వేపగింజల కషాయం
Appearance
వేపగింజల కషాయం ఒక వ్యవసాయదారులు సస్యరక్షణలో ఉపయోగించే ద్రవ పదార్థం. దీనిని క్రిమినాశకాలైన రసాయన మందులకు ప్రత్నామ్నాయంగా రైతులు వాడుతున్నారు.[1]
వేపగింజల కషాయం తయారు చేయట
[మార్చు]- కావలసిన పదార్ధాలు
- 5 శాతం వేపగింజల కషాయం గల 100 లీటర్ల ద్రావణం తయారు చేయటకు కావలసిన పదార్ధాలు.
- బాగా ఎండిన వేప గింజల విత్తనాలు – 5 కేజీలు.
- నీరు – 100 లీటర్లు.
- సబ్బు పొడి -200 గ్రాములు.
- వడపోత కోసం పలుచని గుడ్డ.
- పద్ధతి
- అవసరమైన 5 కేజీల వేప గింజల విత్తనాలను తీసుకోవాలి.
- విత్తనాలను నూరి పొడి చేయాలి
- 20 లీటర్ల నీటిలో ఒక రాత్రంతా నానబెట్టాలి.
- ఉదయాన్నే కర్రపుల్లతో ద్రావణాన్ని పాల తెలుపు రంగు వచ్చే వరకు బాగా కలయ తిప్పాలి.
- పలుచని గుడ్డసంచితో వడపోసి 100 లీటర్ల ద్రావణం తయారు చేయాలి.
- 1 శాతం సబ్బు పొడిని ద్రావణంలో కలిపి తిప్పాలి.
- ద్రావణాన్ని బాగా కలిపి ఉపయోగించుకోవాలి.
- గమనిక
- వేప కాయలను కాయలు కాసే కాలంలో సేకరించి, నీడలో గాలికి ఆరబెట్టాలి.
- ఎనిమిది నెలల కంటే ఎక్కువ సమయం ఉన్న విత్తనాలను ఉపయాగించరాదు. ఈ వయసు కంటే ఎక్కువ దాచి ఉంచిన విత్తనాలు[+] ద్రావణం తయారికి[+] పనికిరావు.
- ఎల్లప్పుడు తాజాగా తయారుచేసిన వేప గింజల కషాయ ద్రావణాన్ని ఉపయాగించాలి.
- మంచి ఫలితాలు రావాలంటే ద్రావణాన్ని 3.30 P.M తర్వాత పిచికారి చేయాలి