలో 10 గ్రామాలు వచ్చాయి.[2] ఈ ఎస్టేటు లోని గ్రామాలు:
- వేగాయమ్మపేట
- కుదువూరు
- గుడిగల్ల
- మతుకుమిల్లి
- కూరకళ్లపల్లి
- ఉట్రుమిల్లి
- నేలటూరు
- నిడసనమెట్ట
- గుమ్మిలేరు
- మిర్తిపాడు
1879 లో ఈ జమీందారీకి సంబంధించిన దావా, తీర్పు కోసం ప్రైవీ కౌన్సిల్‌కి వెళ్లింది.[3]
మూలాలు
[మార్చు]- ↑ "Vegayammapeta Zamindari".
- ↑ MacLean, Charles Donald (1879). "Vegayammapeta Zamindarini Vadrevu Ranganayakamma".
- ↑ "History of Vegayammapeta Estate".