Jump to content

వేదిక:విజ్ఞానశాస్త్రము/2012 06వ వారం

వికీపీడియా నుండి
రక్తంలోని వివిధ రక్తకణాలు.

నెత్తురు లేదా రక్తము ద్రవరూపం లో ఉన్న శరీర నిర్మాణ ధాతువు లేదా కణజాలం. జీవి మనుగడకి రక్తం అత్యవసరం. రక్తానికి సంబంధించిన అధ్యయనాన్ని 'హిమటాలజీ' అంటారు. వైద్య పరిభాషలో రక్తానికి సంబంధించిన విషయాలకు సాధారణంగా హీమో లేదా హిమాటో అన్న ఉత్తరపదము ఉంటుంది.

రక్తాన్ని చూడగానే వెంటనే ఆకట్టుకునేది దాని ఎర్రటి ఎరుపు రంగు. రక్తానికి ఈ రంగునిచ్చేది రక్తంలో ఉన్న రక్తచందురం అనే ప్రాణ్యం. ఈ రక్తచందురాన్నే ఇంగ్లీషులో హిమోగ్లోబిన్‌ అంటారు.

రక్తాన్ని నిలడితే కొద్ది సేపటిలో రక్తం మూడు స్తరాలు గా విడిపోతుంది. పైకి తేలుతూ కనిపించే దానిని ప్లాస్మా అంటారు. దీని దిగువన, తెల్లటి స్తరం తెల్ల రక్త కణాలు, లేదా సూక్ష్మంగా తెల్ల కణాలు ఉంటాయి. అట్టడుగున ఎర్రటి స్తరం ఎర్ర రక్త కణాలు, లేదా సూక్ష్మంగా ఎర్ర కణాలు. ఉరమరగా రసి స్తరం 55 శాతం ఉంటే ఎర్ర కణాల స్తరం 45 శాతం.

రక్తం చాలా పనులు చేస్తుంది. వీనిలో ముఖ్యమైనవి: ఎర్ర కణాలలో ఉండే రక్తచందురంతో కణజాలాలకు ప్రాణవాయువును సరఫరా చెయ్యటం; గ్లూకోజు, ఎమైనో ఆమ్లాలు, ఫాటీ ఆసిడ్ ల వంటి పోషకాలను సరఫరా చెయ్యటం; కార్బన్ డై ఆక్సైడ్, యూరియా, లాక్టిక్ ఆమ్లంల వంటి వ్యర్థ పదార్థాలను నిర్మూలించటం; కొత్త క్రిములను, రోగకారకాలను నిరోధించటం; దెబ్బ తగిలి రక్తం కారుతూ ఉంటే అది గడ్డ కట్టేలా చూడటం vitamin "D"; హార్మోన్ల సరఫరాకి వాహాకిగా పని చెయ్యటం; దెబ్బతిన్న కణజాలాల సమాచారాన్ని మెదడుకు చేరవేయటం; శరీరంలో ఆమ్ల-క్షార తుల్యతని (pH విలువని) నియంత్రించటం; శరీర ఉష్ణోగ్రతను నియంత్రించటం.